For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్త్రీల అసలు స్వభావాన్ని ఎలా తెలుసుకోవచ్చో చెబుతున్న సాముద్రిక శాస్త్రం.

స్త్రీలలో ఎదో రహస్యం దాగుంది, వాళ్ళ అసలు స్వభావాన్ని అర్థం చేసుకోవడం, ఎటువంటి వాళ్ళో చెప్పడం చాలా కష్టం అయిన పని అని చాలా మంది చెప్పే మాట. కానీ, స్త్రీల వ్యక్తత్వం గురించి ప్రపంచానికి తెలియటానికి మన హ

By R Vishnu Vardhan Reddy
|

"ప్రపంచం లో అందం అనే పదానికి అసలైన నిర్వచనాన్ని ఇచ్చింది స్త్రీ" అన్నాడు ఒక కవి. అది నిజం కూడా ఎందుకంటే ప్రపంచం లో అందాన్ని కొలవాలంటే స్త్రీ నే కొలమానంగా చాలా మంది భావిస్తారు. మహళల లో సహజంగా ఆకర్షణా శక్తీ ఎక్కువ. వాళ్ళు తమ అందం, అభినయం తో ఎంతటి వారినైనా మంత్రముగ్ధులను చేస్తారు అనే విషయాన్ని చరిత్ర చెబుతోంది, ప్రస్తుతం నిరూపితమవుతుంది. భవిష్యత్తు కూడా అందులో ఎటువంటి మార్పు ఉండదు అని చెబుతోంది భవిష్యవాణి.

How To Understand About Women According To Samudrika Shastra

స్త్రీలలో ఎదో రహస్యం దాగుంది, వాళ్ళ అసలు స్వభావాన్ని అర్థం చేసుకోవడం, ఎటువంటి వాళ్ళో చెప్పడం చాలా కష్టం అయిన పని అని చాలా మంది చెప్పే మాట. కానీ, స్త్రీల వ్యక్తత్వం గురించి ప్రపంచానికి తెలియటానికి మన హిందూ శాస్త్రాలు తమ వంతు కృషి చేసాయి.

సాముద్రిక శాస్త్రం :

సాముద్రిక శాస్త్రం :

సాముద్రిక శాస్త్రం అనేది భారతీయ జ్యోతిషశాస్త్రం లోని ఒక భాగం. వేదకాలం నుండి సంప్రదాయ బద్ధంగా ముఖం తో పాటు, శరీరంలోని వివిధ భాగాలను విశ్లేషణాత్మక ధోరణిలో అధ్యయనం చేయటం ద్వారా ఎదుటి వ్యక్తి ఎలాంటి వారో తెలియచెప్పటం సాముద్రిక శాస్త్రం ప్రత్యేకత.

శరీరాన్ని అధ్యయనం చేయటం :

శరీరాన్ని అధ్యయనం చేయటం :

"సాముద్రిక" అనే పదం సంస్కృత భాష నుండి ఆవిర్భవించింది. దీని అర్ధం వివిధ శరీర భాగాలకు సంబంధించిన జ్ఞానాన్ని సముపార్జించి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని విశ్లేషించడం ద్వారా ఎదుటి వ్యక్తి స్వభావాన్ని చెప్పటం. హస్త సాముద్రికం( అర చేతిని విశ్లేషించటం) , కపాల సాముద్రికం (పుర్రెను విశ్లేషించడం), ముఖ సాముద్రికం(ముఖాన్ని విశ్లేషించడం) ఇలా పలు శాఖలుగా సాముద్రిక శాస్తం విభజించబడి ఉంది.

గరుడ పురాణం :

గరుడ పురాణం :

గరుడ పురాణం అనే హిందూ ప్రాచీన గ్రంధం లో సాముద్రిక శాస్త్రం యొక్క విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పబడి ఉంది. సాముద్రిక శాస్త్రాన్ని మరింత లోతుగా అధ్యనం చేయటం ద్వారా, అంగ శాస్త్రం అనే ఒక కొత్త శాఖ గురించి తెలుసుకోవచ్చు. ఈ శాస్త్రం ప్రత్యేకంగా స్త్రీల యొక్క శరీర భాగాలను అధ్యయనం చేయడానికి బాగా ఉపయోగ పడుతుంది.

సాముద్రిక శాస్త్రం లోని ప్రముఖ శాఖలు :

సాముద్రిక శాస్త్రం లోని ప్రముఖ శాఖలు :

సాముద్రిక శాస్త్రాన్ని విస్తారంగా రెండు భాగాలుగా విభజించారు. మొదటిది స్త్రీ ముద్రిక, రెండవది పురుష ముద్రిక. స్త్రీ ముద్రిక ప్రకారం, స్త్రీల అసలైన స్వభావాన్ని వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి సులువుగా అంచనా వేయొచ్చని చెబుతోంది.

