శారీరక వాంఛ అధికంగా కలిగివున్న రాశులవారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా! అయితే చదవండి.

Written By: Gayatri Devupalli
Subscribe to Boldsky

జ్యోతిష్య శాస్త్రంలో, కొన్ని రాశుల వారితో పోల్చిచూస్తే కొన్ని రాశుల వారు ఎక్కువ ప్యాషనేట్ గా ఉంటారు. ఈ రాశుల వారు తమ భాగస్వామి ఎడల అధిక భావోద్వేగాలు కలిగి ఉంటారు. వీరి మధ్య లోతైన బంధం, బలమైన భావనలు పెనవేసుకుని ఉంటాయి.

ఇప్పుడు మనం లోతైన బంధం కలిగి ఉండే రాశులను గురించి తెలుసుకుందాం!

Most Passionate Zodiac Signs Listed According To Their Ranking

ఈ నాలుగు రాశులవారికి తమ భాగస్వామిలో మోహాన్ని ఎట్లా రాజేయాలో బాగా తెలుసు. వారెవరో తెలుసుకోవాలనుకుంటున్నారా! అయితే చదవండి మరి...

వృశ్చికం: అక్టోబర్24 - నవంబర్22

వృశ్చికం: అక్టోబర్24 - నవంబర్22

ఈ రాశివారు అత్యంత మోహావేశాలు కలిగిన వారిగా జ్యోతిష్య పట్టికలో తెలుపబడింది. వీరు అత్యంత దృఢ సంకల్పం కలిగిన వ్యక్తులుగా పేరెన్నికగన్నారు. భాగస్వామి ఎడల అత్యంత తీవ్రమైన కోరిక కలిగి ఉంటారు.

వీరు ఎల్లప్పుడూ జాగరూకులై, భాగస్వామిని మెప్పించాలనే ఆత్రుతతో ఉంటారు. వీరెంతో ఉత్సాహవంతమైన మరియు ఆసక్తి కలిగిన ప్రేమికులవటం చేత వారి బంధం నిత్యనూతనంగా ఉంటుంది. అంతేకాక వీరు సున్నితమైన మనసు కలిగి ఉంటారు. భాగస్వామి నుండి కూడా అంతే ఆదరాభిమానాలను ఆశిస్తారు.

ధనుస్సు: నవంబర్ 23-డిసెంబర్ 22

ధనుస్సు: నవంబర్ 23-డిసెంబర్ 22

సరికొత్త అనుభవాలకై వీరు పడే తాపత్రయం వలన వీరి భాగస్వామికి జీవితంలో ప్రతిదినం ప్రత్యేకంగాను, నూతనంగా అనిపిస్తుంది. వీరు ప్రాపంచిక విషయాల్లో మాత్రమే కాకుండా, నాలుగు గోడల మధ్య పంచుకునే ప్రేమలో కూడా సాహసాలను కోరుకుంటారు. వీరు వివిధ భంగిమల్లో మాయ చేసి భాగస్వామిని ఎప్పుడూ ఆనందంగా ఉంచుతారు. భాగస్వామి వీరి సాన్నిధ్యాన్ని ఎంతో ఇష్టపడతారు, ఎందుకంటే ప్రతిక్షణం వీరికి ఆనందాశ్చర్యాలు ఎదురావుతుంటాయి కనుక!

మకర రాశి: డిసెంబర్23 - జనవరి20

మకర రాశి: డిసెంబర్23 - జనవరి20

ఈ రాశివారు చూడటానికి అంటీముట్టనట్లుగా కనిపిస్తారు కానీ నిజానికి వారు ఆత్మవిశ్వాసంతో , సులువుగా ఉన్నప్పుడు మాత్రం చాలా ప్యాషనేట్ గా ఉత్తేజంతో ఉంటారు. వీరు మంచి ప్రేమికులు మాత్రమే కాదు కొత్త విషయాలను ప్రయత్నించడంతో కూడా ముందుంటారు. వాళ్ళు ప్యాషనే వారి మీద నమ్మకానికి పునాది. ఇతరులపై నమ్మకం పెంచుకోవడానికి వీరు సమయం తీసుకున్నప్పటికిని, ఒకసారి నమ్మితే మాత్రం వారు సాంతం మీ వారవుతారు .

మేష రాశి: మార్చ్ 21- ఏప్రిల్ 19

మేష రాశి: మార్చ్ 21- ఏప్రిల్ 19

ఈ రాశివారు నిస్సంకోచంగా ఉంటారు మరియు ప్రేమికులతో సన్నిహితంగా మసలుతారు. వీరు శారీరక సంబంధంను చాలా ఇష్టపడతారు. వీరు పడకలో ఉత్సాహంగా మరియు ఎదుటివారిపై తమదే పైచేయి అన్నట్లు ఉంటారు. వీరు ఎదుటివారిని నియంత్రిస్తూ, భీభత్సమైన వాంఛని కలిగి ఉంటారు. తమ కోరిక తీర్చుకోవడంలో తమ భాగస్వామి ఆలోచనలు ఎలా ఉన్నాయనే విషయానికి కూడా ప్రాధాన్యతనివ్వరు. తమలాగే తమ భాగస్వామి కూడా అంతులేని కోర్కె కలిగి ఉండాలని ఆశిస్తారు. వీరితో సాన్నిహిత్యం మీ ఊహలకు అతీతంగా ఉంటుంది.

English summary

Most Passionate Zodiac Signs Listed According To Their Ranking

Scorpio, Sagittarius, Capricorn, and Aries are the 4 zodiac signs that are considered to be the most passionate ones when it comes to relationships. People who are in a relationship with these zodiac signs are going to have a great time, not only in terms of love making but also with other things related to them in the relationship.
Story first published: Tuesday, March 20, 2018, 15:03 [IST]