For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉలుపి చెప్పిన శృంగార రహస్యం అదే.. అర్జునుడిని ఇష్టపడిన ఆమెను తన కుమారునికి చేసుకోవాలనుకుంటాడు

అర్జునుడు, ఉలుపి సంబంధం గురించి మహాభారతంలోని ఆదిపర్వంలో పేర్కొన్నారు. ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే అది ప్రకృతి విరుద్ధం కాదని పార్థుడికి ఉలూపి తెలిపింది.

By Bharath
|

మహాభారతంలో అర్జునుడుకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈయన విలు విద్యలో నంబర్ వన్ అని మనకు తెలుసు. ఆ విద్యతోనే స్వయంవరంలో ద్రౌపదిని దక్కించుకున్నాడు. ద్రౌపది అర్జునుడితో పాటు తన తోటి నలుగురు అన్నదమ్ములకు కూడా భార్యగా మారింది. అర్జునుడికి ద్రౌపదితో పాటు మరో ముగ్గురు భార్యలున్నారు. అలాగే తనపై మనస్సు పడ్డ అమ్మాయిని తన కొడుకుకు ఇచ్చి పెళ్లి చేయమంటాడు అర్జునుడు. అర్జునుడి భార్యలు ఎవరూ.. వారి కథ ఏమిటో తెలుసుకుందామా.

ద్రౌపదితో వివాహం

ద్రౌపదితో వివాహం

అర్జునుడు మొదట ద్రుపదుడు కుమార్తె ద్రౌపదిని వివాహం చేసుకున్నాడు. పాంచాలరాజు ద్రుపదుడు తన కుమార్తె ద్రౌపది వివాహాం కోసం స్వయంవరం ఏర్పాటుచేస్తాడు. ఆ స్వయంవారానికి ఎంతో మంది రాజులు బయల్దేరి వస్తారు. అందులో దుర్యోధనుడు,శిశుపాలుడు, జరంధరుడు, కర్ణుడు,శ్రీకృష్ణుడు వంటి యోధానుయోధులు కూడా ఉంటారు.

పోటీ ఇదే

పోటీ ఇదే

ఒక ఉక్కు పోలుకు, గిర్రున తిరిగే చక్రాన్ని, దానికి ఒక చేపను అమర్చి ఉంటారు. తొట్టిలాంటి పాత్రలో అది మొత్తం సిద్ధం చేసి పెట్టి ఉంటారు. కింద నీటిలో చూస్తూ పైన చక్రానికి వేళ్ళాడుతున్న చేప కంటిని బాణంతో కొట్టాలి. ఈ పోటీ అక్కడికి వచ్చిన మహామహాల గుండెల్లో భయాన్ని రేపింది. మనస్సులో భయపపడుకుంటూనే అందరూ పోటీకి సిద్ధమయ్యారు.

అర్జునుడి బాణం

అర్జునుడి బాణం

ద్రౌపది స్వయంవరానికి వచ్చిన వారంతా విల్లు ఎక్కుపెట్టి చేపకు గురి పెట్టారు కానీ ఒక్కరూ కూడా చేపను కొట్టలేకపోయారు. చివరకు అర్జునుడు విల్లును సంధించి బాణం వదులుతాడు. ఆ బాణం చేప కంటికి తగిలుతుంది. వెంటనే ద్రౌపది అర్జునుడి మెడలో పూలమాల వేస్తుంది. ద్రౌపదిని అలా దక్కించుకుంటాడు అర్జునుడు.

రెండో భార్యగా సుభద్ర

రెండో భార్యగా సుభద్ర

అర్జునుని రెండో భార్య సుభద్ర. ఈమె రోహిణీ వసుదేవుల కూతురు. శ్రీ కృష్ణునిడి చెల్లి. సుభద్రకు వయసురాగానే అర్జునుడిపై మనస్సు పడింది. ఆమె మొదట అర్జునుని చూడలేదు. కానీ అతని అందం, అభినయం, ధైర్య సాహసాల గురించి చాలా సార్లు విన్నది. అర్జునుడి విలు విద్యా పరాక్రమాల గురించి ఆమె రోజూ వింటూ ఉండేది. అందుకే అతనిపై మనస్సు పారేసుకుంది.

బలరాముడికి ఇష్టం ఉండేది కాదు

బలరాముడికి ఇష్టం ఉండేది కాదు

అయితే సుభద్ర పెద్దన్నయ్య బలరామునికి పాండవులంటే ఇష్టం లేదు. బంధుత్వం కలుపుకొని నిలుపుకోవాలన్న ఆశా లేదు. పైగా పాండవులు అడవుల్లో ఉంటున్నారన్న అభిప్రాయమూ ఉంది. అందుకనే దుర్యోధనునికి తన చెల్లిని ఇచ్చి పెళ్ళి చేయాలని అనుకున్నాడు. కాని చిన్నన్నయ్య కృష్ణుడికి చెల్లెలు సుభద్ర మనసు తెలుసు. ఆమె ఎవరినీ కోరుకునేది కూడా కృష్ణుడికి తెలుసు.

