For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ రాశి చక్రాలకు సరిపోయే చక్రాలు ఇవే.

మీ రాశి చక్రాలకు సరిపోయే చక్రాలు ఇవే.

|

జ్యోతిష్యశాస్త్రం విస్తృతమైనది, ఎంత నేర్చుకున్నా కూడా నేర్చుకోవాల్సింది ఇంకా మిగిలే ఉంటుంది. తెలుసుకునేకొలదీ ఆసక్తిని పెంచేది కూడా.

మన జీవితాలను ప్రభావితం చేసే శక్తివంతమైన చక్రాల గురించిన వివరాలతో ఈరోజు మీముందుకు వస్తుంది మన బోల్డ్స్కీ. మన రాశిచక్రాల సంకేతాల ఆధారంగా సూచించబడిన చక్రాలు ఇవి.

చక్రాల గురించిన వివరాలు తెలుసుకోవడంలో ఆసక్తి ఉన్నవారికి ఈవ్యాసం మరింత ఉపయోగపడుతుంది.

Powerful Chakras Based On Your Zodiac Sign

భౌతిక మరియు యోగ శరీరాలలో ఉన్న శక్తి కేంద్రాలని చక్రాలుగా వ్యవహరిస్తారు. శరీర జీవక్రియల నుండి ఆలోచనా విధానాల వరకు ఈ శక్తి కేంద్రం ప్రతి ఒక్క అంశాన్ని కలిగి ఉంటుంది. ఇది భౌతిక మరియు మానసిక చర్యలన్నింటితో శరీరాలను కలుపుతుంది.

వీటిలో 7చక్రాలు ఉనికిలో ఉన్నాయి. ఈ 7చక్రాలలో ప్రతిఒక్కటీ ఒక గ్రహానికి అనుసందానమైందని నమ్ముతారు. ప్రతి చక్రం,ఈ గ్రహాలను అనుసరించి వాటి లాభాలను, సానుకూల మరియు ప్రతికూల అంశాలను కలిగి ఉంటాయి.

మీ రాశిచక్రానికి సంబంధించిన చక్రం గురించిన అవగాహనకై ఈ వ్యాసం మీకు సహాయపడుతుంది.

మేషం: మార్చి21-ఏప్రిల్19 (స్వాదిష్టాన చక్రం)

మేషం: మార్చి21-ఏప్రిల్19 (స్వాదిష్టాన చక్రం)

ఈ శక్తివంతమైన చక్రం జననేంద్రియాల ప్రాంతంలో ఉంటుంది. ఈ చక్ర సక్రియం అయినప్పుడు, అది విశ్వాసం మరియు లైంగిక అయస్కాంతత్వాన్ని ప్రసరిస్తుంది. ఆ సక్రియతను పొందిన వ్యక్తులు అత్యంత ఆకర్షణీయంగా, చురుకుగా ఉంటారు. ఈ చక్రంలో సమస్యలు తలెత్తినప్పుడు, అపరాధం, అవమానం మరియు ఆత్మవిశ్వాసం లోపించడం వంటి ప్రతికూల అంశాలకు కేంద్రంగా మారుతుంది.

వృషభం: ఏప్రిల్20-మే20 (అనాహత చక్రం)

వృషభం: ఏప్రిల్20-మే20 (అనాహత చక్రం)

ఇది ఛాతీ మధ్యలో హృదయ స్పందనలు ఉద్భవించే ప్రదేశంలో ఉంటుంది. దీన్ని హృదయ చక్రం అని కూడా వ్యవహరిస్తారు. ఈ చక్రం సక్రియం అయినప్పుడు, అది ప్రేమ పొందడమే కాకుండా, ప్రతికూల శక్తులను శాంతింపచేయడం వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ చక్రంలో సమస్యలు తలెత్తినప్పుడు, వ్యక్తులు అధిక భావోద్వేగాలకు గురవడం వంటి సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది, క్రమంగా వ్యక్తి కొన్ని ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనవలసి ఉంటుంది.

మిధునం: మే21-జూన్20 (విశుద్ధ చక్రం)

మిధునం: మే21-జూన్20 (విశుద్ధ చక్రం)

ఇది అత్యంత శక్తివంతమైన చక్రాలలో ఒకటి. ఈ చక్రం సంబంధాలకు మరియు స్వీయ వ్యక్తీకరణకు సంబంధించినది. ఈ చక్రం సక్రియం అయినప్పుడు, వ్యక్తులు మరింత సృజనాత్మకంగా ఉంటారు మరియు బుద్దికుశలత ఉపయోగించి క్లిష్టమైన పరిస్థితులతో కూడా అధిగమించగలుగుతారు. క్రమంగా తెలివైనవారిగా సమాజంలో ఒక పేరు ఉంటుంది. ఈ చక్రంలో సమస్యలు తలెత్తినప్పుడు లేదా చర్యలు నిరోధానికి గురైనప్పుడు, వారు స్వేచ్ఛని కోల్పోవడం, భావవ్యక్తీకరణ సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది.

