Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
బట్టతల రాకుండా జుట్టు తిరిగి వచ్చేందుకు ఏదైనా చేస్తారు, ఆ వీర్యం, పావురం రెట్ట చాలా ఉపయోగిస్తారు
జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు ఆ చిట్కాలు ఎలాంటివి అయినా సరే వాటిని పాటించడానికి వెనుకాడరు. ఇక కొందరు చిత్రవిచిత్రమైన చిట్కాలు పాటిస్తుంటారు. మరి ఈ చిట్కాలు ఏమిటో మీరూ చదవి తెలుసుకోండి.
కొందరు చిన్న వయస్సులోనే బట్టతల వచ్చేస్తూ ఉంటుంది. మరికొందరికీ విపరీతంగా వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. అయితే వెంట్రుకలు రాలిపోకుండా ఉండేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అనుసరిస్తుంటారు. అందుకోసం నానా కష్టాలు పడుతుంటారు. ఫ్రెండ్స్ ద్వారా ఆన్ లైన్ లో సెర్చ్ చేసి, పుస్తకాలు చదివి చిట్కాలు తెలుసుకుంటారు.
జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు ఆ చిట్కాలు ఎలాంటివి అయినా సరే వాటిని పాటించడానికి వెనుకాడరు. ఇక కొందరు చిత్రవిచిత్రమైన చిట్కాలు పాటిస్తుంటారు. మరి ఈ చిట్కాలు ఏమిటో మీరూ చదవి తెలుసుకోండి.

పావురం రెట్ట
బట్టతల రాకుండా, జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు కొందరు పావురం రెట్టను ఉపయోగిస్తుంటారు. పావురం రెట్టను, బీట్రూటు రసాన్ని, హార్స్ రాడిష్, తదితర వాటిని బాగా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని తలకు పూసుకుంటారట. ఇలాంటి చిట్కాలు కూడా పాటించే వారు చాలా మందే ఉన్నారు.

ఎద్దు వీర్యం
కొందరు తలపై జుట్టు రాలిపోకుండా ఉండేందుకు ఎద్దు వీర్యాన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఎద్దు వీర్యంలో ఉండే పోషకాలు జుట్టు బాగా పెరిగేటట్లు చేస్తాయని జనాల నమ్మకం. కొన్ని దేశాల్లో ఎద్దు వీర్యాన్ని షాంపూ తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తుంటారు. యూఎస్, యూకేలలో సెలూన్లలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

ఆవు మూత్రం
ఆవు మూత్రాన్ని జుట్టు రాలిపోకుండా ఉండేందుకు కొందరు ఉపయోగిస్తుంటారు. జుట్టు బాగా పెరిగేందుకు ఆవు మూత్రం బాగా పని చేస్తుందని చాలా మంది నమ్ముతారు. దీంతో చాలా మంది సూర్యోదయానికి ముందే ఆవు మూత్రాన్ని తాగుతూ ఉంటారు. అలాగే మార్కెట్లో 5 శాతం మోతాదులో ఆవు మూత్రం ఉండే పానీయాలు కూడా లభిస్తున్నాయి. వీటికి కూడా చాలా డిమాండ్ ఉంది.

హాట్ సాస్
జుట్టు పెరగాలని కొందరు హాట్ సాస్ కూడా ఉపయోగిస్తారు.
హాట్ సాస్ ఉపయోగించడం వల్ల ఎలుకలలో
జుట్టు బాగా పెరిగిందని, ఈ విషయాన్ని పరిశోధకులు నిర్దారించారని కొరియా జర్నల్ ఆఫ్ డెర్మటాలజీలో 2003 ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు. అయితే దాన్ని మనుషులపై ప్రయోగిస్తే అంతగా ఫలితాలు రాలేదు.

జంతువుల కొవ్వు
పూర్వం ఈజిప్షియన్లు బట్టతల నివారణ కోసం జంతువుల కొవ్వును ఎక్కువగా ఉపయోగించేవారు. సింహం, హిప్పో, మొసలి, పిల్లి, పాము, ఐబెక్స్ వంటి మాంసాలన్నింటినీ కలిపి మిశ్రమంగా మార్చి చికిత్స అందించేవారు. ఇలాంటి చికిత్స ద్వారా జీవితంలో ఎప్పటికీ బట్టతల రాదని, జుట్టు రాలిపోదని ఈజిప్ట్ వాసుల నమ్మకం.

ఎలుక, గుర్రం దంతం
ఎలుక, గుర్రం దంతాలను ఉపయోగించి కూడా ఈజిప్ట్ లో బట్టతలను పోగొట్టుకునేవారు. జూలియస్ సీజర్ ప్రేమికురాలైనా క్లియోపాత్రా ఇలా చేసేవారు. ఎలుక, గుర్రపు దంతాన్ని ఉపయోగించి చికిత్స చేయించుకునేది.అయితే దీని వల్ల పెద్దగా ఉపయోగం లేకపోవడంతో తర్వాత తన బట్టతల కపపడకుండా ఉండాలని తలకు ఒక రత్నాల
పుష్పగుచ్చాన్ని ధరించేది.

తలకిందులుగా..
యోగా ద్వారా కూడా కొందరు బట్టతల రాకుండా చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం కొన్ని రకాల ఆసనాలు వేస్తుంటారు. తల కిందులుగా ఉండే ఆసనాన్ని వేస్తుంటారు. ఇలా చేయడం వల్ల తలకు రక్త ప్రసరణల పెరిగి జట్టు పెరుగుతుందని జనాల నమ్మకం.



Click it and Unblock the Notifications