For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తొడలపై చెయ్యేశాడు, తనపైకి లాక్కున్నాడు, ఒక్కసారి సహకరించమన్నాడు, పోస్ట్ ఊరికే వస్తుందా? #mystory278

By Arjun Reddy
|

నేను పీజీ పూర్తి చేసిన తర్వాత లెక్చరర్ గా జాయిన్ అవుదామనుకున్నాను. పీజీలో నాకు మంచి పర్సెంటేజీ వచ్చింది. ఈజీగా జాబ్ వస్తుందనుకున్నా. కొన్ని ప్రైవేట్ కాలేజీల్లో ట్రై చేశాను. జాబ్ వచ్చింది కానీ అక్కడ టార్చర్ భరించలేక మానేశాను. బాగా వర్క్ ప్రెజర్ ఉండేది.

తర్వాత ఇంటి దగ్గరే ఉండి నెట్ కు ప్రిపేర్ అయ్యాను. కొన్ని రోజుల తర్వాత మళ్లీ జాబ్ లో జాయిన్ అవుదామనుకున్నాను. ఒక కాలేజీ నుంచి గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ వెలువడింది. వెంటనే దానికి అప్లై చేశాను.

వర్క్ ప్రెజర్

వర్క్ ప్రెజర్

అక్కడ వర్క్ ప్రెజర్ కూడా ఎక్కువగా ఉండదని తెలిసింది. అందులో అది క్రాంటాక్ట్ బేసిక్ పై సెలక్షన్. ఒక టర్మ్ బాగా చేస్తే తర్వాత మళ్లీ కూడా నన్నే ఆ పోస్ట్ లో కొనసాగిస్తారని చెప్పారు. దీంతో నేను ఆ పోస్ట్ కు ఎలాగైనా సెలెక్ట్ కావాలని కోరుకున్నాను.

ఆ సార్ కటాక్షం ఉంటే

ఆ సార్ కటాక్షం ఉంటే

అయితే ఆ పోస్ట్ కు కావాల్సింది కేవలం టాలెంట్ మాత్రమే కాదని ఇంకా చాలా కావాలని అర్థమైంది. అలాగే ఆ పోస్ట్ నియామకం మొత్తం కూడా ఒక పెద్ద సార్ చేతిలో ఉందని తెలిసింది. ఆ సార్ కటాక్షం ఉంటే తప్ప పోస్ట్ దక్కదని అర్థమైంది.

కాఫీ తాగుతావా

కాఫీ తాగుతావా

దీంతో నేను ఆ సర్ ని డైరెక్ట్ గా వెళ్లి కలిశాను. చాలా బాగా పలకరించాడు. కాఫీ తాగుతావా అంటూ అతనే కాఫీ చేసుకుని తీసుకొచ్చాడు. తర్వాత నా డిటేల్స్ మొత్తం చెప్పాను. "నాకు ఆ పోస్ట్ ఎలా అయినా వచ్చేలా చేయండి సర్. నేను మంచి ర్యాంకర్ ని. బాగా టీచ్ చేయగలుగుతాను." అని చెప్పాను.

Most Read :వయాగ్రా వాడిన తొలినాళ్లలో సెక్స్ బాగా చేశా, ఇప్పుడు చేయలేకపోతున్నా, వాటిని వాడితే ఏమతుంది?

నీకే వచ్చేలా చేస్తా మరి నాకేంటీ

నీకే వచ్చేలా చేస్తా మరి నాకేంటీ

సరే.. ఆ పోస్ట్ నీకే వచ్చేలా చేస్తాను.. మరి నాకేంటీ అన్నాడు. ఏదైనా చిన్న ట్రీట్ అడుగుతున్నాడేమో అనుకున్నాను. సరే సర్ ఫస్ట్ సాలరీరాగానే మీకు చిన్న పార్టీ ఇస్తాను అన్నాడు. సాలరీతో అవసరం లేకుండానే నువ్వు నన్ను సంతోషపరిచే మార్గం ఉంది అన్నాడు. తర్వాత తను ముద్దు పెట్టుకొనేందుకు దగ్గరకు వచ్చాడు.

పిరుదులపై రెండు చేతులు వేసి

పిరుదులపై రెండు చేతులు వేసి

ఆ సమయంలో నేను తన పక్కనే సోఫాలో కూర్చొవడంతో నా తొడలపై చెయ్యివేశాడు. తర్వాత నా పిరుదులపై రెండు చేతులు వేసి తనపైకి లాక్కున్నాడు. ఆ క్షణంలో అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. ఏంటి సర్ మీరు ఇలా చేస్తున్నారన్నాను. మరి పోస్ట్ ఊరికే వస్తుందా? నువ్వు నాకు సహకరిస్తే నేను నీకు సహకరిస్తానన్నాడు.

ఒక్కసారి సహకరించు

ఒక్కసారి సహకరించు

నేను అక్కడి నుంచి వెంటనే ఇంటికి వెళ్లేందుకు బయల్దేరాను. రేపటి వరకు ఆలోచించుకో.. నీకు పోస్ట్ కావాలంటే నాకు ఒక్కసారి సహకరించు అన్నాడు. ఆ రోజు రాత్రి బాగా ఆలోచించాను. మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎలా అయిన సరే జాబ్ లో జాయిన్ కావాలనుకున్నాను.

Most Read :నా కోడలు నా కొడుకుతో ఎప్పుడు పడుకోవాలనే విషయాన్ని వాళ్ల అమ్మను అడుగుతోంది

ఆ ముసలోడి పక్కన పడుకుని

ఆ ముసలోడి పక్కన పడుకుని

కానీ ఒకడి దగ్గర పడుకుని తెచ్చుకునే జాబ్ నాకు అవసరం లేదనిపించింది. నా దగ్గర టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి.. అలాంటప్పడు ఆ ముసలోడి పక్కన పడుకుని జాబ్ ఎందుకు తెచ్చుకోవాలనిపించింది. ఆ రోజు ఆ ఇంటర్వ్యూకు వెళ్లలేదు. కానీ ఆ రోజు మరో అమ్మాయి ఆ జాబ్ కు సెలెక్ట్ అయ్యింది. ఆమెను తప్పకుండా అతను అనుభవించి ఉంటాడని నాకు అర్థమైంది.

అతనికి సహకరించి ఉండి ఉంటే

అతనికి సహకరించి ఉండి ఉంటే

తర్వాత నేను నెట్ లో క్వాలిఫై అయ్యాను. ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నాను. ఒకవేళ నేను అప్పుడు అతనికి సహకరించి ఉండి ఉంటే అతను రోజూ నన్ను బ్లాక్ మెయిల్ చేసి తన కోరికను తీర్చుకునేవాడు. అతను అడిగినప్పుడల్లా ముద్దు ఇవ్వాల్సి వచ్చేది. గిల్లినప్పుడల్లా గిల్లించుకోవాల్సి వచ్చేది. మన దగ్గరకు టాలెంట్ ఉంటే ఏ గొట్టంగానికి భయపడాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం.

English summary

my me too story he asked me to kiss him

my me too story he asked me to kiss him
Desktop Bottom Promotion