సుభద్ర కోరికను నెరవేర్చాలనుకున్నాడు

సుభద్ర కోరికను నెరవేర్చాలనుకున్నాడు

సుభద్ర కోరికను నెరవేర్చాలనుకున్నాడు కృష్ణుడు. పైగా ఈయన ఎప్పుడూ పాండవుల వైపే ఉండేవాడు. అందుకే సుభద్రకు కూడా అర్జునుడిని ప్రేమించడం మొదలుపెట్టింది. ఒకసారి ప్రభాస తీర్థం వచ్చిన అర్జునుడు కృష్ణుని చూడవస్తే అతన్ని సన్యాసిలాగ ఉండమన్నాడు. అలా పథకం రచించాడు కృష్ణుడు.

మారువేషంలో సుభద్ర దగ్గరకు..

మారువేషంలో సుభద్ర దగ్గరకు..

సన్యాసి రూపంలో ఉన్న అర్జునుడిని బలరాముడు భక్తితో ఆహ్వానించి ఉద్యాన వనంలో ఆశ్రయమిచ్చాడు. అతిధి మర్యాదలకు సేవలకు సుభద్రని పంపాడు. ఆ విషయం తెలియని సుభద్ర మీ తీర్థయాత్రల్లో మా చిన బావ కనిపించినాడా? అని అర్జునుని గురించి అర్జునునే అడుగుతుంది. అప్పుడు అతను నవ్వుకుంటాడు. వెంటనే అర్జునుడు మీసాలూ గడ్డాలు తీసి, తానే అర్జునుడినని చెబుతాడు.

కృష్ణుడి పక్కాప్లాన్

కృష్ణుడి పక్కాప్లాన్

మనమిద్దరం ఎలాగైనా వివాహం చేసుకుందాం అని అర్జునుడితో అంటుంది సుభద్ర. గాంధర్వ వివాహం చేసుకోవాలనుకుంటారు. మనకు అండగా మా అన్న శ్రీకృష్ణుడు ఉన్నాడు పెళ్లి చేసుకుందామని అర్జునుడిని తొందర పెడుతుంది సుభద్ర. ఇక కృష్ణుడు పక్కా ప్లాన్ వేసి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవ పండుగలో ఊరు ఊరంతా నిమగ్నమై ఉంటుంది.

బలరాముడూ ఆడిపాడితుంటే

బలరాముడూ ఆడిపాడితుంటే

ఉత్సవంలో బలరాముడూ ఆడిపాడితూ ఆనందంలో మునిగి తేలుతుంటాడు. మరో పక్క కృష్ణుడు సుభ్రదా అర్జునుల పెళ్ళి జరిపిం చేసి ఇంద్రప్రస్థానికి పంపుతాడు. అయితే ఈ విషయం తెలిసి పాలకులు, రక్షకులు అడ్డుకుంటారు. అర్జునుడు వాళ్ళతో యుద్ధం చేస్తుంటే సుభద్రే రథం నడుపుతుంది. అందుకే వీరునికి తగిన ఇల్లాలుగా వీర వనితగా పేరుగాంచింది.

ఇద్దరూ కలిసిపోతారు సుభద్రతో అర్జునుడు ఇంద్ర ప్రస్థం చేరుతాడు. తను మళ్లీ పెళ్లి చేసుకున్నందుకు ద్రౌపది ఏమంటుందోనని భయపడతాడు అర్జునుడు. ఇంట్లోకి అడుగుపెడుతూ ద్రౌపది పాదాలకు నమస్కరిస్తుంది సుభద్ర. ద్రౌపది కూడా ఆమెను బాగా చూసుకుంటుంది. ఇద్దరూ అలా కలిసిమెలిసి జీవిస్తారు.

ఇద్దరూ కలిసిపోతారు సుభద్రతో అర్జునుడు ఇంద్ర ప్రస్థం చేరుతాడు. తను మళ్లీ పెళ్లి చేసుకున్నందుకు ద్రౌపది ఏమంటుందోనని భయపడతాడు అర్జునుడు. ఇంట్లోకి అడుగుపెడుతూ ద్రౌపది పాదాలకు నమస్కరిస్తుంది సుభద్ర. ద్రౌపది కూడా ఆమెను బాగా చూసుకుంటుంది. ఇద్దరూ అలా కలిసిమెలిసి జీవిస్తారు.

సుభద్రతో అర్జునుడు ఇంద్ర ప్రస్థం చేరుతాడు. తను మళ్లీ పెళ్లి చేసుకున్నందుకు ద్రౌపది ఏమంటుందోనని భయపడతాడు అర్జునుడు. ఇంట్లోకి అడుగుపెడుతూ ద్రౌపది పాదాలకు నమస్కరిస్తుంది సుభద్ర. ద్రౌపది కూడా ఆమెను బాగా చూసుకుంటుంది. ఇద్దరూ అలా కలిసిమెలిసి జీవిస్తారు.

