For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ జన్మరాశిని అనుసరించి, మిమ్మల్ని అభాద్రతాభావానికి లోనుచేసే కారణాలు

|

ఈ వ్యాసంలో, మీ జాతకం ప్రకారం మీ జన్మ రాశిని అనుసరించి, ఎటువంటి విషయాలలో అభద్రతకు లోనవుతారో తెలుసుకుందాం!

మీ భయాలు మరియు అభద్రతా కారణాలు జన్మ రాశులను బట్టి మారుతుంటాయి. ఇవి ఒక వ్యక్తీ నుండి ఇంకొక వ్యక్తితో కూడా వేరుగా ఉంటాయి.

మీ జన్మరాశిని అనుసరించి, మీకు అభాద్రతాభావాన్నికలుగజేసే కారణాలు కనుక మీరు తెలుసుకోగలిగితే, వాటిని ఎలా ఎదుర్కోవాలనే ఆలోచన చేయొచ్చు.

వివిధ జన్మరాశుల వారికి అభద్రతను కలుగజేసే కారణాలను గురించి ఇక్కడ తెలుసుకోండి!

మేషం : మార్చి 21-ఏప్రిల్ 19

మేషం : మార్చి 21-ఏప్రిల్ 19

ఈ రాశివారికి ఎటువంటి ఓటమినైనా లేదా వైఫల్యాన్ని తట్టుకోవడం చాలా కష్టమనిపిస్తుంది. వారు ప్రతివిషయాన్ని కూడా జీవితంలో చాలా ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తూ, ఓడిపోతామేమో అనే అభద్రతాభావంతో అనుక్షణం బాధపడుతుంటారు. వీరు జీవితంలో ఆటుపోట్లు సహజమేనని, అవి ఎదురైనప్పటికీ నిలదొక్కుకోవడం కష్టమైనా పని కాదని ,కొన్ని విషయాలను సులువుగా తీసుకోవాలని అర్ధం చేసుకోవాలి. వీరు ప్రశాంతంగా ఊపిరి తీసుకోవడం అలవర్చుకోవాలి.

వృషభం: ఏప్రిల్ 20-మే 20

వృషభం: ఏప్రిల్ 20-మే 20

ఈ రాశికి చెందిరవారు నిస్వార్ధపరులైనప్పటికి,కొన్ని సందర్భాలలో ఇతరులకు సహాయపడటంలో తాము నష్టపోతారు. వీరు గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే, తమకు తాము మొదటి ప్రాధాన్యతను ఇచ్చుకోవటం ఎంతైనా అవసరం.

మిధునం: మే 21- జూన్ 20

మిధునం: మే 21- జూన్ 20

వీరు అత్యంత అదృష్టవంతులుగా పేరొందుతారు. పైగా ఆ విషయం వారికి కూడా తెలుసు. కానని కొన్ని సందర్భాలలో, చిన్న అవాంతరాలు ఎదురైనప్పుడు, వీరు అధికంగా ఆందోళన చెంది అభద్రతా భావానికి లోనవుతారు. వారు ఆశావహ దృక్పధాన్ని అలవర్చుకుని, అవాంతరాలు ఎదురైనప్పతికిని, సమయం గడిచే కొద్దీ పరిస్థితులు చక్కబడతాయని గుర్తించాలి.

కర్కాటకం: జూన్ 21-జూలై 22

కర్కాటకం: జూన్ 21-జూలై 22

వీరు ప్రతికూల పరిస్థితులకు సులువుగా లొంగిపోయే మనస్తత్వం కలిగి ఉండటం వలన ఎప్పుడూ అభద్రతతో ఉంటారు. వీరు తమ భావోద్వేగాలను నియంత్రించుకోలేని పరిస్థితులను ఎదుర్కోలేరు. కొన్ని సందర్భాలలో నలుగురి మధ్యలో ఇలాంటి సందర్భం ఎదురువస్తే తమ ఈ లోపం బయటపడిపోతుంది. అంతేకాకుండా వీరు ప్రతివిషయం తమ చెప్పుచేతల్లో ఉండాలని కోరుకుంటారు. అది సాధ్యం కానప్పుడు, వారు ఆందోళన చెందుతారు.

సింహం : జూలై 23-ఆగస్ట్ 23

సింహం : జూలై 23-ఆగస్ట్ 23

వీరు జీవితంలో ప్రతి విషయంలోనూ ఇతరుల హామీని ఆశిస్తారు. కనుక వారు అధికంగా ప్రేమించేవారు, తమ పట్ల అదేవిధమైన ప్రేమ చూపకపోయినా లేదా తమను ప్రశంసించకపోయినా, వారు అభద్రతకు లోనవుతారు. వారికి ఎదుటివారు అనునిత్యం ప్రేమాభిమనాలనే భావనలను అందజేస్తూ ఉండాలి.

