For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎల్జీబీటీల జెండా ప్రత్యేకత అదే, స్వలింగ సంపర్కుల్లోని రకాల గురించి తెలుసా?

ఎల్‌జీబీటీ అంటే లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్ అని కొందరికి తెలిసి ఉంటుంది. అయితే వీరిలో రకాల గురించి చాలా మందికి అంతగా అవగాహన ఉండదు. లెస్బియన్ అంటే ఒక మహిళకు మరో మహిళపై ఆకర్షణ కలగడం.

|

స్వలింగ శృంగారం నేరం కాదని అందులో స్వచ్ఛగా పాల్గొనవచ్చని ఇటీవల వెలువడిని తీర్పు గురించి అందరికీ తెలిసిందే. దీంతో స్వలింగ సపర్కాన్ని ఇష్టపడేవాళ్లంతా కూడా ఆనందోత్సవాలు నిర్వహించుకున్నారు. అయితే ఇందులో కీలకమైన అంశం ఎల్‌జీబీటీ అంటే లెస్పియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌ జెండర్ అని అర్థం.

వీరంతా స్వేచ్ఛగా వారికి నచ్చినట్లుగా ఇప్పుడు సెక్స్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ఎల్‌జీబీటీ వర్గానికి సంబంధించిన వారు చాలా రోజులు పోరాడారు.ఎల్‌జీబీటీకి సంబంధించి ఒక జెండా కూడా ఉంది. ఇంద్రధనస్సులోని రంగులతో ఈ జెండాను వీరు రూపొందించుకున్నారు. దీన్ని రెయిన్ బో జెండా అని కూడా అంటారు. అసలు ఈ జెండా రూపకల్పన వెనుక ఒక అంతారార్థం ఉంది. 1978 లో ఈ జెండాను విడుదల చేశారు.

స్వలింగ వ్యక్తులను గుర్తించడానికి

స్వలింగ వ్యక్తులను గుర్తించడానికి

స్వలింగ కళాకారుడు, పౌర హక్కుల కార్యకర్త గిల్బర్ట్ బేకర్ 1978 లో స్వలింగ సంపర్క ఉద్యమానికి చిహ్నంగా రెయిన్ బో ప్రైడ్ జెండాను రూపొందించాడు.

8 రంగులుంటాయి

8 రంగులుంటాయి

ఎల్‌జీబీటీలకు సంబంధించిన ఒర్జినల్ జెండాలో 8 రంగులుంటాయి. అయితే అందులోని కొన్ని రంగులను 1998 లో తొలగించారు. ప్రస్తుతం ఈ జెండాలో 6 రంగులుంటాయి. ఈ జెండాలో ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలం, వైలెట్ రంగులుంటాయి.

రంగుల ప్రాధాన్యతలు

రంగుల ప్రాధాన్యతలు

అయితే ఒక్కో రంగుకు ఒక్కో ప్రాధాన్యం ఉంది.

- హాట్ పింక్ - ఇది సెక్స్ ని సూచిస్తుంది.

- ఎరుపు - ఇది జీవితాన్ని సూచిస్తుంది. - ఆరెంజ్ - ఇది వైద్యాన్ని సూచిస్తుంది.

- పసుపు - ఇది సూర్యకాంతి సూచిస్తుంది.

- ఆకుపచ్చ - ఇది ప్రకృతిని సూచిస్తుంది.

- టర్కోయిస్ - ఇది మ్యాజిక్ / కళను సూచిస్తుంది. - ఇండిగో - ఇది ప్రశాంతతకు ప్రాతినిధ్యం వహిస్తుంది.- వైలెట్ - ఇది స్పిరిట్ ని సూచిస్తుంది.

ఎల్‌జీబీటీ అంటే..

ఎల్‌జీబీటీ అంటే..

ఎల్‌జీబీటీ అంటే లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్ అని కొందరికి తెలిసి ఉంటుంది. అయితే వీరిలో రకాల గురించి చాలా మందికి అంతగా అవగాహన ఉండదు. లెస్బియన్ అంటే ఒక మహిళకు మరో మహిళపై ఆకర్షణ కలగడం. ఆడవాళ్లు, ఆడవాళ్లు సెక్స్ లో పాల్గొనడమే లెస్బియన్ సెక్స్. ఇక గే అంటే ఒక పురుషుడిపై మరో పురుషుడికి ప్రేమ కలగడం. మగాలిద్దరూ సెక్స్ చేసుకోవడాన్ని గే సెక్స్ అంటారు.

బై సెక్సువల్ అంటే..

బై సెక్సువల్ అంటే..

బై సెక్సువల్ అంటే ఎవరికైనా ఎవరిపైనైనా ప్రేమ కలగడం, పురుషుడు, పురుషుడిపై మోజు పడడం లేదంటే మహిళపై మోజుపడడం, లేదంటే మహిళ మరో మహిళపై మోజు పడడం. ఇలా ఏ వర్గం వారు సెక్స్ చేసుకున్నా దాన్ని బై సెక్సువల్ సెక్స్ అంటారు. ట్రాన్స్‌జెండర్ అంటే మగ నుంచి ఆడగా మారడం, ఆడ నుంచి మగగా మారడం. వీళ్లు వారి శరీర అవయవాలను ఆపరేషన్ల ద్వారా మార్చుకుంటూ ఉంటారు.

English summary

LGBT Flag Meaning Behind The Colours And Its History

LGBT Flag Meaning Behind The Colours And Its History
Desktop Bottom Promotion