ఈ వారం రాశిఫలాలు జూలై 9 నుండి జూలై 15 వరకు

ఈ వారం రాశిఫలాలు జూలై 9 నుండి జూలై 15 వరకు ,జూలై 13, శుక్ర వారం నాడు వస్తున్న సూర్యగ్రహణం దాదాపు అన్ని రాశి చక్రాల మీద తన ప్రతికూల ప్రభావాలను చూపనుందని జ్యోతిష్యులు తెలియబరుస్తున్నారు. కావున మంచి జ్యో

జూలై 13, శుక్ర వారం నాడు వస్తున్న సూర్యగ్రహణం దాదాపు అన్ని రాశి చక్రాల మీద తన ప్రతికూల ప్రభావాలను చూపనుందని జ్యోతిష్యులు తెలియబరుస్తున్నారు. కావున మంచి జ్యోతిష్య శాస్త్ర నిపుణుని సంప్రదించి, వారు సూచించినట్లుగా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకున్న ఎడల, సానుకూల ఫలితాలని పొందగలరని ఆశిస్తున్నారు.

These Are Your Weekly Predictions For 9th July- 15th July 2018

ఈ వారం రాశిఫలాలు జూలై 9 నుండి జూలై 15 వరకు

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి వారికి, ఈ వారం మీ సంబంధాలలో భావోద్వేగాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి, సంబంధాలకి అత్యంత క్లిష్టమైన సమయంగా ఉంటుంది. మీరు గత కొన్ని వారాల వారాలతో పోల్చినప్పుడు ఈ వారం చివరలో కాస్త ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి. మరొక వైపు, ఆర్ధిక పెరుగుదల ఉంటుంది. మీరు మరియు మీ భాగస్వామి, వారం ముగింపులో ఒక ఉమ్మడి వెంచర్ మొదలు పెట్టడం గురించిన ఆలోచనలు చేసే అవకాశాలు లేకపోలేదు.

వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ వారం వృషభ రాశి వారికి నక్షత్రాలు, గ్రహాలూ అత్యంత అనుకూలంగా ఉండనున్నాయి. ఇతరుల మీద కొన్ని అంచనాలను కలిగి ఉండటం అవసరం. ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా పరిష్కరించబడే సూచనలు ఉన్నాయి.

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ వారం మీకు మీ కుటుంబం నుండి మద్దతు ఎక్కువగా ఉంటుంది. మీ ప్రియమైన వారికి, వారి నిర్ణయాల పట్ల స్వేచ్ఛనివ్వాలి మరియు వాదనలు, ప్రతివాదనలు చేయడం ద్వారా కొన్ని ఊహించని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కావున జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. మీ కార్యాలయంలోని సహోద్యోగులతో ఈ వారం అత్యంత అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు పొందే సూచనలు ఉన్నాయి. సానుకూల ఆలోచనలతో ఎదురుచూడండి., ఫలితాలు సిద్దిస్తాయి.

కర్కాటక రాశి : జూన్ 21 - జూలై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జూలై 22

కర్కాటక రాశి వారు, మీ ప్రియమైన వారితో ఎటువంటి ఉద్వేగ భరిత అంశాలకు తావివ్వకుండా గౌరవంగా ఉండాల్సి ఉంటుంది. మరియు మీ ఆలోచనలకి అనుగుణంగా లేనప్పటికీ మీ భాగస్వామి ఇష్టాలకు తగ్గట్లు కొన్ని నడుచుకోవలసి ఉంటుంది. గ్రహణం ప్రభావం కారణంగా క్రియేటివ్ ప్రాజెక్టులు చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మరియు ఈ వారం అత్యంత సానుకూల ఫలితాలతో ముందుకు సాగితుంది.

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 23

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 23

ఈ వారం మీ ఆలోచనలు ఆత్యాత్మికత వైపుకు మళ్లే సూచనలు ఉన్నాయి, క్రమంగా జీవిత పరమార్ధం దిశగా ఆలోచనలు సాగుతుంటాయి. మరియు కొందరు గొప్ప వ్యక్తులతో సామాజిక సమావేశాలు కూడా జరిగే అవకాశాలు లేకపోలేదు. మీ కుటుంబ సభ్యులు మీతో అత్యంత ముఖ్యమైన సమస్యల గురించిన చర్చలు చేస్తారు. మీరు ఈ వారం మీ ప్రియమైనవారితో ఎక్కువ సమయాన్ని గడిపే దిశగా ప్రయత్నించండి మరియు ఖర్చు అధికంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వారం శాంతియుతంగా ఉండడమే కాకుండా పరిపూర్ణమైనదిగా కూడా ఉంటుంది.

కన్యా రాశి : ఆగస్టు 24 - సెప్టెంబర్ 23

కన్యా రాశి : ఆగస్టు 24 - సెప్టెంబర్ 23

ఈ వారం మీ రాశి చక్రంపై శుక్ర గ్రహ ప్రభావం అధికంగా ఉన్న కారణంగా, మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మీరు మారాలని చెప్పే వారి గురించి పట్టించుకోకండి. ప్రపంచంలో ఎవరు కూడా ఇతరులకు తగ్గట్లుగా ఉండాలి అంటే జరగదు అని నిర్ధారించుకోండి. ప్రతికూల ప్రభావాలు తీసుకుని రాగలరు అన్న సందేహం వచ్చిన వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించడం లేదా దూరంగా ఉంచడం సూచించబడింది.

