For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ రాశిచక్రం ప్రకారం, మీకు సరిపడే పెంపుడు జంతువేదో తెలుసుకోండి !

మీ రాశిచక్రం ప్రకారం, మీకు సరిపడే పెంపుడు జంతువేదో తెలుసుకోండి !

|

ఒక వ్యక్తి రాశిచక్రము ఆధారంగా అతని వ్యక్తిత్వము & ఇతర గుణగణాలు గూర్చి మనము పూర్తిగా తెలుసుకోవచ్చు. కానీ ఇదే రాశిచక్రము ఆధారంగా మీకు సరిపడే పెంపుడు జంతువు గూర్చి కూడా తెలుసుకోగలరని మీకు తెలుసా?

పెంపుడు జంతువుల జ్యోతిష్యశాస్త్ర ప్రకారం, మీకు సరిపడే పెంపుడు జంతువులను గూర్చి తెలుసుకోవటమనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కానీ మీరు మీ వ్యక్తిత్వానికి సరిపోయిన పెంపుడు జంతువులను ఎంచుకున్నప్పుడు మీకు మరింత లాభదాయకంగా ఉంటుందని మీకు తెలుసా ?

Zodiac Signs Compatibility With Pet Animals

మీ రాశిచక్రము ఆధారంగా మీ వ్యక్తిత్వము ఎక్కువగా ప్రభావితం కానున్నట్లు తెలిసినందున, మీ రాశిచక్రము ప్రకారం, మీకు సరిపడే పెంపుడు జంతువును ఎంచుకోవడమనేది చాలా ముఖ్యము.

మీ రాశిచక్రము ఆధారంగా మీరు దత్తత తీసుకోవలసిన పెంపుడు జంతువుల గురించి ఈ వ్యాసంలో పూర్తిగా వెల్లడించాము. అవేమిటో మీరే తెలుసుకోండి !

మేషం : (మార్చి 21 - ఏప్రిల్ 19: డాగ్స్)

మేషం : (మార్చి 21 - ఏప్రిల్ 19: డాగ్స్)

మీరు చాలా చురుకుగా, శక్తివంతులుగా ఉండటానికి ఎలాంటి పరిమితులను కలిగి ఉండరని ఈ రాశి వారు గుర్తుంచుకోవాలి. మీరు చాలా ప్రత్యేకంగా కనబడే పెంపుడు జంతువును కావాలని కోరుకుంటారు కాబట్టి, మీడియం సైజులో ఉన్న ఎనర్జిటిక్ డాగ్ను కలిగి ఉండటంవల్ల, దాని కుర్ర చేష్టలతో మీరు మరింత ఆనందాన్ని పొందుతారు.

వృషభం: (ఏప్రిల్ 20 - మే 20: పిల్లులు / కుందేళ్ళు)

వృషభం: (ఏప్రిల్ 20 - మే 20: పిల్లులు / కుందేళ్ళు)

ఈ రాశివారు స్థిరమైన మనస్తత్వాన్ని కలిగి, ఇతరులపై ఆధారపడే వారిగా ఉంటారు. అలాగే వీరు మొండి పట్టుదలను కలిగివుంటారు. వీరు తమ మనసులో ఉన్న కోరికను సాధించడానికి, ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనక్కి మాత్రం తగ్గరు. మీరు చాలా బద్ధకస్తులు కాబట్టి, వీరికి తగ్గ పెంపుడు జంతువుగా పిల్లిని అభివర్ణించవచ్చు. దీనితోపాటుగా, కుందేలు కూడా ఈ రకమైన వ్యక్తులకు మంచి ఆప్షన్గా ఉంటాయి. కానీ వీరు వారి సహనాన్ని పరీక్షించుకునే అవకాశాలను కూడా కలిగి ఉన్నాయి.

మిథునం: (మే 21- జూన్ 20: చిలుకలు / కోతులు)

మిథునం: (మే 21- జూన్ 20: చిలుకలు / కోతులు)

ఈ రాశివారు తమ చుట్టూ జరుగుతున్న విషయాల సమాచారాన్ని సేకరించడానికి చాలా ఆసక్తి చూపుతారు. అలాగే వీరు కొత్త విషయాల గురించి అన్వేషించి వాటిని గూర్చి మాట్లాడటానికి ఇష్టపడతారు. వీళ్ళ వ్యక్తిత్వానికి దగ్గరగా రామచిలుకలు ఉంటాయి, ఎందుకంటే వీరు కూడా వాటిలాగే గలగలా మాట్లాడుతూ ఉంటారు. అంతేగాకుండా ఈ రామచిలుకలు చాలా తెలివైనవి & కాలక్రమేనా చమత్కారంగా కూడా మాట్లాడుతాయి. ఈ రాశివారు ఒకవేళ సాహసోపేతమైన వారైతే, వీరికి పెంపుడు జంతువుగా కోతులు సరిగ్గా సరిపోతాయని చెప్పవచ్చు.

