For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోళ్లను రాత్రి పూట ఎందుకు కత్తిరించుకోకూడదో తెలుసా? క్షుద్రపూజలకు ఉపయోగం, పెద్దలు అందుకే వద్దంటారు..

ముఖ్యంగా రాత్రి పూట గోళ్లు కత్తిరిస్తే చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. క్షుద్ర పూజలని నమ్మేవారు, అలాంటివి చేసే ప్రాంతాల్లో రాత్రిపూట అస్సలు గోళ్లను కత్తిరించుకోకూడదు.

By Arjun Reddy
|

మనలో చాలా మంది చాలా విషయాలను నమ్ముతూ ఉంటారు. అందులో ఒకటి గోళ్లను కత్తిరించుకోవడం.
గోళ్లను ఎప్పుడంటే అప్పుడు కత్తిరించవద్దని ఇంట్లో పెద్దవాళ్లు సూచిస్తూనే ఉంటారు. గతంలో పెద్దలు రాత్రి పూట అస్సలు గోళ్లను కత్తిరించుకునేవారు కాదు. అలా తరాలు మారుతున్న ఆ విధానాన్ని మనం పాటిస్తున్నాం. అయితే అందుకు గల కారణాలు చాలామందికి తెలియవు. అసలు రాత్రి పూట గోర్లను ఎందుకు కత్తిరించుకోకూడదో ఒకసారి తెలుసుకోండి.

ఎక్కడంటే అక్కడ పడేవి

ఎక్కడంటే అక్కడ పడేవి

పూర్వకాలంలో రాత్రి పూట గోళ్లను కత్తిరించుకునే వారు కాదు. ఎందుకంటే అప్పట్లో కరెంట్ ఉండేది కాదు. దీంతో ఆ సమయంలో గోళ్లను కత్తిరిస్తే ఆ ముక్కలు ఇంట్లో ఎక్కడంటే అక్కడ పడేవి. కాళ్లకు కూడా గుచ్చుకునేవి.

అలాగే తినే ఆహారపదార్థాల్లోనూ గోళ్ల ముక్కలు పడేవి. అందువల్ల అప్పటి కాలం మనుషులు రాత్రి పూట గోళ్లను కత్తిరించుకోవద్దని చెబుతూ ఉంటారు. అలా అప్పటి నుంచి ఆ ఆచారం కంటిన్యూ అవుతూ ఉంది.

కత్తులతో కత్తిరించుకునేవారు

కత్తులతో కత్తిరించుకునేవారు

అలాగే అప్పట్లో గోర్లను కత్తిరించుకోవడానికి ఎలాంటి నెయిల్ కట్టర్స్ ఉండేవి కావు. దీంతో కత్తులతో గోళ్లను కోసేసుకునేవారు. ఇక రాత్రి పూట కత్తులతో గోళ్లను కోసే క్రమంలో ఏదైనా గాయాలైతే కష్టమని అప్పటి వారు రాత్రి పూట గోళ్లను కత్తిరించుకోవడాన్ని వద్దనేవారు.

ఇది కూడా రాత్రి పూట గోళ్లను కత్తిరించుకోకపోవడానకి ఒక కారణం. అయితే మన పెద్దలు అసలు కారణం చెప్పకుండా రాత్రి పూట గోళ్లను కత్తిరించుకోవద్దని చెబుతూ ఉండడం వల్ల ఇప్పటికీ అదే విధానాన్ని పాటిస్తున్నారు.

లక్ష్మీదేవి ఇంట్లోకి

లక్ష్మీదేవి ఇంట్లోకి

అలాగే సాయంత్రం పూట లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెడుతుందని చాలా మంది నమ్మకం. అమ్మవారి అనుగ్రహం ఉండాలంటే చాలా నియమాలు పాటించాలని నమ్మకం. ఇంట్లో వ్యర్థపదార్థాలను పారవేయడం, ఇంట్లో నుంచి డబ్బు ఇతరులకు ఇవ్వడం, అప్పులను చెల్లించడం వంటివి సాయంత్రం పూట చేయకూడదని కొందరి నమ్మకం.

Most Read :నేను నీ భార్యనే కదా, రాత్రంతా పక్కనే పడుకుంటాను, అంత త్వరగా ఎందుకు పని పూర్తి చేస్తావు #mystory251Most Read :నేను నీ భార్యనే కదా, రాత్రంతా పక్కనే పడుకుంటాను, అంత త్వరగా ఎందుకు పని పూర్తి చేస్తావు #mystory251

లక్ష్మి దేవతకు నచ్చదట

లక్ష్మి దేవతకు నచ్చదట

లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంట మరీ ముఖ్యమైనది గోర్లు లేదంటే జుట్టును కత్తిరించుకోవడం. ఈ రెండింటిలో ఏదైనా సరే రాత్రిపూట చేస్తే లక్ష్మి దేవతకు నచ్చదట. ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోతుందట. దీంతో అలాంటి పనులు ఏమీ చేయకూదని పెద్దలు చెబుతారు.

క్షుద్ర పూజల కోసం

క్షుద్ర పూజల కోసం

ముఖ్యంగా రాత్రి పూట గోళ్లు కత్తిరిస్తే చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. క్షుద్ర పూజలని నమ్మేవారు, అలాంటివి చేసే ప్రాంతాల్లో రాత్రిపూట అస్సలు గోళ్లను కత్తిరించుకోకూడదు. ఎందుకంటే అలాంటి పూజలకు వ్యక్తికి సంబంధించిన ఒక్క గోరు ముక్క లభించినా సరే ఆ పూజలను పూర్తి చేసేస్తారు.

కత్తిరించుకోకండి.

కత్తిరించుకోకండి.

అందుకే ఇంట్లో పెద్దవాళ్లు ఎవరైనా రాత్రి పూట గోళ్లను కత్తిరిస్తే అరుస్తారు. ఇక నుంచి మీరు కూడా రాత్రి పూట అస్సలు గోళ్లను కత్తిరించుకోకండి. అప్పటి వారు వాళ్ల సౌలభ్యం కోసం రాత్రి పూట గోళ్లను కత్తిరించుకునేవారు కాదు. అలాగే రాత్రి పూట గోళ్లను కత్తరించుకుంటే ఇప్పటికీ కూడా చాలా నష్టాలున్నాయి. అందువల్ల కత్తిరించుకోకపోవడమే బెస్ట్.

Most Read :పెళ్లికి ముందే నేను ఆ సుఖం చూశాను, నా భర్త డాక్టర్, మా ఆయనకు నేను చేసిన తప్పు తెలుస్తుందా?Most Read :పెళ్లికి ముందే నేను ఆ సుఖం చూశాను, నా భర్త డాక్టర్, మా ఆయనకు నేను చేసిన తప్పు తెలుస్తుందా?

English summary

why should not to cut nails at night time

why should not to cut nails at night time
Desktop Bottom Promotion