కర్కాటకం: జూన్ 21- జూలై 22 (ఆజ్ఞా చక్రం)

కర్కాటకం: జూన్ 21- జూలై 22 (ఆజ్ఞా చక్రం)

ఈ చక్రం మన కనుబొమ్మల మధ్య ఉంటుంది. దీనిని మానసిక మరియు సూక్ష్మ శక్తులకు కేంద్ర బిందువుగా భావిస్తారు. ఈ చక్రంలో సమస్యలు తలెత్తినప్పుడు లేదా చర్యలు నిరోధానికి గురైనప్పుడు, వ్యక్తులు సహజ శైలిని కోల్పోతారు మరియు ఒక గందరగోళ వాతావరణం నెలకొంటుంది.

సింహం: జులై 23-ఆగస్టు 23 (సహస్రార చక్రం)

సింహం: జులై 23-ఆగస్టు 23 (సహస్రార చక్రం)

ఇది సూర్యునితో ముడిపడి ఉన్నందున దీనిని అత్యంత ముఖ్యమైన చక్రంగా భావిస్తారు. ఈ చక్రం మన తలపై ఉంటుంది మరియు దైవిక శక్తులతో సంబంధం కలిగి ఉండే క్రమంలో భాగంగా ఉపయోగపడుతుంది. ఈ చక్రం చక్కగా పనిచేస్తున్నప్పుడు, ఆ వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని కలిగి ఉండడమే కాకుండా వీరిలో తేజస్సు ప్రకాశిస్తుంది. ఈ చక్రంలో సమస్యలు తలెత్తినప్పుడు లేదా చర్యలు నిరోధానికి గురైనప్పుడు, వారు దైవిక సంబందాన్ని కోల్పోతారు మరియు స్వీయ ఆధారితముగా ఉంటారు.

కన్య: ఆగస్టు 24 - సెప్టెంబర్23 (విశుద్ధ చక్రం)

కన్య: ఆగస్టు 24 - సెప్టెంబర్23 (విశుద్ధ చక్రం)

ఈ చక్రం సంబంధాలకు మరియు స్వీయ వ్యక్తీకరణకు సంబంధించినది. ఈ చక్రం సక్రియం అయినప్పుడు, వ్యక్తులు మరింత సృజనాత్మకంగా ఉంటారు మరియు బుద్దికుశలత ఉపయోగించి క్లిష్టమైన పరిస్థితులతో కూడా ప్రతికూల అంశాలను అధిగమించగలుగుతారు. క్రమంగా సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఈ చక్రంలో సమస్యలు తలెత్తినప్పుడు లేదా చర్యలు నిరోధానికి గురైనప్పుడు, వారు వ్యక్తిగత స్వేచ్ఛని కోల్పోవడం, భావ వ్యక్తీకరణ మరియు భావోద్వేగ సమస్యలను సైతం ఎదుర్కొనవలసి ఉంటుంది. అత్యంత ముఖ్యమైన చక్రంగా దీనిని వ్యవహరిస్తుంటారు.

తుల: సెప్టెంబర్ 24-అక్టోబర్ 23 (అనాహత చక్రం)

తుల: సెప్టెంబర్ 24-అక్టోబర్ 23 (అనాహత చక్రం)

ఛాతీ మధ్యలో హృదయ స్పందనలు జనించే క్షేత్రాన్ని అనాహత చక్రంగా వ్యవహరిస్తారు. ఈ చక్ర సక్రియం అయినప్పుడు, ప్రతిదీ సాధ్యమే అన్నట్లు ఉంటుంది. వ్యక్తులు ప్రియమైన వారి నుండి ప్రేమను పొందగలుగుతారు మరియు ఆరోగ్యంగా ఉంటారు. తులారాశి వారు అత్యంత మంత్రముగ్ధమైన వ్యక్తులుగా చెప్పబడుతారు. మరియు అత్యంత జాగ్రత్తగా ఉంటారు కూడా. ఈ చక్రంలో సమస్యలు తలెత్తినప్పుడు లేదా చర్యలు నిరోధానికి గురైనప్పుడు, భావోద్వేగాలు అధికమవడం, అనారోగ్యం వంటి సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది.