ఆ రహస్యాన్ని చేధించటం ఎలా? :

ఆ రహస్యాన్ని చేధించటం ఎలా? :

స్త్రీల లోని వివిధ శరీర భాగాలలోని లక్షణాలను విశ్లేషించటం ద్వారా వారి యొక్క అసలు స్వభావాన్ని ఇట్టే చెప్పేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

పాదాలు :

పాదాలు :

ఏ అమ్మాయి పాదాలు బాగా అభివృద్ధి చెంది మృదువుగా, మెత్తగా, చూడటానికి అందంగా, తాకగానే వెచ్చగా, గులాభి రంగులో మెరుస్తూ, చెమట పట్టకుండా ఉంటాయో అటువంటి అమ్మాయి శృంగారాన్ని విపరీతంగా ఆనందిస్తుంది. ఒక వేళ ఇప్పుడు చెప్పిన లక్షణాలకు విరుద్ధంగా గనుక ఉంటే ఆ అమ్మాయి జీవితం లో కష్టాలను ఎదుర్కొంటుంది.

అరికాళ్ళు :

అరికాళ్ళు :

శంఖం, చక్రం, తామర పువ్వు, జెండా, బాగా బలిసిన చేప, ఇక్కడ చెప్పిన వాటిల్లో ఏ ఒక్క ఆకారం అయినా అమ్మాయి అరికాళ్ళ ఫై ఉంటే ఆమె రాజుని పెళ్లిచేసుకుంటుంది. ఒక వేళ ఎలుక, పాము, కాకి ఆకారాలు ఉంటే ఆ స్త్రీ జీవితం లో దుర్భరమైన పేదరికాన్ని , కష్టాలను అనుభవిస్తుంది.

కాలి వేళ్ళ పై ఉన్న గోర్లు :

కాలి వేళ్ళ పై ఉన్న గోర్లు :

గులాబు రంగులో మెరుస్తూ, మృదువుగా పెరిగిన గోర్లు గుండ్రటి ఆకారం లో గనుక ఉంటే వాళ్ళ జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం ఎల్లప్పుడూ ఉంటాయట. గోర్లు గనుక నల్ల బారి, నలిగిపోయి ఉంటే కష్టాలు, దరిద్రం చుట్టుముడతాయి.

కాలి వేళ్ళు :

కాలి వేళ్ళు :

కాలి వేళ్ళు గనుక బాగా పెరిగి, గుండ్రంగా, గులాబీ రంగులో గనుక ఉంటే ఆనందానికి చిహ్నం. కాలి వేళ్ళు చిన్నగా ఉండి, ఆకారం అనేది లేకపోతే దరిద్రం దాపురించే అవకాశాలు ఎక్కువ.

బొటన వేలు చిన్నగా ఉంటే తక్కువ ఆయుష్షు ఉందని అర్థం. నడిచేటప్పుడు పూర్తిగా అరికాళ్ళునేలకు తాకితే పేదరికం తో పాటు ఒక దాసిలా అంటే ఒక బానిసల బ్రతుకుతారు అని అర్థం. అరికాళ్ళు సక్రమంగా లేకుండా ఎదో ఒక ఆకారం లో ఉంటే అలాంటి వాళ్లకు మోసం, వంచించటం వంటి బుద్దులు ఎక్కువగా ఉంటాయి.

అరికాళ్ళ వంపు వద్ద, అరికాళ్లకు భూమికి మధ్య ఉండాల్సిన సగటు వంపు కంటే ఎక్కువగా ఉంటే జీవితంలో ఆర్ధిక స్థితి మధ్యస్తంగా ఉంటుంది.

కాలి వేళ్ళు ఒక దాని పై ఇంకొకటి ఉంటే ఆ స్త్రీలు త్వరగా విధవ అవుతారట.

కాలి వేళ్లలో చిటికిన వేలు గనుక భూమికి తాకకపోతే మొదటి భర్తని వదిలేసి, ఇంకొకరిని పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువ. కాలి కి ఉన్న రెండవ వేలు మొదటి వేలు కంటే పొడవుగా ఉంటే పెళ్లి కి ముందు , పెళ్లి తరువాత కూడా శృంగార జీవితం ఆనందంగా ఉంటుంది. మూడు మరియు నాల్గవ వేలు భూమికి తాకపోతే కచ్చితంగా విధవరాలిగా మారుతుంది.

