For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ జన్మతేది వెనుక దాగున్న, మీ వ్యక్తిత్వ రహస్యాలను ఛేదించే సంఖ్యాశాస్త్ర అధ్యయనం

మీ జన్మతేది వెనుక దాగున్న, మీ వ్యక్తిత్వ రహస్యాలను ఛేదించే సంఖ్యాశాస్త్ర అధ్యయనం

|

సంఖ్యాశాస్త్ర ప్రకారం, జనన తేదీ మరియు జీవన మార్గ సంఖ్యలు, మీ వ్యక్తిత్వాన్ని నిర్వచించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఈ వ్యాసంలో, మీ జీవిత మార్గ సంఖ్య ఆధారంగా మీ జీవన రహస్యాలను గురించిన వివరాలను మీకు తెలియజేయబోతున్నాము.

మీ పుట్టిన తేదీలోని సంఖ్యలను కూడిక చేయడం ద్వారా, మీ జీవన మార్గ సంఖ్య లెక్కింపబడుతుంది.

The Hidden Secrets About Date Of Birth

ఉదాహరణకు, మీ జన్మ తేదీ 2 జనవరి 1986 అయినట్లయితే, మీ జీవన మార్గ సంఖ్యను ఈ విధంగా లెక్కించాలి: 2 + 1 + 1986 = 27, 2 + 7 = 9.

మరీ మీ జీవన మార్గ సంఖ్యను లెక్కించి, దాని వెనుక దాగున్న నిగూడార్ధాన్ని కనుగొనండి.

● మీ పుట్టిన తేదీలోని సంఖ్యల మొత్తం ఒకటి అయితే, ఉన్నతమైన వ్యక్తిత్వం మిమ్మల్ని నిర్వచిస్తుంది.

● మీ పుట్టిన తేదీలోని సంఖ్యల మొత్తం ఒకటి అయితే, ఉన్నతమైన వ్యక్తిత్వం మిమ్మల్ని నిర్వచిస్తుంది.

మీరు కష్టపడి పనిచేసే తత్వంతో, నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఒక వ్యక్తిగా, మీరు దూసుకుపోయే చొరవ కలిగిన మనస్సుతో మరియు అనంతమైన శక్తితో నిండి ఉంటారు. మీలోని అనంతమైన శక్తి , మీరు ఏ పని చేసినా అందులో అగ్రస్థానంలో నిలబడేలా చేయాలని కోరుకుంటుంది. ఒక వ్యక్తిగా మీరు అదృష్టవంతులు .అవరోధాలను సునాయాసంగా అధిగమిస్తారు కనుక, మిమ్మల్ని గుర్రపునాడాతో జన్మించిన వారని అంటారు. ఎల్లవేళలా, మీ లక్ష్యాలు ఉన్నతంగా ఉంటాయి.

● మీ జీవన మార్గ సంఖ్య రెండు అయ్యి ఉంటే - మిమ్మల్ని శాంతిసామరస్యాలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులుగా చెప్పవచ్చు.

● మీ జీవన మార్గ సంఖ్య రెండు అయ్యి ఉంటే - మిమ్మల్ని శాంతిసామరస్యాలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులుగా చెప్పవచ్చు.

మీరు ఏ విషయంలోనైనా శాంతి మరియు సామరస్యాన్ని కోరుకునే వ్యక్తి. మీరు స్వతహాగా సిగ్గరి అయినందున, ఏ పని చేసేటప్పుడు అయినా తెర వెనక ఉండి అన్నీ చేసినా, పేరుకోసం పరితపించరు. ఒక వ్యక్తిగా, మీరు ఇతరులతో కలిసి జట్టుగా పని చేసేటప్పుడు, అద్భుతమైన సమన్వయం కలిగి ఉంటారు.

● మీ జీవన మార్గ సంఖ్య మూడు అయి ఉంటే, స్వీయ వ్యక్తీకరణ అనే పదం మీకు సరైన నిర్వచనం.

● మీ జీవన మార్గ సంఖ్య మూడు అయి ఉంటే, స్వీయ వ్యక్తీకరణ అనే పదం మీకు సరైన నిర్వచనం.

మీరు కారు చీకటిలో కాంతి రేఖని వ్యాప్తి చేసే విశిష్ట సామర్ధ్యం కలిగి ఉన్న వ్యక్తి. మీరు అద్భుతమైన సృజనాత్మకత మరియు మీ భావోద్వేగాలను వ్యక్తపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఒక వ్యక్తిగా, మీ పనితీరు మరియు జీవిన విధానం, ఎంతో సహజత్వంతో కూడుకుని ఉంటుంది. అంతే కాకుండా, సంతోషంగా ఉన్నపుడు మీరు ఎల్లప్పుడూ వినోదాత్మకంగా ఉంటారు. మీలో సానుకూల ధోరణి మరియు ఉదార స్వభావం ఉంటాయి.

● మీ జీవన మార్గ సంఖ్య నాలుగు అయితే, మీలో ఖచ్చితంగా కష్టపడి పనిచేసే స్వభావం ఉంటుంది.

● మీ జీవన మార్గ సంఖ్య నాలుగు అయితే, మీలో ఖచ్చితంగా కష్టపడి పనిచేసే స్వభావం ఉంటుంది.

