Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
మీ బ్లడ్ గ్రూప్ తెలిస్తే మీ వ్యక్తిత్వం, స్వభావం తెలుసుకోవొచ్చు, బ్లడ్ గ్రూప్స్ ఆధారంగా పర్సనాలిటీ
మీ రక్తం గ్రూప్ ను బట్టీ మీ పర్సనాలిటీని అంచానా వేయొచ్చు. అది వందశాతం నిజం. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కావాలంటే ఈ విషయాలు మొత్తం చదివి ఆ బ్లడ్ గ్రూప్ వారు అలా ప్రవర్తిస్తున్నారో లేదో చెక్ చేయండి.
సాధారణంగా వ్యక్తుల వ్యక్తిత్వాలను వారి నడవడికను బట్టీ చెబుతుంటారు. కొందరు జాతకాల ద్వారా, చేతి రేఖల ద్వారా కూడా వ్యక్తిత్వాన్ని తెలుపుతారు. అయితే బ్లడ్ గ్రూప్ ల ద్వారా కూడా వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చనే విషయ మీకు తెలుసా?
మీ రక్తం గ్రూప్ ను బట్టీ మీ పర్సనాలిటీని అంచానా వేయొచ్చు. అది వందశాతం నిజం. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కావాలంటే ఇక్కడ ఇచ్చిన విషయాలు మొత్తం చదివి ఆ బ్లడ్ గ్రూప్ వారు అలా ప్రవర్తిస్తున్నారో లేదో కూడా చెక్ చేయండి. జపాన్ లో సుమారు 60 సంవత్సరాల క్రితమే ఇలా బ్లడ్ గ్రూప్ ల ఆధారంగా వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం స్టార్ట్ చేశారు.

వ్యక్తి స్వభావం
జపాన్ లో రక్త గ్రూప్ ల ఆధారంగా వ్యక్తి స్వభావం ఎలా ఉంటుందని అంచనా వేయడానికి చాలా పరిశోధనలు చేపట్టారు. అక్కడ ఒక వ్యక్తిని ఉద్యోగంలో చేర్చుకోవాలంటే మొదట మీ బ్లడ్ గ్రూప్ ఏదీ అని అడుగుతారు. బ్లడ్ గ్రూప్ చెప్పగానే అతనిపై ఒక అంచనాకు వచ్చేస్తారు.

A కి సంబంధించిన బ్లడ్ గ్రూప్స్ వారి వ్యక్తిత్వం (A +, A-)
A పాజిటివ్, నెగెటివ్ రక్త గ్రూప్ లు A బ్లడ్ గ్రూప్ కిందకు వస్తాయి. ఈ బ్లడ్ గ్రూప్ మనుషులు సున్నితమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీరికి కలుపుకునే పోయే ఎక్కువగా ఉంటుంది. ఇతరులకు సహకరించే గుణం వీరికి ఉంటుంది. వీరు బాగా సెన్సిటివ్ వ్యక్తులు. బాగా తెలివైన వారు. ఇతర బ్లడ్ గ్రూప్ వ్యక్తులతో పోల్చుకుంటే వీరికి రోగనిరోధక శక్తి కూడా ఎక్కువే ఉంటుంది.

నాయకత్వ లక్షణాలు
వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువే. అయితే వీరు ఒత్తిడికి గురైనప్పుడు, ఆందోళన చెందే సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మాత్రం అంత త్వరగా తీసుకోలేరు. మొత్తానికి A బ్లడ్ గ్రూప్ వారు మంచి వ్యక్తిత్వం కలిగి ఉండి అందరితో బాగా మెలిగే స్వభావం కలిగి ఉంటారు.

B కి సంబంధించిన బ్లడ్ గ్రూప్స్ వారి వ్యక్తిత్వం (B +, B-)
B పాజిటివ్, బీ నెగెటివ్ రక్త గ్రూప్ ల వారు B కి సంబంధించిన బ్లడ్ గ్రూప్ కిందకు వస్తారు. వీరు తామే నాయకత్వ లక్షణాలున్న వ్యక్తులుగా ఫీలైపోతుంటారు. వీళ్లు ఒత్తిళ్లను, ఆందోళనలను ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటారు. వీరికి రోగ నిరోధక శక్తి కూడా అధికంగా ఉంటుంది. అయితే క్లిష్ట పరిస్థితుల్లో వీరు ఇతరులపై ఎక్కువగా ఆధారపడతారు.

ABకి సంబంధించిన బ్లడ్ గ్రూప్స్ వారి వ్యక్తిత్వం (AB +, AB-)
AB పాజిటివ్, నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు AB బ్లడ్ గ్రూప్ కిందకు వస్తారు. వీరు చాలా ఫ్యాషనబుల్ గా ఉంటారు. వీరు కాస్త ప్రత్యేకంగా కనిపించాలని పరితపిస్తుంటారు. వీరికి ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువ మక్కువ ఉంటుంది. భక్తిభావం కలిగి ఉంటారు. వీరు చిన్నచిన్న సమస్యలకు అస్సలు కుంగిపోరు.

నిరుత్సాహం చెందరు
అయితే వీరు ప్రపంచ జనాభాలో కేవలం 2% -5% మాత్రమే ఉంటారు. AB బ్లడ్ గ్రూప్ నకు చెందిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహం చెందరు.

Oకి సంబంధించిన బ్లడ్ గ్రూప్స్ వారి వ్యక్తిత్వం (O +, O-)
O పాజిటివ్, నెగెటివ్ రక్త గ్రూప్ వారు O బ్లడ్ గ్రూప్ కిందకు వస్తారు. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. వీరికి స్వతంత్రంగా ఆలోచించే శక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో తప్పని పరిస్థితుల్లో ఇతరులపై ఆధారపడతారు. ఒత్తిళ్లను, ఆందోళనను తట్టుకునే శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరికి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది.

ఎవరు ఎవరితో అనుకూలంగా ఉంటారు
అలాగే ఆయా బ్లడ్ గ్రూప్ లకు సంబంధించిన వారు మరో కొన్ని బ్లడ్ గ్రూప్ ల వారితో సన్నితంగా మెలుగుతారు. A బ్లడ్ గ్రూప్ వారు A, AB బ్లడ్ గ్రూప్ వారితో అనుకూలంగా ఉంటారు. B బ్లడ్ గ్రూప్ వారు B, AB బ్లడ్ గ్రూప్ లతో అనుకూలంగా ఉంటారు. AB బ్లడ్ గ్రూప్ వారు AB, B, A, O బ్లడ్ గ్రూప్ వారితో అనుకూలంగా ఉంటారు. O బ్లడ్ గ్రూప్ వారు O, AB బ్లడ్ గ్రూప్ ల వారితో ఎక్కువగా అనుకూలంగా ఉంటారు.



Click it and Unblock the Notifications