వృశ్చికం: అక్టోబర్ 24-నవంబర్ 22 (స్వాదిష్టాన చక్రం)

వృశ్చికం: అక్టోబర్ 24-నవంబర్ 22 (స్వాదిష్టాన చక్రం)

మేష రాశి వలె, ఈ రాశి కూడా స్వాదిష్టాన చక్రంతో అనుసంధానమై ఉంటుంది. ఈ చక్రం లైంగిక మరియు విశ్వాస సంబంధిత అంశాలలో తన ప్రభావాన్ని చూపుతుంది. ఆ సక్రియతను పొందిన వ్యక్తులు అత్యంత ఆకర్షణీయంగా, చురుకుగా ఉంటారు. ఈ చక్రంలో సమస్యలు తలెత్తినప్పుడు లేదా చర్యలు నిరోధానికి గురైనప్పుడు, అపరాధం, అవమానం మరియు ఆత్మ విశ్వాసం లోపించడం వంటి ప్రతికూల అంశాలకు కేంద్రంగా మారుతుంది.

ధనుస్సు: నవంబర్ 23 - డిసెంబర్22 (మణిపుర చక్రం)

ధనుస్సు: నవంబర్ 23 - డిసెంబర్22 (మణిపుర చక్రం)

ఈ శక్తివంతమైన చక్రం గురుగ్రహం ఆధీనంలో ఉంటుంది, అవకాశాలు మరియు వ్యాపార విస్తరణ వంటి అంశాలు ఈగ్రహంతో ముడిపడి ఉంటాయి. ఈ చక్రం నాభి పైభాగాన ఉంటుంది. ఈ చక్రం సక్రియం అయినప్పుడు, వ్యక్తులు ఉత్సాహంతో మరియు రెట్టింపు అవకాశాలను కలిగి ఉంటారు. మరొక వైపు, ఈ చక్రంలో సమస్యలు తలెత్తినప్పుడు లేదా చర్యలు నిరోధానికి గురైనప్పుడు, వ్యక్తులు సోమరితనానికి గురవడం కొత్త విషయాల గురించి ఆలోచనలు తగ్గించడం వంటి ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి.

మకరం: డిసెంబర్ 23-జనవరి 20 (మూలాధార చక్రం)

మకరం: డిసెంబర్ 23-జనవరి 20 (మూలాధార చక్రం)

ఈ చక్రం కటి ప్రదేశానికి సంబంధించిన చక్రంగా ఉంది. కానీ ఈ మూలాధార చక్రం విషయమై అనేక చర్చలు కూడా జరుగుతున్నాయి. కొందరు ఈ చక్రం మీ అడుగుల మధ్య రెండు అంగుళాల భాగంలో ఉన్నట్లు భావిస్తున్నారు, కొందరు ఈ చక్రం వెన్నెముక యొక్క స్థావరం వద్ద ఉన్నట్లు నమ్ముతారు. ఇది సక్రియం అయినప్పుడు, వారు సృజనాత్మక ధోరణి కలిగి ఉంటారు, మరియు సురక్షితంగా భావిస్తారు. ఈ ప్రపంచంలో ఎటువంటి ప్రతికూల సమస్యలు కూడా అవరోధాలుగా కనిపించవు. ఈ చక్రంలో సమస్యలు తలెత్తినప్పుడు లేదా చర్యలు నిరోధానికి గురైనప్పుడు, వారికి అనారోగ్యం మరియు అభద్రతాభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.

కుంభం: జనవరి21-ఫిబ్రవరి18(మూలాధార చక్రం)

కుంభం: జనవరి21-ఫిబ్రవరి18(మూలాధార చక్రం)

మకర రాశి వలె, కుంభం కూడా మూలాధార చక్రంలోనే అంశాలను పంచుకుంటాయి. ఈ గుర్తుకు సంబంధించిన లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి! ఈ చక్రంలోని చర్యలు నిరోధానికి గురైనప్పుడు, వారికి అనారోగ్యం మరియు అభద్రతాభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.

మీనం: ఫిబ్రవరి19-మార్చి20(మణిపుర చక్రం)

మీనం: ఫిబ్రవరి19-మార్చి20(మణిపుర చక్రం)

ఈ రాశిచక్రం కూడా ధనుస్సురాశి వలెనే శక్తివంతమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఒకే చక్రాన్ని పంచుకునేటప్పుడు, రెండు రాశిచక్రాల లక్షణాలన్నీ ఒకే విధంగా ఉంటాయి

English summary

Powerful Chakras Based On Your Zodiac Sign

Can you believe that each one of us have our own powerful chakras? Chakras are energy centres located both in physical and non-physical bodies. These chakras are based on our zodiac signs. Each of the 7 powerful chakras are believed to be full of occult powers known as millennia. It is said that each of the 7 chakras is believed to correlate to one planet.
Desktop Bottom Promotion