Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఈ రాశిచక్రాలవారు తమ రాశిచక్రానికి చెందిన వారితో ఉత్తమ జంటలయ్యే అవకాశం ఉంది
ఈ రాశిచక్రాలవారు తమ రాశిచక్రానికి చెందిన వారితో ఉత్తమ జంటలయ్యే అవకాశం ఉంది
హోరోస్కోప్ ని నమ్మే వారు తమ భాగస్వామికి చెందిన రాశిచక్రంతో తమ రాశిచక్రం అనుకూలత గురించి కచ్చితంగా తెలుసుకుని తీరతారు.
ఈ విషయంలో ఆస్ట్రాలజర్స్ మనకి అమితంగా ఉపయోగపడతారు. ఏ రాశిచక్రానికి ఏ రాశిచక్రంతో అనుకూలత ఉందో వివరిస్తారు. దంపతులు ఎప్పుడు అన్యోన్యంగా ఉండగలరో వివరిస్తారు.
ఇక్కడ మూడు రాశిచక్రాల గురించి వివరించబడింది. ఈ రాశిచక్రాల చెందిన వారు అదే రాశిచక్రం కలిగిన వారిని చేసుకున్నా వీరిద్దరూ ఉత్తమ జంటగా పేరొందుతారు.
ఇక్కడ మనం ఇంకొక విషయం ప్రస్తావించుకోవాలి. ఈ ప్రెడిక్షన్స్ ఎక్యురేట్ అయినా కూడా ఏ ఇరువురి మధ్య తమ బంధాన్ని పటిష్టంగా ముందుకు తీసుకోవాలి అన్న ఉద్దేశ్యం స్పష్టంగా ఉన్నా కూడా వారి రాశిచక్రమేదైనా వారు అన్యోన్యమైన దంపతులుగా పేరొందుతారు.
బాంధవ్యం పటిష్టంగా ముందుకు సాగాలంటే ఓపెన్ కమ్యూనికేషన్ అనేది ముఖ్యం. తమ భాగస్వామిని అర్థం చేసుకునే ప్రయత్నం అవసరం. కొన్ని సార్లు భాగస్వామి కోసం తమ ప్రవర్తనలో కొన్ని మార్పులను చేసుకోవడం మరింత అవసరం.
ఇప్పుడు మనం ఈ రాశిచక్రాల గురించి తెలుసుకుందాం. ఈ రాశిచక్రాల చెందిన వారు అదే రాశిచక్రాల వారిని భాగస్వామిగా పొందినా వారిరువురూ ఉత్తమ జంటగా పేరొందుతారు.

సింహరాశి మరియు సింహరాశి (జులై 23 - ఆగస్ట్ 23):
సింహరాశికి చెందినవారు తమ రాశికి చెందిన వారిని భాగస్వామిగా ఎంచుకున్నప్పుడు ఉత్తమ జంటగా పేరొందే అవకాశము ఉంది. వీరికి ప్రయారిటీస్ వేరు వేరుగా ఉన్నా వీరిరువురూ అన్యోన్యంగా ఉంటారు. ఒకరిని ఒకరు బాలన్స్ చేయగలుగుతారు. వీరిలో ఒకరు ఏదైనా విషయంలో కాస్త నిరాశ చెందినా మరొకరు తమ భాగస్వామికి చేయూతను ఇవ్వగలుగుతారు. అంతటి అవగాహన వీరిద్దరి మధ్య ఏర్పడుతుంది. అయితే, ఇద్దరి ఉద్దేశ్యాలు బాంధవ్యాన్ని పటిష్టపరుచుకునే దిశగా సాగితేనే వీరు ఉత్తమ జంటగా తయారయ్యే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి.
వీరిద్దరిలో ఒకరు సంపాదన బాధ్యతను తీసుకుంటే మరొకరు ఆర్థికపరమైన బాధ్యతలకు ఏ విధంగా ఖర్చు చేయాలో చూసుకుంటారు. వీరి బాంధవ్యం ఇరువురి అవగాహనపై ఆధారపడి ఉంటుంది. ఈ రాశిచక్రం కలయిక అనేది అద్భుతమైన కలయికగా మారుతుంది.

తులారాశి & తులారాశి : సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23
తులారాశికి చెందిన వారు తమ భాగస్వామి నుంచి న్యాయమైన నడవడికను కోరుకుంటారు. తాము కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు. అందువలన ఈ రాశిచక్రం కలయిక అనేది మరొక అద్భుతమైన కలయిక. వీరు బాంధవ్యానికి అమితమైన ప్రాధాన్యతను ఇస్తారు. బాంధవ్యాన్ని నిలుపుకోవడానికి వీరు కొన్ని త్యాగాలు కూడా చేస్తారు. అలా ఈ రాశిచక్రం కలయిక కూడా ఉత్తమమైనది.
కాబట్టి, ఒక వేళ ఏవైనా ఒడిదుడుకులు బాంధవ్యాలలో ఎదురైనా కూడా ఇద్దరూ కలిసి ఆ ఒడిదుడుకులను ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఆలోచించుకోగలుగుతారు. ఇద్దరి మధ్య బంధాన్ని పటిష్ఠపరచుకోవాలన్న భావనే వీరి బంధాన్ని దృఢపరుస్తుంది. అందువలన వీరు ఉత్తమ జంటగా మిగిలే అవకాశం ఉంది.

వృషభ రాశి & వృషభ రాశి (ఏప్రిల్ 20 - మే 20):
వృషభరాశికి చెందిన వారు తమ బాంధవ్యానికి భద్రతను ఏర్పరచుకోవడానికి ఇష్టపడతారు. అందువలన, తాము మరింత సంతోషంగా ఉండవచ్చని వీరి అభిప్రాయం. తమ రాశికి చెందిన వారితో వీరు ఉత్తమ జంటగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే, వీరిరువురి ఆలోచనా ధోరణి ఒకే విధంగా ఉండటం వలన.
ఒకే రాశికి చెందిన వ్యక్తులలో ఒకే రకమైన ఆలోచనా ధోరణి ఉండటం సహజం. అలాగే ఒకరితో ఒకరు నమ్మకంగా ఉంటారు. వీరు భాగస్వామిగా తమ పాత్ర గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. అంతేకాక, వీరు తామిద్దరి బంధం ఏ విధంగా పటిష్టపడుతుంది అన్న దిశగా ఆలోచన చేస్తారు. ఇద్దరూ కలిసి బంధాన్ని దృఢపరచుకుంటారు.
మీరు ఏ రాశిచక్రంతో అనుకూలంగా ఉంటారని మీకనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియచేయండి.



Click it and Unblock the Notifications