కర్కాటకం: (జూన్ 21- జూలై 22: చిట్టెలుక)

కర్కాటకం: (జూన్ 21- జూలై 22: చిట్టెలుక)

అన్ని రాశిచక్రాల వారిలో ఈ కర్కాటక రాశి వారు అత్యంత సున్నితమైన వారుగా పరిగణించబడతారు. ఒక అందమైన చిట్టెలుకను ఈ వ్యక్తుల కోసం సూచించబడిన పెంపుడు జంతువని చెప్పవచ్చు. ఈ రాశిచక్రం వారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉన్నవారిగా ఉండటం వల్ల, చిట్టెలుక వలె తమని తాము సంరక్షించుకోవడంలో అద్భుతమైన పని నైపుణ్యంతో కూడిన ప్రదర్శనను కలిగి ఉంటారు. ఈ చిట్టెలుకలు చూడటానికి చాలా క్యూట్గా, అందరూ ఇష్టపడేటటువంటి చిన్న ప్రాణిగా, మీతో పాటు వీటిని కూడా తీసుకెళ్లేటట్లుగా ఉంటాయి.

సింహం: (జూలై 23 - ఆగస్టు 23: గుర్రాలు)

సింహం: (జూలై 23 - ఆగస్టు 23: గుర్రాలు)

సింహం అనేది గంభీరంగా, ఠీవీగా కనిపించే జంతువుగా అందరూ పిలుస్తారు. వీరు వీరి శైలిలో ఎటువంటి పనులనైనా చెయ్యగలరు. ఈ రాశివారికి పెంపుడు జంతువులను దత్తత తీసుకోవడమనేది పెద్ద విషయమేమీ కాదు ! మరికొంతమంది సింహా జాతికి దగ్గరగా ఉన్న పిల్లులను పెంపుడు జంతువుగా అభివర్ణిస్తారు కానీ ఇది నిజం కాదు. సింహంలానే ఠీవీగా కనిపించే గుర్రాలే ఈ రాశి వారికి సరైన ఎంపిక అని అందరూ భావిస్తారు.

కన్య: (ఆగస్టు 24 - సెప్టెంబర్ 23: చేప)

కన్య: (ఆగస్టు 24 - సెప్టెంబర్ 23: చేప)

ఈ రాశివారు చాదస్తమును, సహాయ గుణాన్ని కలిగి ఉండటం వల్ల వారికి సరిగ్గా సరిపోయే పెంపుడు జంతువును ఎంపిక చేయడం చాలా అవసరం. ఈ పెంపుడు జంతువులు ఇంట్లోనే కాస్త అటూఇటూ తిరుగుతూ, ఆందోళనకు & గందరగోళానికి గురవుతూ ఉండే పెద్ద జీవులు అవసరంలేదు. అలాగే ఇవి సంచరించేటప్పుడు చూడటానికి అందంగా ఉండే జీవి మాత్రం చాలు, అది మరేమిటో కాదు చేప మాత్రమే ! ఈ చాప మీ ఇంట్లోనే ఇలాంటి గందరగోళ పరిస్థితులను సృష్టించదు కానీ ఈ రాశి వారికి ఇదే సరైన పెంపుడు జంతువు.

తుల: (సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23: పర్షియన్ పిల్లులు)

తుల: (సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23: పర్షియన్ పిల్లులు)

ఈ రాశివారు ఆచరించే అనేక పనులలో సమతుల్యతను కోరుకుంటారు, వీరు ఎక్కువగా అందమైన, ఆకర్షణీయమైన విషయాలకు దగ్గరగా ఉంటారు. కాబట్టి ఈ రాశివారు అందమైన పెంపుడు జంతువులను ఎక్కువగా ఇష్టపడుతారు. వీరి అభిరుచికి తగిన పెంపుడు జంతువులు విషయంలో తెల్లని "పర్షియన్ పిల్లి" సరేనా ఛాయిస్గా కనబడుతుంది.

