Latest Updates
-
ఆదివారం బ్రేక్ ఫాస్ట్ అదిరిపోవాలా? వేడి వేడి ఇడ్లీలోకి కేరళ మటన్ పెప్పర్ ఫ్రై..ఈజీగా ఎలా చేయాలంటే.. -
ఎండలు మండిపోతున్నాయా? అయితే ఈ నోరూరించే మ్యాంగో ఫలూదాతో కూల్ కూల్ అయిపోండి! -
కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే ఆహారాలివే! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త డేంజర్.. కేఫ్‌కు వెళ్తే లక్షల్లో బిల్లు, జాగ్రత్త! -
తింటే స్వర్గమే అనిపించేంత రుచి..కేవలం 10 నిమిషాల్లో చేసుకునే టమాటో రైస్..ఇలా చేసుకోండి -
ఎండల తీవ్రతతో మహిళల ఆరోగ్యంపై ప్రభావం… గర్భిణులు ఈ జాగ్రత్తలు అస్సలు మిస్ అవ్వకండి! -
ఐరన్, ఫైబర్ పుష్కలం.. ఆరోగ్యానికి అమృతం ఈ పాలకూర రోటీ..ఎలా చేసుకోవాలంటే.. -
మదర్స్ డే రోజున అత్తమామల దగ్గర ఇబ్బంది పడుతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు! -
అమ్మని మించిన దైవం లేదు..ఈ మదర్స్ డేకి మీ అమ్మ ముఖంలో చిరునవ్వు తెప్పించే విషెస్ ఇవే.. -
ఎప్పుడూ అమ్మ వండిపెట్టడమేనా? ఈ మదర్స్ డేకి ఈ హెల్తీ కేక్ తో అమ్మను సర్ ప్రైజ్ చేయండి..15 నిమిషాల్లో రెడీ!
దిన ఫలాలు: 17 జనవరి 2018
భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి.
భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.
ఈ నాటి దినఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..

ఓం శ్రీ గురుభ్యోనమః
అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.
ది. 17-1-2018 తారీఖు, మంగళవారం నాటి దిన ఫలాలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా అఖిలాంధ్ర తెలుగు ప్రేక్షకులందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈ కనుమ పండగ మీ అందరికీ ఆనందాన్ని ఇవ్వాలని, కుటుంబం మరియు అందరితో కలసి మెలసి ఉండాలని, అందరి యొక్క ఆశీస్సులు మీరు పొందాలని, అభివృద్ధి పథంలో నడవాలని, మనసా వాచా కర్మణా కోరుకుంటున్నాను . హేమలంబి నామ సంవత్సరం, దక్షియాణనం, హేమంత రుతువు, శీతాకాలం, పుష్య మాసం, బహుళ అమావాస్య పూర్తిగా ఉంది. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 7 గంటల 20 నిమిషాల వరకు ఉంది. అమృత సమయం మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాల నుండి 3 గంటల 57 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం తెల్లవారితే రాత్రి 4 గంటల 11 నిమిషాల నుండి 5 గంటల 55 నిమిషాల వరకూ ఉంది. దుర్ముహర్తం ఉదయం 8 గంటల 51 నిమిషం నుండి 9 గంటల 30 నిమిషాల వరకూ ఉంది. దుర్ముహర్తం రాత్రి 10 గంటల 50 నిమిషాల నుండి 11 గంటల 41 నిమిషం వరకూ ఉంది. సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 35 నిమిషాలకు, సూర్యాస్తమయ సమయం 5 గంటల 41 నిమిషాలకు.
దిన ఫలాలు: 17 జనవరి 2018

మేష రాశి: 21 మార్చి-20 ఏప్రిల్
అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేయవలసి ఉంటుంది. బంధు మిత్రులతో కాలక్షేపం చేస్తారు. వృత్తి వ్యాపారాలు కూడా బాగా ఉంటాయి. తల్లి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మీ జీవిత భాగస్వామితో నెమ్మదిగా మెలగవలసి ఉంటుంది.

