Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు, పీరియడ్స్‌లో ఉన్న మహిళలు ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే! -
విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారా? ఏపీ హైకోర్టు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది! -
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు!
దిన ఫలాలు: 13 జనవరి 2018
భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి.
భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.
ఈ నాటి దినఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..
ఓం శ్రీ గురుభ్యోనమః
అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.
ది. 13-1-2018 తారీఖు, శనివారం నాటి దిన ఫలాలను ఒకసారి పరిశీలిద్దాం. హేమలంబి నామ సంవత్సరం, దక్షియాణనం, హేమంత రుతువు, శీతాకాలం, పుష్య మాసం, బహుళ ద్వాదశి రాత్రి 10 గంటల 42 నిమిషాల వరకూ ఉంది. అనురాధా నక్షత్రం ఉదయం 11 గంటల 55 నిమిషాల వరకూ ఉంది. వర్జ్యం రాత్రి 6 గంటల 16 నిమిషాల నుండి 7 గంటల 50 నిమిషాల వరకూ ఉంది. దుర్ముహర్తం ఉదయం 8 గంటల 6 నిమిషాల వరకు. సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 35 నిమిషాలకు, సూర్యాస్తమయ సమయం సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు.

మేష రాశి: 21 మార్చి-20 ఏప్రిల్
అనుకున్న పనులు బాధ్యతగా చేయవలసి ఉంటుంది. కొన్ని అవకాశాలు చేజారే ప్రమాదం కూడా ఉంది. తండ్రి గారి ఆశీర్వాదం పొందుతారు. దూరపు బంధువుల కలయికలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభ రాశి: 21 ఏప్రిల్-21 మే
భార్యతో అనుకూల దాంపత్యం కలదు. భార్య సహాయ సహకారాలు తీసుకుంటారు. పనివారు అనుకూలంగా మసలగలరు. సోదరుల సహకారం ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధగా ఉండవలసి ఉంటుంది. దూరపు బంధువుల వార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మిథున రాశి: 22 మే-21 జూన్
అనుకున్న పనులు పూర్తవుతాయి. ధనానికి ఇబ్బందులు కలవు. కొన్ని అవకాశాలు చేజారే ప్రమాదం కూడా ఉంది. పిల్లల విషయంలో ఆనందం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కర్కాటక రాశి: 22 జూన్-22 జూలై
పిల్లలతో కలిసి ఆనందంగా గడుపుతారు. చేసే పనుల్లో ఆటంకాలు ఉంటాయి. అధికారులు ప్రసన్నం అవుతారు. పిల్లలు వారి పనులు వారు శ్రద్ధగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు ధనాన్ని కలుగచేస్తాయి.

సింహ రాశి: 23 జూలై-21 ఆగష్ట్
తండ్రి ఆశీర్వాదం ఉంటుంది. తల్లి గారి ఆశీర్వాదం కూడా పొందుతారు. సోదరులు బాధ్యతగా మెలుగుతారు. పిల్లలు వారి పనులు వారు శ్రద్ధగా పూర్తి చేస్తారు. ఇంటి పనులు శ్రద్ధగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాన్ని తెస్తాయి.

కన్యా రాశి : 22 ఆగష్ట్-23 సెప్టెంబర్
దగ్గరి ప్రయాణాలు చేస్తారు. ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో మెలకువ అవసరం. పిల్లల కోసం బాధ్యతగా వ్యవహరించవలసి ఉంటుంది. పనివారి సహకారం పూర్తిగా ఉంటుంది.

తులా రాశి: 24 సెప్టెంబర్-23 అక్టోబర్
అనుకున్న పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు. ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. అధికారుల ప్రసన్నం పొందుతారు. తల్లి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వృత్తి వ్యాపారాలు ధనం కలుగచేస్తాయి.

వృశ్చిక రాశి: 24 అక్టోబర్-22 నవంబర్
అనుకున్న పనులు వాయిదా పడతాయి. ధనానికి సంబంధించిన పనులు ఉపకారపడతాయి. దైవ దర్శన ప్రాప్తి కలదు. విందు భోజనం చేస్తారు. దూరపు బంధువుల కలయికలు కూడా ఉన్నాయి.

ధనూ రాశి: 23 నవంబర్-22 డిసెంబర్
అనుకున్న పనులు సులువుగా పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ధనానికి ఇబ్బందులు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది.

మకర రాశి: 23 డిసెంబర్-20 జనవరి
అనుకున్న పనులు వాయిదా పడతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పిల్లల పట్ల కూడా శ్రద్ధ అవసరం. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కుంభ రాశి: 21 జనవరి-20 ఫిబ్రవరి
బంధు మిత్రుల కలయికలు ఉన్నాయి. పని వారి సహకారం ఏర్పడుతుంది. తండ్రి గారి ఆశీర్వాదం పొందండి. మేలు జరగగలదు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

మీన రాశి: 20 ఫిబ్రవరి-20 మార్చి
చేయు పనులందు ఆటంకాలు ఉన్నాయి. దూరపు బంధువుల రాకపోకలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి. దైవ దర్శన ప్రాప్తి కలదు.
ఇప్పటి వరకూ ఈ నాటి దిన ఫలితాలను చూసారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అది కూడా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు.
సర్వేజనా సుఖినోఃభవంతు
సమస్త సన్మంగళానిభవంతు
అందరికీ నా నమస్కారం.



Click it and Unblock the Notifications