తులా రాశి : సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23

తులా రాశి : సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23

మీరు మీ కార్యాలయం మరియు కుటుంబం రెండింటి పరంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితులు మీ విశ్రాంతి సమయాన్ని కూడా తగ్గించడం వలన, మానసిక ఒత్తిడులకు మీ మెదడు కేర్ ఆఫ్ అడ్రెస్స్ అయ్యే అవకాశం ఉంది. దొరికిన విశ్రాంతి సమయాన్ని మానసిక సంతోషం పెంపొందేలా, మీకు నచ్చిన అంశం పట్ల సమయాన్ని కేటాయించడం మంచిదిగా సూచించడమైనది.

వృశ్చిక రాశి : అక్టోబర్ 24 - నవంబర్ 22

వృశ్చిక రాశి : అక్టోబర్ 24 - నవంబర్ 22

మీరు ఒంటరిగా ఉంటే, ఈ వారంలో ఒక తెలివైన, విద్యావంతులైన వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. పరిచయాలు, ఊహాతీత అవినాభావ సంబంధాలకు దారితీయొచ్చు. పుస్తక పఠనం కూడా మీ ఒంటరితనాన్ని దూరం చేయవచ్చు.

ధనుస్సు రాశి : నవంబర్ 23 - డిసెంబర్ 22

ధనుస్సు రాశి : నవంబర్ 23 - డిసెంబర్ 22

శుక్ర గ్రహ ప్రభావం కారణంగా, ధనుస్సు రాశి వారికి ఈ నెల, వృత్తిపరంగా అనేక ప్రతికూల ప్రభావిత అంశాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. పనుల యందు నిర్ణయాల నందు మీ ప్రియమైన లేదా నమ్మదగిన వ్యక్తుల నుండి సలహాలను స్వీకరించడం మంచిది. మిమ్ములని మీరు తక్కువగా అంచనా వేయకూడదని గుర్తుంచుకోండి.

మకర రాశి : డిసెంబర్ 23 - జనవరి 20

మకర రాశి : డిసెంబర్ 23 - జనవరి 20

ఈ వారం మకరరాశి వారికి, ప్రయాణం మీదనే ఎక్కువగా దృష్టి ఉంటుంది. మీరు మరియు మీ భాగస్వామి కొంత సమయాన్ని గడిపినప్పటికీ, మీ దైనందిక జీవనంలో మార్పులు చోటుచేసుకోవడం ద్వారా మీరు కొంత అసౌకర్యానికి గురవుతుంటారు. మీరు డబ్బు విషయాలలో కొన్ని సవాళ్లను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కొత్త సంస్థలో చేరడానికి ఇది ఒక అద్భుతమైన సమయంగా ఉంది.

కుంభ రాశి : జనవరి 21 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 21 - ఫిబ్రవరి 18

ఈ వారంలో కుంభ రాశి వారి ప్రకారం, కుటుంబం మరియు మీ ప్రియమైన వారిపట్ల సమయాన్ని వెచ్చించేందుకు అనువైన సమయంగా ఉంది. మీ సృజనాత్మక ఆలోచనలు, చేపట్టిన కార్యక్రమాలు మీ గౌరవాన్ని పెంచేవిలా ఉంటాయి. మీరు కొన్ని ప్రగతిశీల మార్పులను కనుగొంటారు. గత వారాలలో పూర్తికాని కొన్ని సవాళ్లు ఈ వారంలో ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి., కానీ ఈ వారం గ్రహణం కారణంగా, కొన్ని ప్రతికూల అంశాలు కూడా మీకు అనుకూలంగా పని చేస్తాయి. మరియు ఎంతోకాలంగా మీరు ఎదురుచూస్తున్న అవకాశాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ వృత్తి సంబంధమైన విషయాలు ఆశాజనకంగా ఉన్నాయని చెప్పబడింది.

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి వారికి వారి భాగస్వామితో సమయం వెచ్చించేందుకు అనువైన సమయాన్ని కలిగి ఉన్నారు. శుక్ర గ్రహ ప్రభావం కారణంగా ప్రేమ, వృత్తి, కుటుంబ సంబంధిత వ్యవహారాలలో మీకు సానుకూల ఫలితాలు అనిపించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మీరు మీ ప్రమాణాలను నిలబెట్టుకునేందుకు అనువైన సమయంగా కూడా ఉంది. సంతోషాలకు ఆనందాలకు ఈ వారం అత్యంత అనుకూలంగా ఉండనుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆధ్యాత్మిక, రాశి చక్ర, హస్త సాముద్రిక సంబంధిత అంశాలకోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. మీ విలువైన వ్యాఖ్యలను అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.


Story first published: Monday, July 9, 2018, 16:00 [IST]
Desktop Bottom Promotion