కన్య: ఆగస్ట్ 24- సెప్టెంబర్ 23

కన్య: ఆగస్ట్ 24- సెప్టెంబర్ 23

ఈ రాశికి చెందినవారికి ఖచ్చితత్వం ఎక్కువ. ప్రతి పనిని నిబద్దతతో పరిపూర్ణంగా చేస్తారు. పరిస్థితులు మరియు ప్రదేశాలు అస్తవ్యస్తంగా ఉంటె వీరు చికాకు పడుతూ, అభద్రతకు లోనవుతారు. వీరు గజిబిజి మరియు గందరగోళ వ్యవహారాలను ఇష్టపడరు. ఇది వారి చుట్టూ ఉన్న సాంఘిక పరిస్థితులకు కూడా వర్తిస్తుంది.

తుల: సెప్టెంబర్ 24- అక్టోబర్ 23

తుల: సెప్టెంబర్ 24- అక్టోబర్ 23

వీరు ఇతరులు తమను విస్మరిస్తారేమో అనే అభద్రతతో బాధపడుతుంటారు. వారు తమతో సత్సాన్నిహిత్యాన్ని కలిగి ఉన్న వ్యక్తులను లేదా తమ పట్ల శ్రద్ధ చూపించడానికి ఆసక్తి కనపరిచేవారిని ఇష్టపడతారు. ఒకవేళ ఇలా జరగనట్లయితే, వారు అశాంతికి మరియు అభద్రతాభావానికి లోనవుతారు.

వృశ్చికం: అక్టోబర్ 24-నవంబర్ 22

వృశ్చికం: అక్టోబర్ 24-నవంబర్ 22

వారు తమ చుట్టూ జరుగుతున్న సంఘటనలన్నిటినీ గురించి, వెనువెంటనే సమాచారం పొందాలనే తపనతో ఉంటారు. కనుక వారు తమకు పరిజ్ఞానం లేని లేక ఊహించని పరిస్థితులు అకస్మాత్తుగా ఎదురైతే,భయాందోళనలకు గురవుతారు. పరిచయం లేని విషయాలు వారికి ఆతృతను కలుగజేసి వారిని స్వీయసంరక్షణ స్థితిలోకి నెడతాయి.

ధనుస్సు: నవంబర్ 23-డిసెంబర్ 22

ధనుస్సు: నవంబర్ 23-డిసెంబర్ 22

వీరు ఎవరైనా తమ వద్దకు సమస్యలతో సహాయం కొరకు వస్తే, వాటిని పరిష్కరించలేమేమో అని వ్యాకులతకు లోనవుతారు. వీరు తమను తాము సమస్యలకు పరిష్కారంను చూపేవారిగా భావిస్తారు. ఒకవేళ తాము ఆ పనిని సక్రమంగా చేయలేకపోతే అభద్రతాభావానికి లోనవుతారు.

మకరం: డిసెంబర్ 23-జనవరి 20

మకరం: డిసెంబర్ 23-జనవరి 20

ఈ రాశి వారు ఎప్పుడూ స్థితప్రజ్ఞతతో కూడిన భరోసాతో మెలుగుతూ అవాంఛనీయ పరిస్థితులను కూడా సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటారు. కనుక వారు ఎలాంటి సమస్యలు ఎదురైనా తోత్రుపాతుకు లోనవ్వరు. కనుక తమపై తాము అటువంటి నియంత్రణను కోల్పోయి ఇతరుల ముందు అవివేకిగా అనిపించుకుంటామేమో అనే భయం తో ఉంటారు. ఈ భావనలు వారిని అభద్రతలోనికి నెడతాయి.

కుంభం: జనవరి 21-ఫిబ్రవరి 18

కుంభం: జనవరి 21-ఫిబ్రవరి 18

వీరిని తమకు ఇష్టం లేని పనిని చేయమని బలవంతపెడితే, అభద్రతాభావానికి లోనవుతారు. వీరు నటించలేరు మరియు వ్యక్తులకు లేదా పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకోలేరు. కనుక ఇటువంటే ఇబ్బంది పెట్టె సందర్భాలు ఎదురైనప్పుడు, వారు అభద్రతాభావానికి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మీనం: ఫిబ్రవరి 19-మార్చి 20

మీనం: ఫిబ్రవరి 19-మార్చి 20

ఈ రాశివారు ఎప్పుడైనా విమర్శను తట్టుకోలేరు. వీరు అందరి యెడల మంచి బాలుని వలె మసలుకుంటూ అందరి ప్రశంసలు పొందటాన్ని ఇష్టపడతారు. కాని అలా జరగనప్పుడు లేదా విమర్శను ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తే, వారు దానిని ఎదుర్కొనలేరు.

English summary

What Are Your Worst Insecurities? We Reveal All Of Them According To Your Zodiac Sign

Each of the zodiac signs has its own share of ups and downs. The individuals have unique peculiar fears and insecurities that could be due to the zodiac sign they belong to.Can you imagine what is the worst thing that one can expect from a zodiac sign? The fears, strength and insecurities can all be based on the zodiac signs.
Story first published:Wednesday, May 9, 2018, 16:29 [IST]
Desktop Bottom Promotion