వృశ్చికం: (అక్టోబర్ 24 - నవంబర్ 22: పాము)

వృశ్చికం: (అక్టోబర్ 24 - నవంబర్ 22: పాము)

ఈ రాశి వారు అల్పమైన, తక్కువయినా స్థాయిలో ఉండే పెంపుడు జంతువులను కాకుండా, చాలా ప్రత్యేకంగా కనబడే జంతువులను కోరుకుంటారు. ఈ విధమైన పెంపుడు జంతువు ఎన్నిక అనేది ప్రతీ ఒక్కరిని భయపెట్టేదిగా ఉండాలని వారు కోరుకుంటారు. అలాంటివారికి "పాము" మాత్రమే సరైన ఎంపిక అని చెప్పవచ్చు.

ధనుస్సు: (నవంబర్ 23 - డిసెంబర్ 22: తాబేలు)

ధనుస్సు: (నవంబర్ 23 - డిసెంబర్ 22: తాబేలు)

ఈ రాశివారు నిరంతర ఆశాజనకమైన జీవులుగా ఉంటారు. ఏ రాశి వారు ఎక్కువగా స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఇష్టపడతారు. అందుకే ఇలాంటి వారు చేసే ప్రయాణాలకోసం వారిని ఉత్సాహపరచే పెంపుడు జంతువుల కలిగి ఉండాలని వారు కోరుకోరూ. ఎందుకంటే అవి వారి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలకు భంగం కలిగిస్తాయి. ఈ రాశి వారు తక్కువ ఖర్చులను చేస్తారు కాబట్టి వారికి తగినట్లుగానే ఉండే చేపలు (లేదా) తాబేలు వంటి జీవులను పెంపుడు జంతువులుగా కలిగి ఉంటారు.

మకరం: (డిసెంబర్ 23 - జనవరి 20: ముంగీస)

మకరం: (డిసెంబర్ 23 - జనవరి 20: ముంగీస)

ఏ రాశి ఫలితాలు పట్టుదలను, కృషిని ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు అత్యంత కఠినంగా వ్యవహరించే జంతువులను కూడా వీరే ఆధీనంలోనికి తెచ్చుకుంటారు. ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన రాశులవారికి ముంగిస అనేది అద్భుతమైన పెంపుడు జంతువుగా సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఈ రాశివారు తమ పెంపుడు జంతువులతో సంభాషిస్తూ, ఎక్కువ శ్రద్ధను చూపెడుతూ, ప్రేమగా వ్యవహరిస్తారు. ఇలాంటి వారికి కుక్కలు కూడా అద్భుతమైన సహచరులుగా కూడా ఉంటాయి.

కుంభం: (జనవరి 21 - ఫిబ్రవరి 18: లవ్ బర్డ్స్)

కుంభం: (జనవరి 21 - ఫిబ్రవరి 18: లవ్ బర్డ్స్)

ఈ రాశి వారు తమకు ఒక పెంపుడు జంతువును కలిగి ఉండాలనే ఆలోచనను చేయరు. ఎందుకంటే వీరు స్వేచ్ఛా పూరితమైన ప్రేమను, స్వాతంత్రాన్ని ఎక్కువగా కోరుకుంటారు. ఇలాంటి వారికోసం ఒక పెంపుడు జంతువును పూర్తిగా అంకితమవ్వాలి. ఇలాంటి ఈ దృక్పథాన్ని కలిగి ఉన్నవ్యక్తులు పెంపుడు జంతువులుగా జంట పక్షులను (లవ్ బర్డ్స్) ఎంచుకోవటం చాలా ఉత్తమమైన నిర్ణయము.

మీనం: (ఫిబ్రవరి 19 - మార్చి 20: కుందేళ్లు)

మీనం: (ఫిబ్రవరి 19 - మార్చి 20: కుందేళ్లు)

ఈ రాశివారు అంకిత భావాన్ని కలిగి, అతిసున్నితత్వాన్ని కలిగిన ఉండటం వల్ల, చాలా విచిత్రమైన వారిగా కనబడతారు. ఈ రాశివారు నీటి చిహ్నానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ వ్యక్తులు ఎక్కువగా చేపలను ఇష్టపడతారు. అయితే ఈ రాశి వారి కోసం అందమైన, సొగసైన కుందేలు పెంపుడు జంతువుగా ఉండటం చాలా మంచిది.

English summary

Zodiac Signs' Compatibility With Pet Animals

Zodiac Signs' Compatibility With Pet Animals,Do you know which animal is the perfect match for you as per your zodiac sign? Find out as our astro experts reveal about the details of the pet animals that are compatible with your zodiac.
Story first published:Thursday, May 17, 2018, 18:02 [IST]
Desktop Bottom Promotion