నడుచు కుంటూ వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో ఇష్టమొచ్చినట్లకు చెత్త చెదారం విసిరేస్తే ఆ అమ్మాయి వ్యక్తిత్వం మంచిది కాదని అర్థం. కుటంబానికి కూడా చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంది.

పాదములకు వెనుక భాగం :

పాదములకు వెనుక భాగం :

పాదముల వెనుక ఉన్న చీల మండలం (యాంకిల్ ) దగ్గర నరాలు కనపడకుండా, అక్కడ ఉన్న చర్మం మృదువుగా, మెత్తగా ఉంటే ఆ అమ్మాయి రాణి భోగాన్ని అనుభవిస్తుంది. చీల మండలం (యాంకిల్ ) చుట్టూరా వెంట్రుకలు గనుక ఉంటే అలాంటి స్త్రీలు ఎక్కువ కాలం బానిసలుగా బ్రతుకుతారు. పాదాలు గనుక సన్నగా,ఎముకలు బయటపడి, కండ అనేది ఏమాత్రము లేక పొతే అలాంటి అమ్మయిలు శృంగారం లో అంత ఆసక్తిగా పాల్గొనరు(పనికి రారు).

మడమ భాగము :

మడమ భాగము :

మడమ భాగం కూడా స్త్రీల యొక్క సాహచర్యం ఎదుటి వ్యక్తులతో ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. మడమ భాగం బాగా బలిష్టంగా ఉంటే అలాంటి వాళ్ళు శృంగారం విషయంలో అంతగా ఆసక్తి చూపరు. మడమ భాగం పొడుగా గనుక ఉంటే ఆ అమ్మాయి తన వ్యక్తిత్వాన్ని త్వరగా కోల్పోతుంది అంతే కాదు తీవ్రమైన దరిద్రాన్ని కూడా అనుభవించే అవకాశాలు ఎక్కువ.

కాళ్ళు (మోకాలి కింది భాగం లో ఉన్నవి) :

కాళ్ళు (మోకాలి కింది భాగం లో ఉన్నవి) :

అక్కడ ఉన్న చర్మం సమానంగా, మెత్తగా,మృదువైన వెట్రుకలను కలిగి ఉండే అమ్మాయిలు వాళ్ళ జీవితాలలో ఎంతో ఆనందాన్ని పొందుతారు.

మోకాళ్ళు

మోకాళ్ళు

మోకాళ్ళు గనుక గుండ్రంగా, మృదువుగా, చూడటానికి అందం గా గనుక ఉంటే అలాంటి అమ్మయిలకు అదృష్టం వద్దన్నా వరిస్తుంది. వేలబడి ఉన్న మోకాళ్ళు కలిగినవాళ్లు పేదరికాన్ని అనుభవించే అవకాశాలు ఎక్కువ. ఎముకలు భయపడిన మోకాళ్ళు కలిగిన వాళ్ళు వ్యక్తిత్వాన్ని త్వరగా కోల్పోతారు.

తొడలు :

తొడలు :

ఏ అమ్మాయి కైతే బాగా బలిష్టమైన తొడలు (ఏనుగు తొండం ఉన్నట్లు) ఉండి, రెండు తొడల మధ్య కొద్దిగా స్థలం ఉండి, లేత రంగులో వెంట్రుకలు ఉంటాయో , అలాంటి వాళ్ళు జీవితం లో బాగా స్థిరపడిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు.

నడుము :

నడుము :

నడుము చుట్టుకొలత 24 వేళ్ళు వెడల్పు కంటే ఎక్కువగా ఉండి, తుంటికలు ఉన్న భాగము(హిప్) బాగా పెరిగి ఉంటే అలాంటి వాళ్లకు జీవితం లో ఎప్పుడూ ఆనందం డబ్బు వెంటే ఉంటాయి. నడుము భాగం చదునుగా, కండ లేకుండా, విపరీతమైన వెంట్రుకలు గనుక ఉంటే అలాంటి వాళ్ళు కష్టాలు ఎక్కువగా పడతారు, వితంతువులుగా మారుతారు.

చేతులు :

చేతులు :

చేతులకు బాగా కండ ఉండి, మృదువుగా, గుండ్రంగా ఉంటే అలాంటి వ్యక్తులు ఎంతో పవిత్రతను కలిగి ఉంటారు.

బ్రొటన వేళ్ళు :

బ్రొటన వేళ్ళు :

బ్రొటన వేళ్ళు గనుక తామర పువ్వు మొగ్గ ఆకారం లో ఉంటే, ఆ అమ్మాయి రాజా యోగం ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. వంగిపోయి ఉన్నాలేక కండ భాగం తక్కువగా ఉన్నా దురుదృష్టం ఉన్నట్టు లెక్క.

