Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ఒంటరితనాన్ని ప్రేమించేవారి అంతరంగం ఎలా ఉంటుంది?
ఒంటరితనాన్ని ప్రేమించేవారి అంతరంగం ఎలా ఉంటుంది?ఒంటరిగా సమయం గడపడం చాలా మంది వల్ల కాని పని. కొన్ని విషయాలు ఒంటరితనాన్ని నిర్వచిస్తాయి. ఒంటరితనాన్ని కొంతమంది కావాలని కోరుకుంటే, కొంతమంది తప్పనిసరి పరిస్థ
ఒంటరిగా సమయం గడపడం చాలా మంది వల్ల కాని పని. కొన్ని విషయాలు ఒంటరితనాన్ని నిర్వచిస్తాయి. ఒంటరితనాన్ని కొంతమంది కావాలని కోరుకుంటే, కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో అనుభవిస్తుంటారు. కొంతమంది మాత్రం ఒంటరిగా ఉండటానికి మాత్రమే ఇష్టపడతారు. వీరు సమాజం గురించి కానీ, దాని దృక్కోణాల గురించి పట్టించుకోరు.

ఒంటరితనం కోరుకునేవారి అంతరంగాన్ని, ఇప్పుడు మీ కొరకు ఆవిష్కరించబోతున్నాము. మీరు కూడా ఒంటరితనాన్ని ఇష్టపడేవారైతే, ఈ వ్యాసాన్ని చదివి, ఇది మీ ఆలోచనలకు దర్పణం పడుతుందో లేదో తరచి చూడండి.

ఈ వ్యక్తులకు బలమైన భావోద్వేగాలు ఉంటాయి:
ఒంటరితనాన్ని ఇష్టపడేవారు భావోద్వేగపరంగా, చాలా బలంగా ఉంటారు. వారి భావోద్వేగాలు ఎల్లప్పుడూ సానుకూలంగానే ఉంటాయి. వారి భావోద్వేగ స్థిరంగా ఉన్నందున, వారిని నొప్పించడం అంత సులభం కాదు.

వారు నైతిక విలువలు కలిగి ఉంటారు:
ఒంటరితనాన్ని ఇష్టపడేవారు, నైతికతకు మారుపేరు, మరియు ఈ ధోరణిని అనుసరించడం వారికి ఇష్టమైన విషయం. వారు చేసే ప్రతిపనిలో కూడా నైతికత ఉట్టిపడుతుంది!

వారు విశాలమైన దృక్పథంతో ఉంటారు:
ఒంటరితనాన్ని ఇష్టపడేవారు ఓపెన్-మైండెడ్ గా ఉంటారు. వీరు సంప్రదాయ మరియు మూఢ భావాలను కలిగి ఉండరు. ఈ వ్యక్తుల ఆలోచనలు లో మూస ధోరణిలో లేదా ఇతరులను అవమానించేవిగా ఉండవు. వీరు ప్రతి విషయం గురించి సమగ్రముగా పరిశీలించి, తెలుసుకోవడాన్ని ఇష్టపడతారు.

వారు విశ్వసపాత్రులు:
ఒంటరితనాన్ని ప్రేమించే వ్యక్తులు అత్యంత నమ్మకస్తులు. వారు ప్రజల పట్ల కానీ లేదా తమ విధుల పట్ల కానీ నిజాయితీగా ఉంటారు.

వారు స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు:
ఈ విషయంలో అయినా వీరు స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. వ్యక్తులు స్వతంత్ర. భావోద్వేగపరంగా అయినా, ఆర్థిక విషయాలలో అయినా, ఈ వ్యక్తులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు.

వారు స్వయం సమృద్ధిగా ఉంటారు:
ఈ వ్యక్తులు స్వయం సమృద్ధిగా కూడా ఉంటారు, వీరు ఏ విషయంలో అయినా ఇతరులపై ఆధారపడరు. వీరు తమకు తాము మంచి స్నేహితులుగా ఉంటారు, ఎందుకంటే వారు సంతోషంగా ఉండటానికి ఎదుటివారి అవసరం ఉండదు.

ఇతరుల ఆలోచనలు వారిని ప్రభావితం చేయవు:
ఏకాంతాన్ని ప్రేమించేవారు తమ లక్ష్యాలను తాము నిర్దేశించుకున్న విధానంలోనే సాధిస్తారు. ఇతరుల విమర్శలను వారు పట్టించుకోరు. తమ గురించి ఇతరులు ఏమనుకుంటారో అని వీరు అస్సలు చింతించరు.
ఈ వ్యాసంపై, మీ అభిప్రాయం ఏమిటి? దిగువన, మీ వ్యాఖ్యల ద్వారా మాకు తెలియజేయండి.



Click it and Unblock the Notifications