Latest Updates
-
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్పీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.!
దిన ఫలాలు: 15 జనవరి 2018
భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి.
భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.
ఈ నాటి దినఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..
ఓం శ్రీ గురుభ్యోనమః
అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.
ది. 15-1-2018 తారీఖు, సోమవారం నాటి దిన ఫలాలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి శుభసందర్భంలో అఖిలాంధ్ర తెలుగు ప్రేక్షకులందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో వర్థిల్లాలని, మీ కుటుంబం అభివృద్ధి పథంలో నడవాలని మనసారా కోరుకుంటున్నాను. హేమలంబి నామ సంవత్సరం, దక్షియాణనం, హేమంత రుతువు, శీతాకాలం, పుష్య మాసం, బహుళ చతుర్దశి, సోమవారం రాత్రి తెల్లవారితే 4 గంటల 55 నిమిషాల వరకు ఉంది. మూలా నక్షత్రం సాయంత్రం 4 గంటల 44 నిమిషాల వరకూ ఉంది. అమృత సమయం ఉదయం 9 గంటల 42 నిమిషాల నుండి 11 గంటల 25 నిమిషాల వరకూ ఉంది. వర్జ్యం మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం నుండి 4 గంటల 47 నిమిషాల వరకు ఉంది. సూర్యోదయ సమయం 6 గంటల 38 నిమిషాలకు, సూర్యాస్తమయ సమయం 5 గంటల 41 నిమిషాల వరకు.

మేష రాశి: 21 మార్చి-20 ఏప్రిల్
తండ్రి గారి ఆశీర్వాదంతో అన్ని పనులు సజావుగా సాగుతాయి. దూరపు బంధువులు ఇంటికి వస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. కోప తాపాలకి తావివ్వకండి.

వృషభ రాశి: 21 ఏప్రిల్-21 మే
తోటి పనివారి సహాయ సహకారాలు ఉంటాయి. సోదరులు అనుకూలంగా మెలగుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

మిథున రాశి: 22 మే-21 జూన్
అనుకున్న పనులు బాధ్యతగా చేయవలసి ఉంటుంది. భార్య సహకారం మెండుగా ఉంటుంది. అనుకూల దాంపత్యం కూడా కలదు. ధనానికి కొరత ఏర్పడుతుంది. పిల్లల వలన ఆనందం కలుగుతుంది.

కర్కాటక రాశి: 22 జూన్-22 జూలై
తలచిన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. బంధు మిత్రుల కలయికలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

సింహ రాశి: 23 జూలై-21 ఆగష్ట్
దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సోదరుల సహకారం ఉంటుంది. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారితో సినిమాలు షికార్లు చేస్తారు. దైవ దర్శన ప్రాప్తి కూడా ఉంటుంది.

కన్యా రాశి : 22 ఆగష్ట్-23 సెప్టెంబర్
అనుకున్న పనులు సుఖంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. పనివారి సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

తులా రాశి: 24 సెప్టెంబర్-23 అక్టోబర్
అనుకున్న పనులు నెరవేరుతాయి. చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దగ్గరి ప్రయాణాలు చేస్తారు.

వృశ్చిక రాశి: 24 అక్టోబర్-22 నవంబర్
ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. అధికారుల మన్ననలు పొందుతారు. దూరపు బంధువుల మాటలు వింటారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

ధనూ రాశి: 23 నవంబర్-22 డిసెంబర్
మనస్సు ఆనందంగా ఉంటుంది. విందు భోజనం కూడా చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. బంధు మిత్ర కలయికలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు ధనాన్ని కలుగచేస్తాయి.

మకర రాశి: 23 డిసెంబర్-20 జనవరి
అభివృద్ధి కోసం ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పట్ల మనస్సు లగ్నం అయి ఉంటుంది. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు ధనాన్ని కలుగచేస్తాయి.

కుంభ రాశి: 21 జనవరి-20 ఫిబ్రవరి
దైవ దర్శన ప్రాప్తి కలదు. అనుకున్నవన్నీ నెరవేరతాయి. బంధు మిత్రుల కలయికలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు భాగ్యాన్ని కలుగచేస్తాయి.

మీన రాశి: 20 ఫిబ్రవరి-20 మార్చి
బంధు మిత్రుల కలయికలు ఉంటాయి. పిల్లల పట్ల వ్యక్తిగత శ్రద్ధ అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా ఉండాలి. వృత్తి వ్యాపారాలు ధనాన్ని కలుగచేస్తాయి.
ఇప్పటి వరకూ ఈ నాటి దిన ఫలితాలను చూసారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అది కూడా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు.
సర్వేజనా సుఖినోఃభవంతు
సమస్త సన్మంగళానిభవంతు
అందరికీ నా నమస్కారం.



Click it and Unblock the Notifications