Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
చేతిపై ఉండే రేఖల వల్ల అక్రమసంబంధం ఉన్నట్లు తెలుసుకోవొచ్చు, వివాహ రేఖలు చెప్పే నిజాలు, రెండు రేఖలుంటే
కొందరికి చిటికెన వేలు కింద నాలుగు చిన్నచిన్న రేఖలుంటాయి. వీటిన్నంటినీ కూడా పెళ్లి రేఖలే అంటారు. అయితే అలాంటి వారికి నాలుగు సార్లు లేదంటే అంతకంటే ఎక్కువసార్లు పెళ్లిళ్లు అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు ఇలా
హస్తరేఖలను బట్టీ జీవితంలో చాలా మార్పులు చేర్పులు జరుగుతాయని చాలామంది నమ్ముతారు. చేతిరేఖలు గురించే చెప్పే శాస్త్రాన్ని సాముద్రిక శాస్రం అంటారు. చేతిపై చాలా రేఖలుంటాయి. అందులో పెళ్లి రేఖ కూడా ఒకటి.
ఈ రేఖను బట్టి వివాహం ఎప్పుడవుతుంది.. పెళ్లి తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయనే విషయాలు తెలుస్తాయి. అంతేకాందు మీరు ఎన్ని సార్లు పెళ్లి చేసుకోనున్నారనే విషయం కూడా చేతిపై ఉండే పెళ్లి రేఖ చెబుతుంది.

పెళ్లి రేఖ ఒకటే ఉంటుంది
చాలా మందికి పెళ్లి రేఖ ఒకటే ఉంటుంది. అయితే కొంత మందికి మాత్రం వివాహ రేఖలు రెండు మూడు కూడా ఉంటాయి. ఈ రేఖలు ఎన్ని ఉంటే అన్ని సార్లు వారు పెళ్లి చేసుకుంటారని అర్థం. అలాగే పెళ్లి రేఖ చాలా విషయాలను తెలుపుతుంది.

అన్నింటినీ వివరిస్తుంది
వివాహబంధంలో ఏర్పడే సమస్యలు గురించి, దాంపత్యం ఎలా ఉండనుందనే విషయాలను కూడా పెళ్లి రేఖ వివరిస్తుంది. మరి చేతిలోని పెళ్లి రేఖలు ఎక్కడుంటాయి. వాటిని ఎలా గుర్తు పట్టాలనేదే కదా మీ డౌట్. మరి ఎందుకాలస్యం. చదవండి మరి. చిటెకెన వేలు కింద వివాహ రేఖ ఉంటుంది. అయితే ఇది ఒక్కొక్కకరికి ఒక్కో రకంగా ఉంటుంది.

రేఖ మధ్యలో గ్యాప్ వస్తే
కొందరికి ఈ వివాహ రేఖ మధ్యలో కాస్త గ్యాప్ వస్తుంది. రేఖ మొత్తం నిటారుగా ఉండకుండా మధ్యమధ్యలో విడిపోతూ ఉంటుంది. మీ రేఖ కూడా అలా ఉంటే మీ వివాహ బంధం అంత గట్టిగా ఉండదని అర్థం. అలాంటి వారు పెళ్లయిన తర్వాత విడాకులు తీసుకునే అవకాశం ఉంటుంది.
అంతేకాదు ఈ రేఖ మధ్యలో ఎన్ని సార్లు గ్యాప్ వస్తే అన్ని సార్లు అతను పెళ్లిళ్లు చేసుకునే అవకాశం ఉంది.

రెండు రేఖలు
కొందరికి పెళ్లి రేఖ రెండు ఉంటాయి. ఆ రెండు కూడా సమాంతరంగా ఉంటాయి. ఇలాంటి వాళ్లు రెండు పెళ్లిళ్లు చేసుకుంటారని అర్థం. చిటికెన వేలు కింద ఇలాంటి రెండు రేఖలున్న వారు జీవితంలో రెండు పెళ్లిళ్లు చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు మొదటి పెళ్లి అయిన తర్వాత ఒక ప్రాంతంలో, రెండో పెళ్లి అయిన తర్వాత మరొక ప్రాంతంలో నివసించే అవకాశం ఉంటుంది.

ఒకటి చిన్నగా, మరొకటి పెద్దగా
చిటికెన వేలు కింద కొందరికి ఒక చిన్న రేఖ, దాని కింద మరో పెద్ద రేఖ ఉంటుంది. ఇలాంటి రెండు రేఖలు కలిగిన వారు ట్రైయాంగిల్ ప్రేమను కలిగి ఉంటారు. లేదంటే వివాహేతర సంబంధాలను కలిగి ఉంటారు.
భార్య లేదంటే భర్తతో కాకుండా మరొకరితో సంబంధం కలిగి ఉన్నట్లు ఈ రెండు రేఖలు సూచిస్తాయి. భార్యను కాకుండా మరో అమ్మాయిని మెయింటెన్ చేసే వాళ్లకు ఇలాంటి రేఖ ఉంటుంది.

జీవన రేఖకు తగులుతూ
ఇక కొందరికి జీవనరేఖ అంటే హృదయ రేఖ దగ్గరగా పెళ్లి రేఖ ఉంటుది. ఇలాంటి వారు వైవాహిక జీవితంలో అంత సంతోషంగా ఉండరు. జీవనరేఖను టచ్ చేస్తూ పెళ్లి రేఖ ఉంటే అలాంటి వారి వైవాహిక బంధంలో కష్టాలుంటాయి.

నాలుగు చిన్నచిన్న రేఖలు
కొందరికి చిటికెన వేలు కింద నాలుగు చిన్నచిన్న రేఖలుంటాయి. వీటిన్నంటినీ కూడా పెళ్లి రేఖలే అంటారు. అయితే అలాంటి వారికి నాలుగు సార్లు లేదంటే అంతకంటే ఎక్కువసార్లు పెళ్లిళ్లు అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు ఇలాంటి రేఖలన్నా అబ్బాయిలు అందంగా కనపడే ప్రతి అమ్మాయి తన సొంతం కావాలని కోరుకుంటాడు.
అలాగే ఇలాంటి రేఖలున్న అమ్మాయిలు కూడా చాలమంది పొందుకోరుతారు. నాలుగు చిన్న చిన్న రేఖలు మీ చేతిలో ఉంటే మాత్రం మీకు కచ్చితంగా చాలాసార్లు పెళ్లిళ్లు అయ్యే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications