TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
మనస్సు మీ మాట వినట్లేదా? చీ ఇదేమీ జీవితం అనిపిస్తుందా? ఇలా చేసి చూడండి
ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ప్రతికూల ఆలోచనలతో సతమతం అవుతుంటారు. అందుకు చాలా కారణాలుండొచ్చు. అకస్మాత్తుగా ఒక్కోసారి మనస్సు మారుతుంది. మదిలో ఏవేవో మెదులుతుంటాయి. ఒక్కసారిగా జీవితం మొత్తం నాశనం అయిపోతున్నట్లుగా అనిపించొచ్చు. అంతా చీకటిమయంగా ఉండొచ్చు.
ప్రతికూల ఆలోచనలు మనస్సులోకి వస్తే మనలో దాగున్న శక్తిని మొత్తాన్ని కోల్పొతాం. ఏమీ చెయ్యలేమోనని నిరుత్సాహానికి గురువుతాం. మరి అలాంటి సందర్భంలో ఏం చెయ్యాలి? నెగెటివ్ ఆలోచనల నుంచి ఎలా బయటపడాలి.
మైండ్ ను పాజ్ లో పెట్టి
మైండ్ ను పాజ్ లో పెట్టి పాజిటివ్ గా ఎలా ఆలోచించాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి ప్రతికూల ఆలోచనలు మనస్సులోకి వచ్చినప్పుడు వాటి నుంచి బయటపడే శక్తి ఎవరికీ అంత త్వరగా రాదు. కొన్ని సలహాలు పాటిస్తే మీరు ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడొచ్చు.
మీ ఆత్మీయులతో మాట్లాడండి
మీ మైండ్ లో అన్నీ నెగెటివ్ థాట్స్ ఉన్నప్పుడు మీ సమస్యను
మీ ఆత్మీయులతో పంచుకోండి. అలాంటి ఆలోచనలు రావడానికి కారణాలను మీకు మనస్సుకు దగ్గరగా ఉండేవారితో చర్చిస్తే కాస్త భారం తగ్గినట్లుగా ఉంటుంది.
ఇతరులకు చెప్పడం వల్ల
మీ సమస్యలను లేదా ప్రతికూల ఆలోచనలను ఇతరులకు చెప్పడం వల్ల వారు మీకు వాటి నుంచి బయటపడే సూచనలు చేయొచ్చు. దీంతో మళ్లీ మీరు మామూలు స్థితికి వస్తారు. లేదంటే మీలో మీరే సతమతం అవుతారు.
భయాన్ని దూరం చేసుకోండి
సాధారణంగా ఏదైనా నెగెటివ్ ఆలోచన మైండ్ లోకి రాగానే కొందరు చాలా భయపడిపోతుంటారు. తమకు ఏదో కీడు జరగబోతుందని సంకోచిస్తుంటారు. అయితే అలాంటి భయాలను అస్సలు మనస్సులోకి రానివ్వకూడదు. ఏదైతే అది అవుతుందని గుండె నిండా ధైర్యం తెచ్చుకుంటే నెగెటివ్ ఆలోచన నుంచి సగం బయపడ్డట్లే.
అలాంటి ఆలోచనలకు దూరంగా ఉండండి
ఒక్క నెగెటివ్ థాట్ మైండ్ లోకి రాగానే దాని వెనకాల మళ్లీ మనస్సులోకి కొన్ని వేల ఆలోచనలు వస్తాయి. అలా జరిగితే నా జీవితం ఏమైపోతుందో, ఒక వేళ అదే నిజమైతే నేను ఎలా బతకాలి, ఒక వేళ బతికినా కూడా నన్ను సమాజం అర్థం చేసుకుంటుందా ఇలా కొన్ని వందల రకాల ఆలోచనలు మైండ్ ను తొలిచేస్తుంటాయి. ఎప్పుడైతే వాటికి అడ్డుకట్ట వేస్తారో అప్పుడే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు లేదంటే ఏవేవో ఆలోచనలతో సతమతం అవుతారు.
పాజిటివ్ గా ఆలోచించండి
నెగెటివ్ థాట్స్ మైండ్ లోకి వచ్చినప్పుడు వెంటనే పాజిటివ్ గా ఆలోచించడం మొదలుపెట్టండి. ఎంత పెద్ద ప్రతికూల ఆలోచనను అయినా సరే ఒక్క పాజిటివ్ థాట్ మాత్రమే చంపగలమని గుర్తు పెట్టుకోండి.
నిరాశా నిస్పృహలు
మీ చుట్టూ నిరాశా నిస్పృహలు ఆవరించడానికి కారణం ఏమిటో తెలుసుకోండి. అందుకు గల కారణాలపై మీకు మీరే ప్రశ్నించుకోండి. వాటికి సమాధానాలు కూడా వెతుక్కోండి. అలా చేయడం ద్వారా మీ మైండ్ ను మీరు మార్చుకోగలుతారు.