అభిమన్యుడు

అభిమన్యుడు

ఇక సుభద్ర, అర్జునులకు అభిమన్యుడు పుడతాడు. అర్జునుడు అరణ్యవాసానికి వెళ్ళగా కొడుకుని తీసుకొని సుభద్ర పుట్టినిళ్ళు ద్వారక చేరింది. అభిమన్యున్ని అమ్మానాన్నా అన్నీ తానే అయి పెంచింది. పెద్ద చేసింది. అరణ్యవాసం ముగిసే సమయానికి విరాట నగరం చేరింది. భర్తను కలిసింది. కొడుకుని అర్జునుని ఎదుట నిలబెట్టింది. తన బాధ్యతను నిలబెట్టుకుంది.

ఉలుపితో వివాహం

ఉలుపితో వివాహం

అడవికి వెళ్ళిన అర్జునుడి అందాన్ని చూసి మొదటిచూపులోనే ఒక సర్పరాణి ఉలూపి ప్రేమలో పడుతుంది. పాతాలలోకం లోని సర్పరాజు కౌరవ్య (కారవ్య) కూతురే ఈ ఉలూపి. అడవిలో ఒక సరస్సులో స్నానం చేయడానికి వెళ్ళిన అర్జునుడిని కాళ్ళు చేతులను బంధించి పాతాలలోకానికి తీసుకువెళ్తుంది.

అర్జునుడిని కాపాడుతుంది

అర్జునుడిని కాపాడుతుంది

సర్పరాజుకు ఇది నచ్చదు. అర్జునుడిని చంపడానికి ప్రయత్నం చేయగా ఉలూపి నరక జ్వాలల నుంచి కాపాడుతుంది. ఉలూపి ప్రేమకు ముగ్ధుడైన అర్జునుడు ఆమెను వివాహమాడతాడు.

ఉలుపి శృంగారం గురించి ఇలా చెప్పింది

ఉలుపి శృంగారం గురించి ఇలా చెప్పింది

అర్జునుడు, ఉలుపి సంబంధం గురించి మహాభారతంలోని ఆదిపర్వంలో పేర్కొన్నారు. ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే అది ప్రకృతి విరుద్ధం కాదని పార్థుడికి ఉలూపి తెలిపింది. అంతేకాదు అవివాహిత లైంగిక వాంఛను తీర్చమని అడిగితే కాదనకూడదని పేర్కొంది.

చిత్రాంగదతో పెళ్లి

చిత్రాంగదతో పెళ్లి

చిత్రాంగద తూర్పు హిమాలయాలలోని మణిపురపు రాకుమారి .

చిత్రాంగద తండ్రి చిత్రవాహనుడు. చిత్రవాహనుడికి చిత్రాంగద ఒక్కరే సంతానం. అర్జునుడు అరణ్యవాసం చేసే సమయంలో చిత్రాంగదను చూస్తాడు.

కండీషన్

కండీషన్

అయితే చిత్రాంగద తండ్రి చిత్రవాహనుడు ఒక కండీషన్ పెడతాడు. తన కూతుర్ని అర్జునుడి వెంట పంపనని చెబుతాడు. తర్వాత చిత్రంగద, అర్జునుడికి బభృవాహనుడు జన్మిస్తాడు. ఆమె తన కొడుకుతో కలిసి మణిపూర్ లో చిత్రాంగద నివాసం ఉంటుంది. అర్జునుడు హస్తినాపురం నుంచి మణిపూర్ కు తన భార్య, కొడుకును చూడటానికి అప్పుడప్పుడు వెళ్ళేవాడు.

కొడుకుకి ఇవ్వమంటాడు

కొడుకుకి ఇవ్వమంటాడు

విరాట రాజు తన కూతురు ఉత్తరను వివాహం చేసుకోవాల్సిందిగా అర్జునుడిని కోరతాడు. ఆ రాజు మాటకు కుదరదని చెబుతాడు అర్జునుడు. తన రాజ్యాన్ని పాండవులకు ఇస్తానని తన కుమార్తెను వివాహం చేసుకోవాలని కోరగా రాజు కోరికకుఅడ్డు చెబుతాడు అర్జునుడు. ఉత్తర అర్జునుడిని గురువుగా భావిస్తే,అర్జునుడు తన కుమార్తెగా భావిస్తాడు. అయితే కొన్ని రోజుల తర్వాత తన కొడుకు అభిమన్యుడికి ఇచ్చి ఉత్తరను పెళ్లి చేయమని అర్జునుడు విరాటరాజుకు చెబుతాడు.

All Images Source : https://www.speakingtree.in

English summary

who was the fifth girl arjun was about to marry but could not

who was the fifth girl arjun was about to marry but could not
Desktop Bottom Promotion