వృషభ రాశి: 21 ఏప్రిల్-21 మే
తండ్రి గారి ఆశీర్వాదం పొందవలసి ఉంటుంది. పని వారి సహాయ సహకారాలు లభిస్తాయి. కొన్ని అవకాశాలు చేజారే అవకాశం ఉంది. కోప తాపాలకు దూరంగా ఉండండి. దూరపు బంధువుల సంభాషణలు వింటారు.

మిథున రాశి: 22 మే-21 జూన్
అనుకున్న పనులు బాధ్యతగా చేయవలసి ఉంటుంది. భార్యతో అనుకూల దాంపత్యం కలదు. ధనానికి ఇబ్బందులున్నాయి. పిల్లలు అభివృద్ధి పథంలో నడుస్తారు. వృత్తి వ్యాపారాలు భాగ్యాన్ని కలుగచేస్తాయి.

కర్కాటక రాశి: 22 జూన్-22 జూలై
అనుకున్న పనులు ఆటంకాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా మెలగుతారు. కొత్త అవకాశాలు చేజారకుండా చూసుకోవాలి. భార్య సహకారంతో పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

సింహ రాశి: 23 జూలై-21 ఆగష్ట్
దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సోదరుల సహకారం లభిస్తుంది. పిల్లలతోనూ, కుటుంబ సభ్యులతోనూ ఆనందంగా గడుపుతారు. దైవ దర్శన ప్రాప్తి కలదు. బంధువుల వార్తలు వింటారు.

కన్యా రాశి : 22 ఆగష్ట్-23 సెప్టెంబర్ ;
ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. పని వారి సహాయ సహకారాలు ఉంటాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. పిల్లల అభివృద్ధికి ప్రణాళికలు వేస్తారు. ప్రయాణాలలో మెలకువ అవసరం.

తులా రాశి: 24 సెప్టెంబర్-23 అక్టోబర్
అనుకున్న పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు. చిన్న ప్రయాణాలు చేయవలసి వుంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు బాధ్యతగా చేయవలసి ఉంటుంది.

వృశ్చిక రాశి: 24 అక్టోబర్-22 నవంబర్
ధన ప్రణాళికలు అనుకూలించే రోజు. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. అధికారులు ప్రసన్నం అవుతారు. దూరపు బంధువుల వార్తలు వింటారు. దైవ దర్శన ప్రాప్తి కలదు.

ధనూ రాశి: 23 నవంబర్-22 డిసెంబర్
అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆనందంగా గడుపుతారు. బంధు మిత్ర కలయికలు ఉన్నాయి. ధనం కోసం ప్రయత్నం చేస్తారు. వృత్తి వ్యాపారాలు అనుకున్న లాభాన్ని తెస్తాయి.

మకర రాశి: 23 డిసెంబర్-20 జనవరి
ఆరోగ్యంపై శ్రద్ధ వహించవలసి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. పిల్లలతో ఆనందంగా గడుపుతారు.

కుంభ రాశి: 21 జనవరి-20 ఫిబ్రవరి
అనుకున్న పనులు పూర్తి చేస్తారు. బంధు మిత్రుల కలయికలు ఏర్పడతాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. తండ్రి గారి ఆశీర్వాదం కూడా పొందవలసి ఉంటుంది.

మీన రాశి: 20 ఫిబ్రవరి-20 మార్చి
చేయు పనులందు ఆటంకాలున్నాయి. బరువు బాధ్యతలతో చేయవలసి ఉంటుంది. బంధుమిత్రుల కలయికలు ఉన్నాయి. వారితో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపార ప్రణాళికలు అనుకూలిస్తాయి.
ఇప్పటి వరకూ ఈ నాటి దిన ఫలితాలను చూసారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అది కూడా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు.
సర్వేజనా సుఖినోఃభవంతు
సమస్త సన్మంగళానిభవంతు
అందరికీ నా నమస్కారం.



Click it and Unblock the Notifications