Latest Updates
-
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే
దిన ఫలాలు: 3 జనవరి 2018
భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి.
భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.
ఈ నాటి దినఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..
ఓం శ్రీ గురుభ్యోనమః
అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.
ది. 3-1-2018 తారీఖు, బుధవారం నాటి దిన ఫలాలను ఒకసారి పరిశీలిద్దాం. హేమలంబి నామ సంవత్సరం, దక్షియాణనం, హేమంత రుతువు, శీతాకాలం, పుష్య మాసం, బహుళ పాడ్యమి ఉదయం 6 గంటల 41 నిమిషాల వరకూ ఉంది. విదియ రాత్రి తెల్లవారితే ఉదయం 4 గంటల 19 నిమిషాల వరకూ ఉంది. పునర్వసు నక్షత్రం ఉదయం 11 గంటల 56 నిమిషాల వరకూ ఉంది. అమృత సమయం ఉదయం 9 గంటల 41 నిమిషం నుండి 11 గంటల 10 నిమిషాల వరకూ ఉంది. మరలా అమృత సమయం రాత్రి 4 గంటల 24 నిమిషాల నుండి 5 గంటల 24 నిమిషాల వరకూ ఉంది. వర్జ్యం రాత్రి 7 గంటల 26 నిమిషాల నుండి 8 గంటల 54 నిమిషాల వరకూ ఉంది. దుర్ముహర్తం ఉదయం 11 గంటల 10 నిమిషాల నుండి 12 గంటల 27 నిమిషాల వరకూ ఉంది. సూర్యోదయ సమయం 6 గంటల 35 నిమిషాలకు, సూర్యాస్తమయ సమయం 5 గంటల 32 నిమిషాలకు.

మేష రాశి: 21 మార్చి-20 ఏప్రిల్
దగ్గరి బంధువుల రాకపోకలు ఉంటాయి. భార్య సహకారంతో పనులు పూర్తి చేస్తారు. తండ్రి గారి ఆశీర్వాదం కూడా పొందవలసి ఉంటుంది. దగ్గరి ప్రయాణాలు కూడా చేస్తారు. వృత్తి వ్యాపారాల వల్ల లాభం కూడా చేకూరుతుంది.

వృషభ రాశి: 21 ఏప్రిల్-21 మే
సోదరుల రాకపోకలు ఉంటాయి. దూరపు ప్రాంత బంధువుల వార్తలు వింటారు. పని వారి సహకారం ఉంటుంది. ధన ప్రణాళికలు అనుకూలించే రోజు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మిథున రాశి: 22 మే-21 జూన్
మంచి భోజనం లభిస్తుంది. పిల్లలతో కలసి షికారులు చేస్తారు. భార్య విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన రోజు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.

కర్కాటక రాశి: 22 జూన్-22 జూలై
మనస్సు ఆధ్యాత్మిక ప్రసంగాల వైపు ఉంటుంది. పిల్లలు వారి పనులు వారు చూసుకోవటం వలన మీకు ప్రశాంతంగా ఉంటుంది. అధికారుల మెప్పు కూడా పొందుతారు. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి.

సింహ రాశి: 23 జూలై-21 ఆగష్ట్
దగ్గరి ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. భగవంతుడి దర్శనం కలుగుతుంది. పిల్లలను జాగ్రత్తగా గమనించవలసిన సమయం. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు.

కన్యా రాశి : 22 ఆగష్ట్-23 సెప్టెంబర్
వాహన ప్రయాణాలలో మెలకువ అవసరం. పనివారు జాగ్రత్తగా పని చేయగలరు. వ్యాపారం అభివృద్ధిలో నడుస్తుంది.

తులా రాశి: 24 సెప్టెంబర్-23 అక్టోబర్
తండ్రి గారి సహకారం పొందవలసిన రోజు. అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేయవలసి ఉంటుంది. దూర ప్రాంత బంధువుల కలయికలు, మాటలు ఉంటాయి. అధికారుల దర్శనం కూడా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

వృశ్చిక రాశి: 24 అక్టోబర్-22 నవంబర్
కొత్త అవకాశాలందు కోప తాపాలకి తావు ఇవ్వకండి. చేయు పనులు పట్టుదలతో పూర్తి చేయవలసి ఉంది. దైవ దర్శన ప్రాప్తితో అంతా మంచి జరగగలదు. భార్య సహకారం కూడా ఉంటుంది.

ధనూ రాశి: 23 నవంబర్-22 డిసెంబర్
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. భార్య సహకారంగా మసులుకోగలదు. పిల్లలు వారి పనులు వారు చేయటం వలన మీకు ఆనందం కలుగుతుంది. ఆనందం కోసం దుర్గా పూజ చేయండి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మకర రాశి: 23 డిసెంబర్-20 జనవరి
చేయు పనులందు ఆటంకాలు, వాయిదాలు పడతాయి. బాకీదారులు వసూలు చేసుకుంటారు. కొత్త అవకాశాల విషయంలో జాగ్రత్తగానే ఉండాలి. వృత్తి వ్యాపారాలు బాగానే సాగుతాయి.

కుంభ రాశి: 21 జనవరి-20 ఫిబ్రవరి
పిల్లలతో ఆనందంగా గడుపుతారు. షికార్లు కూడా చేస్తారు. పని వారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు. అధికారుల సందర్శనం ఉంటుంది. తండ్రి గారి సహకారం లభించగలదు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మీన రాశి: 20 ఫిబ్రవరి-20 మార్చి
ఇంటికి సంబంధించిన పనులు జాగ్రత్తగా పూర్తి చేస్తారు. తల్లి గారి ఆశీర్వాదం కూడా పొందుతారు. పిల్లల విషయంలో జాగ్రత్తగా కనిపెట్టవలసి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. దుర్గా దేవి ఆరాధన చేయండి. అంతా మంచిగా జరగగలదు.
ఇప్పటి వరకూ ఈ నాటి దిన ఫలితాలను చూసారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అది కూడా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు.
సర్వేజనా సుఖినోఃభవంతు
సమస్త సన్మంగళానిభవంతు
అందరికీ నా నమస్కారం.



Click it and Unblock the Notifications











