Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
25 ఏళ్లుగా మేకప్ తీయకుండా పడుకుంటున్న మహిళ, కొన్నాళ్లు అయింటే అంధురాలైపోయేది
25 ఏళ్లుగా ఆమె కళ్లకు సంబంధించిన మేకప్ ను (కళ్లకు వేసుకునే మస్కారా)తొలగించుకోకపోవడంతో ఆమె కనురెప్పల కింద మొత్తం నల్లగా మారిపోయింది. మేకప్ కు సంబంధించిన రసాయనాలన్నీ అక్కడే కూరుకుపోయాయి.
అమ్మాయిలందరికీ మేకప్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం. కొందరు అమ్మాయిలు రోజూ మేకప్ వేసుకుంటూ ఉంటారు. కాని దాని తొలగించాలంటే మాత్రం వారికి చాలా బద్ధకం. ఉదయమంతా అటుఇటు వెళ్లి రాత్రికి అలిసిపోయి అలాగే పడుకుంటారు. ఇలాగే ఒక మహిళ చేసింది. దీంతో ఆమె ఇప్పుడు బాధపడుతోంది.
ఆమె ఒక 50 ఏళ్ల మహిళ. ఆమె పేరు థెరిస్సా లించ్. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉంటుంది.
మేకప్ తొలగించుకోకుండానే రోజూ ఆమె పడుకునేది. కనుబొమ్మలకు, కనురెప్పలకు కూడా ఆమె రోజూ మేకప్ వేసుకునేది. అయితే ఈ మధ్య ఆమె కళ్లు బాగా నొప్పి పుట్టాయి. దీంతో ఆమె డాక్టర్ వద్దకు వెళ్లింది. ఆమె కళ్లను పరీక్షించారు. కనురెప్పల కింద మొత్తంగా నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి.

కనురెప్పల కింద మొత్తం నల్లగా
25 ఏళ్లుగా ఆమె కళ్లకు సంబంధించిన మేకప్ ను (కళ్లకు వేసుకునే మస్కారా)తొలగించుకోకపోవడంతో ఆమె కనురెప్పల కింద మొత్తం నల్లగా మారిపోయింది. మేకప్ కు సంబంధించిన రసాయనాలన్నీ అక్కడే కూరుకుపోయాయి. అప్పడప్పుడు ఆమె కంట్లో నుంచి నల్లటి పదార్థం కారేది. ఆ విషయాన్ని థెరిస్సా ఇంట్లో పని చేసే ఆమె గ్రహించింది. అమ్మగారూ.. మీ కంట్లో నుంచి ఎప్పుడూ ఏదో నల్లగా కారుతూ ఉంటుందని చెప్పినా.. థెరిసా పని మనిషి మాటలు పట్టించుకోలేదు.

కంటిలోని వ్యర్థాలను మొత్తం తొలగించారు
అయితే థెరిసా కాస్త ఆలస్యంగానైనా కంటి డాక్టర్ ని కలవడంతో ఆ డాక్టర్ ఆమెకు అన్ని వివరాలు వివరించారు. తర్వాత చికిత్స చేసి కంటిలోని వ్యర్థాలను మొత్తం తొలగించారు. థెరిస్సా ఇంకాస్త లేట్ గా వైద్యున్ని సంప్రదించి ఉంటే ఆమె పూర్తిగా కంటి చూపు కోల్పొయేది. అంధురాలుగా మారేది.

సోషల్ మీడియాలో పెట్టారు
అయితే థెరిసాతో పాటు ఆమె డాక్టర్ ఈ కేసుకు సంబంధించిన విషయాల్ని, ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టాలనుకున్నారు. తర్వాత అన్ని విషయాల్ని పోస్ట్ చేశారు. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు మేకప్ వేసుకునేటప్పుడు గంటల తరబడి వేసుకుంటారు కానీ దాన్ని తీసివేయాలంటే తెగ ప్రయాసపడతారు. బద్దకంతో మేకప్ తీసివేయరు. దీంతో చాలా రకాల వ్యాధులబారిన పడతారు.

తొలగించుకోకుండానే
"నాలాగా ఎవ్వరూ కూడా మేకప్ తొలగించుకోవడానికి బద్దగించకండి. ఇది ప్రాణాలకు సంబంధించిన సమస్య. దీన్ని చిన్నగా చూడకండి. నేను 25 ఏళ్లుగా నా కళ్లకు వేసుకునే మేకప్ ను తొలగించుకోకుండానే రోజూ పడుకునేదాన్ని. "

అలా చేయకండి
"నా కళ్ల దగ్గర మస్కారా అలాగే నిలిచిపోయింది. దీంతో చూపు కూడా కోల్పొయే పరిస్థితికి చేరుకున్నా. మీరు మాత్రం రోజూ పడుకునే ముందు మేకప్ మొత్తాన్ని తొలగించుకోండి. " అంటూ థెరిస్సా ఈ కాలం అమ్మాయిలకు సలహా ఇచ్చింది.



Click it and Unblock the Notifications