ఈ వస్తువులను మీ బెడ్ క్రింద 21 రోజులు ఉంచడం వల్ల మీకు అదృష్టం వరిస్తుంది

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

అదృష్టం వరించడానికి ఎప్పటికప్పుడు కొత్త పద్దతులను అనుసరిస్తూనే ఉంటాము. కానీ అందులో ఎన్ని నిజంగా మనకు ఉపయోగపడుతున్నాయో మీకు తెలుసా?

అనేకమంది అనేక విషయాలను చెప్తూ ఉంటారు , వాటిలో కొన్ని మాత్రమే అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఇలాంటి వాటిలో ఎక్కువగా వాస్తును నమ్మడం జరుగుతుంది. ఇందులో కొన్ని వాస్తు ప్రకార సూచనలు మాత్రం ఎప్పటికీ మానవాళికి మేలు చేస్తూనే ఉంటాయి. అందులో కొన్ని ఇక్కడ పొందుపరచడం జరిగినది.

vastu tips in telugu

కొన్ని వస్తువులను మీ పడక గదిలో పడక కింద 21 రోజులు ఉంచడం ద్వారా అదృష్టం వరిస్తుందని, తద్వారా అనేక మానసిక శారీరక సమస్యలను దూరం చేసి తద్వారా అదృష్టం వరిస్తుందని చెప్పబడినది. ఎలానో ఇక్కడ చూడండి.

మీ కోపం నియంత్రించడానికి :

మీ కోపం నియంత్రించడానికి :

నీటితో నింపిన రాగి పాత్రను మీ పడక కింద ఉంచడం మూలంగా మీ కోపం నియంత్రించబడుతుంది మరియు ఒక చిన్న ఎరుపు గంధపు చెక్కను మీ దిండు కింద ఉంచడం ద్వారా కూడా మీ కోపాన్ని నియంత్రించుకోగలరు.

ఆత్మ స్థైర్యం పెరుగుటకు:

ఆత్మ స్థైర్యం పెరుగుటకు:

నీటితో నింపిన వెండి పాత్ర ను పడక కింద ఉంచడం ద్వారా మీ ఆత్మస్థైర్యం మెరుగుపడుతుంది అని తెలుపబడింది. మరియు వెండి ఆభరణాలు ధరించడం కూడా ఎన్నో అద్భుతాలను చూపిస్తుంది.

ధైర్యవంతులుగా మారండి:

ధైర్యవంతులుగా మారండి:

మీరు ధైర్యవంతులుగా మారుటకు దిండు కింద వెండి లేదా బంగారు ఆభరణాలు ఉంచవలసినదిగా సూచించబడినది. ఇది ఎన్నో రకాల జాతక దోషాలను, దురదృష్టాలను కూడా తొలగిస్తుంది అని నమ్మకం. ఇది కాక, మంచి ఫలితాల కోసం మీ మంచం కింద ఒక కాంస్యపు గిన్నెలో నీటిని ఉంచడం మంచిది.

అదృష్టానికి దారులు తెరవండి :

అదృష్టానికి దారులు తెరవండి :

ఒక చేపను వెండి పాత్రలోని నీళ్ళలో ఉంచడం ద్వారా కానీ, లేదా రెండు వెండి చేపల బొమ్మలను మీ దిండు కింద ఉంచడం ద్వారాకానీ అదృష్టం వరిస్తుంది.

దురదృష్టాన్ని తరమoడి :

దురదృష్టాన్ని తరమoడి :

మీ అదృష్టం మెరుగుపరచడానికి, మీరు దరిద్ర దేవత కన్నుకు దూరంగా ఉండాలి. దీని కోసం, 21 రోజులు మీ మంచం కింద నీటితో నింపబడి ఉన్న ఒక ఇనుప పాత్రను ఉంచండి. ఇది కాక, మీరు ఒక నీలం రాయిని మీ దిండు కింద ఉంచండి. తద్వారా అనేక ప్రతికూల ప్రభావాలు దూరమై అదృష్టం వరిస్తుందని చెప్పబడినది.

English summary

Place These Things Under Your Bed For 21 Days And Get Lucky

Improve your luck by keeping the best of things under bed for the next 21 days. These things are believed to bring in good luck. To control your anger, you need to keep a copper vessel filled with water under your bed or at the bedside. You can also need to keep a piece of red sandalwood under your pillow.
Story first published: Thursday, March 29, 2018, 20:00 [IST]