అరచేతులు :

అరచేతులు :

అరచేతులు కొద్దిగా ఎర్రగా , దాని మధ్య భాగం కొంత ఉబ్బెత్తు గా ఉండి, చేతి వేళ్ళ మధ్య స్థలం సమానం గా ఉండి, అరచేతి పై కొన్ని గీతాలు ఉంటే ఆ మహిళలు పవిత్రతకు చిహ్నం.

చేతుల వెనుక భాగం :

చేతుల వెనుక భాగం :

ఏ అమ్మాయి కి అయితే మంచి శరీరాకృతి కలిగి, చేతుల వెనుక భాగం లో మృదువైన చర్మం ఉండి, వెంట్రుకులు (లేత రంగులో తక్కువ వెంట్రుకులున్న పర్వాలేదు) ఉండవో అలాంటి అమ్మాయి ని పెళ్లి చేసుకున్న వ్యక్తికి అదృష్టం వరిస్తుంది. చేతుల వెనుక భాగం పై ఉన్న చర్మం పొడి భారీ పోయి ఉంటే గనుక అలాంటి అమ్మాయిలు జీవితం లో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు.

చేతి వేళ్ళు :

చేతి వేళ్ళు :

పొడవుగా, మృదువ గా, మెత్తగా, వెంట్రుకలు లేని చేతి వేళ్ళు కలిగి ఉన్న అమ్మాయిలకు అదృష్ట లక్ష్మి తలుపు తడుతుంది. ఒకవేళ చేతి వేళ్ళు సన్నగా వంకరగా, వెంట్రుకలు కలిగి ఉంటే దురదృష్టం వెంటాడుతుంది.

చేతి గోర్లు:

చేతి గోర్లు:

సహజంగా గులాబీ రంగు కలిగిన చేతి గోర్లు కనుక ఉంటే, అలాంటి మహిళలు దయగల స్వభావము తో పాటు ఎంతో ప్రేమ గా వ్యవహరిస్తారు. గోర్లు రంగు పసుపు పచ్చ వర్ణం లో ఉండి, ఒక సరైన ఆకారం లేకపోతే, చెడు స్వభావము కలిగిన క్రూరమైన వ్యక్తులు గా ఆ మహిళలు మారుతారు.

వీపు భాగం :

వీపు భాగం :

వీపు భాగం లో ఏ అమ్మాయికి అయితే బాగా కండ ఉండి, వెంట్రుకలు లేకుండా ఉంటుందో అలాంటి వాళ్ళు, ఎదుటి వ్యక్తుల్లో శృంగార కాంక్ష రగిలించడం తో పాటు, వాళ్ళు కూడా మంచి శృంగార జీవితాన్ని ఆస్వాదిస్తారు. వీపు భాగం లో వెంట్రుకలు ఎక్కువగా ఉండి, కండ భాగం తక్కువగా ఉంటే అలాంటి అమ్మాయిలు ఏదంటే అది, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే తత్వం కలిగి ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాటల వల్ల ,వాళ్ళని ప్రేమించే వాళ్ళు కూడా నొచ్చుకుంటారు.

మెడ భాగం :

మెడ భాగం :

మెడ భాగం లో మృదువైన చర్మాన్ని కలిగి, ఎముకలు బయటకు పెద్దగా కనపడకుండా, మెడ పై మూడు గీతాలు కనుక కంటికి కనపడుతుంటే, అటువంటి అమ్మాయిలు మంచి భార్య గా, అమ్మ గా పేరు తెచ్చుకుంటారు. బాగా బలిసిన మెడ ఉన్నవారు వితంతువుగా మారే అవకాశం ఎక్కువ. చదునైన లేక పొట్టి మెడ కలిగిన స్త్రీల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.

బుగ్గలు :

బుగ్గలు :

బాగా ఉబ్బిన, గ్రుండటి ఆకారం లో కండ కలిగి, సహజం గానే గులాబీ రంగులో బుగ్గలు ఉన్న అమ్మాయిలు, బాగా చలాకి గా, దయ గల వారిగా ఉంటారు. కండ అనేదే ఏమాత్రం లేకుండా, ఎముకలు బయట పడి, గట్టి బుగ్గలు లేదా లోతు బుగ్గలు ఉన్న అమ్మాయిలు చెడు స్వభావం కలిగి ఉంటారు.