మీరు కష్టపడి పనిచేసే వ్యక్తి. మీరు విశ్వాసపాత్రులు మరియు లక్ష్య సాధన దిశగా పని చేస్తారు. మరోవైపు, మీరు వ్యూహాత్మక ఆలోచనలతో పాటుగా స్వీయ నియంత్రణ కలిగి ఉంటారు. అయితే కొన్నిసార్లు సోమరితనం కూడా మీలో కనిపిస్తుంది.

● మీ జీవన మార్గ సంఖ్య అయితే, అవిశ్రాంతతను మీకు నిర్వచనంగా చెప్పవచ్చు.

● మీ జీవన మార్గ సంఖ్య అయితే, అవిశ్రాంతతను మీకు నిర్వచనంగా చెప్పవచ్చు.

ఒక వ్యక్తిగా, మీరు సామయానుకూలంగా మరియు అవిశ్రాంతంగా ఉంటారు. తక్కువగా పట్టింపులు ఉన్నదే మీరు, ప్రయాణాలను మరియు భిన్నమైన అనుభవాలను బయటపడటానికి మరియు కోరుకుంటారు. సమస్యలను సాధించే సమయంలో, ఓర్పుతో వ్యవహరించవలసిన మీరు నిర్విరామంగా భావించడం మూలంగా, త్వరగా విసిగిపోతారు.

● మీ జీవన మార్గ సంఖ్య ఆరు ఉంటే అప్పుడు, సేవ అనే పదం మీ వ్యక్తిత్వాన్ని సరిగ్గా నిర్వచిస్తుంది.

● మీ జీవన మార్గ సంఖ్య ఆరు ఉంటే అప్పుడు, సేవ అనే పదం మీ వ్యక్తిత్వాన్ని సరిగ్గా నిర్వచిస్తుంది.

ఒక వ్యక్తిగా, మీరు సేవ, ప్రేమ మరియు కుటుంబం పై ఎక్కువగా దృష్టి పెడతారు. మీపై ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీరు సహాయ స్వభావం కలిగి ఉంటారు. అంతేకాక, మీరు ప్రతి ఒక్కరి యెడల ప్రేమను కలిగి, వారి చుట్టూ ఉన్న వాతావరణం తెలికపడేలా వ్యవహరిస్తారు. ఇలా జరగాలంటే, మీరు కూడా సంతోషంగా ఉండటం అవసరం.

● మీ జీవన మార్గ సంఖ్య ఏడు అయితే - నిగూఢత మీ నిర్వచనంగా నిలుస్తుంది.

● మీ జీవన మార్గ సంఖ్య ఏడు అయితే - నిగూఢత మీ నిర్వచనంగా నిలుస్తుంది.

మీరు మర్మమైన మనసు కలిగిన వ్యక్తులలో ఒకరు. మీ భావాలను మీలోనే ఉంచుకోవడానికి ఇష్టపడతారు కనుక, ఇతరులు మిమ్మల్ని అర్ధం చేసుకోవడం కష్టమే! మీరు మంచి ఆలోచనాపరులు. మీకు ప్రతి విషయాన్ని కూలంకషంగా విశ్లేషించే మేధ ఉంటుంది కనుక, మీరు విజ్ఞాన శాస్త్ర మరియు మేధోపాఠవాల్లో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు.

● మీ జీవన మార్గ సంఖ్య ఎనిమిది అయితే, నాయకత్వం మిమ్మల్ని నిర్వచిస్తుంది

● మీ జీవన మార్గ సంఖ్య ఎనిమిది అయితే, నాయకత్వం మిమ్మల్ని నిర్వచిస్తుంది

ఒక వ్యక్తిగా మీరు పుట్టుకతోనే, ప్రత్యేకించి వ్యాపార వ్యాపార మరియు రాజకీయ వ్యవహారాలలో నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. మీరు ముందుచూపు కలిగి ఉన్నందున, దానిని మీరు, ఇతరులతో వ్యవహరించేటపుడు మరియు వ్యాపారాభివృద్ధి విషయంలో ఉపయోగిస్తారు. మరోవైపు, మీరు ఆధ్యాత్మిక విశ్వాసాలపట్ల మొగ్గు చూపుతూనే, డబ్బు వంటి భౌతిక లాలసల పట్ల మొగ్గు చూపుతారు.

● మీ జీవన మార్గ సంఖ్య తొమ్మిది అయితే మానవత్వం మీకు నిర్వచనంగా నిలుస్తుంది.

● మీ జీవన మార్గ సంఖ్య తొమ్మిది అయితే మానవత్వం మీకు నిర్వచనంగా నిలుస్తుంది.

మీరు ఉత్తమ నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉన్న మానవతావాదిగా గుర్తింపు పొందుతారు. మీరు ఇతరుల పట్ల కారుణ్యముతో, బహుళ ప్రతిభావంతులై, ఆదర్శవంతులుగా కీర్తినొందుతారు. మీరు జీవితంలో అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు. అంతేకాక, మీరు ఇష్టపడే వ్యక్తుల వద్ద నుండి ప్రేమను కోరుకుంటారు.

English summary

The Hidden Secrets About Date Of Birth

According to numerology, your life path number has its importance. From finding out what your number reveals about your life path and the personality, there is a lot that one needs to learn. These numbers are calculated based on your date of birth and the year which are later summed up to get a single number.
Story first published:Monday, September 3, 2018, 16:40 [IST]
Desktop Bottom Promotion