ఈ రంగు రాళ్లు మీ వ‌ద్ద ఉంటే సంప‌ద మీ వెంట న‌డుస్తుంది!

Posted By: KrishnaDivYa P
Subscribe to Boldsky

మ‌న‌లో చాలా మంది డ‌బ్బులు ఎలా సంపాదించాలి సంప‌ద‌ను ఎలా కూడ‌బెట్టాల‌ని ఆలోచిస్తాం. అందుకోసం ఆన్‌లైన్‌లో ఏమైనా స‌ల‌హాలు దొరుకుతాయా అని వెతుకుతాం. అలాంటి వారి కోస‌మే ఈ క‌థ‌నం.

Keep These Stones To Attract More Money And Wealth ,

కొన్ని రంగురాళ్లు, ర‌త్నాల‌కు డ‌బ్బును, సంప‌ద‌ను ఆక‌ర్షించే గుణం ఉంటుందంటారు. అవి స్వ‌ల్ప కాలంలోనే వ్య‌క్తుల‌కు అదృష్టాన్ని తెచ్చిపెట్టి సంప‌ద‌ను క‌ల‌గ‌జేస్తాయి. మీ డ‌బ్బుల‌ను ఎన్నోరెట్లు పెంచే ఆ రంగ‌రాళ్లు, ర‌త్నాల గురించి తెలుసుకోండి మరి!

స‌న్‌స్టోన్‌

స‌న్‌స్టోన్‌

స‌హ‌జ‌సిద్ధ‌మైన ఈ స‌న్‌స్టోన్ సానుకూల శ‌క్త‌ని ఆక‌ర్షించి సంప‌ద‌ను పెంచుతుంది. మీ జాత‌క చ‌క్రంలో ఉన్న దోషాల‌ను పోగొట్టి మీకు సాయం చేస్తుంది. అందుకే ఈ రాళ్ల‌ను మీ వ‌ద్ద ఉంచుకుంటే మీ చుట్టూనే అదృష్టం తిరుగుతుంటుంది.

అవెంచురైన్‌

అవెంచురైన్‌

ఈ ప‌చ్చ‌రంగు అవెంచురైన్‌ను ఇంగ్లిష్‌లో గ్యాంబ్ల‌ర్‌స్టోన్ అని అంటారు. ఈ రంగురాయి అవ‌కాశాల‌ను వెతికి తెచ్చి మీరు ఆర్థికంగా వృద్ధి సాధించ‌డానికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది.

సిట్రైన్‌

సిట్రైన్‌

ఈ రంగురాయిని కొన్నిసార్లు వ్యాపార ర‌త్నం అంటారు. స్ఫ‌టికంలోని ముదురు బంగారు రంగు రాయే సిట్రైన్‌. ఈ జాతిర‌త్నాన్ని ఉంచుకుంటే దుకాణాదారుల‌కు, విక్ర‌య‌దారుల‌కు సౌభాగ్యం తెస్తుంది. ఈ రాయి ఉంచుకోవ‌డం వ‌ల్ల స్థిర చ‌రాస్తులు క‌లుగాయ‌ట‌.

ఐర‌న్ పైరైట్‌

ఐర‌న్ పైరైట్‌

ఈ రంగురాయిని కాకిబంగారం అనీ అంటారు. ఇంగ్లిష్‌లో ఫూల్స్ గోల్డ్ అంటారు. ఈ రాయి త‌మ వ‌ద్ద ఉంచుకున్నారిని మోసాల‌కు గురికాకుండా ర‌క్షిస్తుంది. దీనికున్న అతీత శ‌క్తుల వ‌ల్ల ఎవ‌రూ మ‌న‌ల్ని మోసం చేయాల‌ని చూడ‌రు.

జేడ్‌

జేడ్‌

క్రిస్టైన్ లాగే జేడ్ సైతం అదృష్టాన్ని, సౌభాగ్యాన్ని క‌లిగిస్తుంది. ఈ రాయికి అదృష్టాన్ని తీసుకురాగ‌ల శ‌క్తి ఉంది. జేడ్‌ను మ‌న వ‌ద్ద ఉంచుకోవ‌డం వ‌ల్ల సానుకూల శ‌క్తి పెరుగుతుంది. ఇంకా ఇది మీ హృద‌య చ‌క్రంతో క‌లిసి ప‌నిచేసి సంప‌ద‌ను ఆర్జించాల‌న్న మీ కోరిక‌ను బ‌లంగా ఉంచుతుంది. డ‌బ్బు సంపాదించేలా చేస్తుంది.

సొడాలైట్‌

సొడాలైట్‌

ఈ ర‌త్నాన్ని పోయెట్స్ స్టోన్ అంఆరు. ఇది నిజాన్ని తెలుసుకునేలా చేసి మోసాల‌ను అరికడుతుంది. ప్ర‌క్షాళ‌న‌కు సంబంధించిన వాటిలో ఈ రాయి చాలా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. మీరు వెళ్తున్న దారిలో దుర‌దృష్టాన్ని, అడ్డంకుల‌ను తొల‌గిస్తుంది.

Read more about: life luck లైఫ్ లక్
English summary

Keep These Stones To Attract More Money And Wealth

Check on the list of the lucky stones and gems and crystals which can make you get lucky and rich with its presence around you!