నవ్వు :

నవ్వు :

అమ్మాయిలు నవ్వినప్పుడు బుగ్గలు ఉబ్బి పళ్ళు గనుక కనపడకపోతే అలాంటి అమ్మాయిలకు అదృష్టం ఉన్నట్లు లెక్క.

ముక్కు :

ముక్కు :

ముక్కు ఉన్న రెండు రంద్రాలు చిన్నగా, సరి సమానమైన వైశాల్యం కలిగి ఉంటే, అటువంటి అమ్మాయిలకు ఆరోగ్యంతో పాటు ఎప్పుడు మంచే జరుగుతుంది. బండ ముక్కు లేదా చదును ముక్కు ఉంటే చెడు జరిగే అవకాశాలు ఎక్కువ. ముక్కు చివరి భాగం ఎర్రగా లేదా కుంచించుకు పోయి ఉంటే ఖచ్చితం గా వితంతువులుగా మారుతారు. చదును ముక్కు కలిగిన వారు బానిసలాగా బ్రతుకుతారు. మరీ చిన్న ముక్కు లేదా మరీ పెద్ద ముక్కు కలిగిన అమ్మాయిలలో కొట్లాడే స్వభావం ఎక్కువగా ఉంటుంది.

కళ్ళు :

కళ్ళు :

మహిళల కను గుడ్డు ఎదో ఒక రంగులో (నలుపు, ఆకుపచ్చ, నీలి రంగు, మట్టి రంగు, బూడిద రంగు) ఉండి, ఆవు పాలంత తెలుపుగా దాని చుట్టూ ఉన్న ప్రదేశం గనుక ఉంటే, అటువంటి మహిళలు భావొద్వేకానికి లోనవుతారట. తానూ ప్రేమించిన వ్యక్తి యొక్క దృష్టి, ప్రేమ తన మీద మాత్రమే ఎక్కువగా ఉండాలని కోరుకుంటారు.

చెవి :

చెవి :

పొడువుగా వంపు తిరిగిన చెవులు గనుక ఉంటే మంచి పిల్లలతో పాటు, ఆనందం ఆ స్త్రీ కి లభిస్తాయి. చిన్న చెవులు, సన్నని చెవులు, ఒక ఆకారం లేనివి ఉండి, వాటి నరాలు బయటికి కనపడితే అలాంటి లక్షణాలున్న అమ్మాయిలు దురదృష్టవంతులు.

నుదుటి భాగం :

నుదుటి భాగం :

నుదుటి భాగం లో నరాలు బయటకి కనపడకుండా, ఆ ప్రదేశం లో వెంట్రుకలు లేకుండా, అర్ధచంద్రా కారం లో ఉండి, అమ్మాయి నాలుగు వేళ్ళ వెడల్పుకు సరిసమానం గా నుదిటి భాగం వెడల్పు గనుక ఉంటే మంచి భర్త పిల్లలతో ఆమె జీవితాంతం సంతోషంగా ఉంటుంది. స్వస్తిక్ చిహ్న ఆకారం నుదుటి పై గనుక ఉంటే ఆ అమ్మాయికి రాణి యోగం కలుగుతుంది. నుదుటి పై వెంట్రుకలు ఎంత ఎక్కువగా ఉంటే అంత దురదృష్టవంతులని అర్ధం.

తల :

తల :

పెద్ద గుండ్రటి తల కలిగిన అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. పొడవుగా గాని, చదునుగా గాని లేక సమ మట్టం గా లేని తల కలిగి ఉన్న వాళ్ళు దురదృష్టవంతులు.

జుట్టు :

జుట్టు :

మృదువైన, నల్లటి, పొడవైన జుట్టు కలిగి ఉన్న స్త్రీలు చాలా అదృష్టవంతులు. పసుపుపచ్చ రంగులో, మృదువుగా లేని జుట్టు కలిగి ఉన్న స్త్రీలలో చెడు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కానీ తెల్లటి చర్మం కలిగి పసుపుపచ్చ జుట్టు ఉన్నా, నల్లటి చర్మం ఉండి నల్లటి జుట్టు కలిగి ఉన్నా అదృష్టవంతులే.

పైన చెప్పిన విషయాలన్నీ సాముద్రిక శాస్త్రంలో చెప్పబడి ఉన్నవి.

English summary

How To Understand About Women According To Samudrika Shastra

Women are born charmers and, at the same time, they also are very mysterious. It is often difficult to understand a woman's true nature by just looking at her. But, according to the Hindu shastras, it is very easy to decode a woman's personality based on her physical features..
Story first published:Friday, January 5, 2018, 17:50 [IST]
Desktop Bottom Promotion