Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
ఈ రాశిచక్రాల చెందిన వ్యక్తులు సమస్యాత్మకంగా ప్రవర్తిస్తారు
ఈ రాశిచక్రాల చెందిన వ్యక్తులు సమస్యాత్మకంగా ప్రవర్తిస్తారు
ఒకరిని ఎమోషనల్ గా బాధకు గురిచేయడాన్ని ఇష్టపడే వ్యక్తులను ఎమోషనల్ శాడిస్ట్ లని అంటారు. ఈ తరహా స్వభావం గల వ్యక్తులు వారితో అనుబంధం పెంచుకున్న వారి జీవితాన్ని నరకంగా మారుస్తారు.
ఈ వ్యక్తులు నియంత్రణా ధోరణితో అలాగే మ్యానిప్యులేటివ్ గా ఉంటారు. అలాగే ఎమోషనల్ గా ఒకరిని ఇబ్బందికి గురిచేయడం వీరికి రాక్షసానందాన్ని కలిగిస్తుంది. ఎదుటివారి బాధను వీరు ఆస్వాదిస్తారు.

ఆస్ట్రాలజీ ప్రకారం, ఈ దిగువన పేర్కొనబడిన రాశిచక్రాల వారు సమస్యాత్మకంగా ఉంటారు.
ఇక్కడ, ఆ తరహా వ్యక్తులకు సంబంధించిన కొన్ని రాశిచక్రాల గురించి వివరించబడింది. ఇతరులకు బాధను కలిగించేందుకు ఇష్టపడే వ్యక్తులు ఈ రాశిచక్రాల చెంది ఉంటారని ఆస్ట్రాలజీ నిపుణులు చెబుతున్నారు.

కుంభరాశి: జనవరి 21 - ఫిబ్రవరి 18
కుంభరాశి వారు ఎదుటి వ్యక్తి మనస్తత్వాన్ని అంగీకరిస్తారు. అయితే, ఒకవేళ వీరు మీలా మీరు ఉండటాన్ని తప్పు పడుతున్నారంటే వారు మైండ్ గేమ్ ఆడుతున్నారని అర్థం. ఇది ప్రేమకు సంకేతం కాదు. వారు మీతో ఎమోషనల్ గేమ్ ను ఆడుతున్నారు. వారి అంచనాలను చేరుకోవడానికి మీరెంతగా కష్టపడుతున్నారో చూసి వారు ఆనందిస్తారు. అంతేకాక, మీరు మీలా ఉన్నందుకు వారు మిమ్మల్ని ప్రేమించరు. మీరు వారికోసం వారు కోరిన విధంగా మారినందుకు వారు మిమ్మల్ని ప్రేమిస్తారు.

ధనుస్సురాశి: నవంబర్ 23 - డిసెంబర్ 22
ఈ రాశికి చెందిన వ్యక్తులు అందంగా అలాగే ఆకర్షణీయంగా ఉంటారు. వీరితో ఉంటూ మీరు ఇతరులపై ఆకర్షణకు గురైతే వీరు అసౌకర్యానికి గురవుతారు. ఇది మీ నుండి అనుచితమైన చర్య కూడా. అయితే, వీరు తమకు తెలియకుండా అదే విధంగా ప్రవర్తిస్తారు. మిమ్మల్ని మానసికంగా ఇబ్బందికి గురిచేస్తారు. తమకు తెలియకుండా ఆ విధంగా మిమ్మల్ని ఎమోషనల్ గా హర్ట్ చేస్తారు.

వృశ్చికరాశి: అక్టోబర్ 24 - నవంబర్ 22
వృశ్చికరాశికి చెందిన వ్యక్తులతో మీరు భావోద్వేగాల పరంగా హానెస్టీగా ఉన్నా కూడా వారు మీ భావోద్వేగాలను పట్టించుకోకుండా అదే విధంగా మీతో ప్రవర్తిస్తున్నారంటే వారు ఎమోషనల్ శాడిస్ట్ ల కిందకే వస్తారు. వారి ప్రవర్తనతో మీరే విధంగా అప్సెట్ అవుతున్నారో మీరు తెలిపినా కూడా వారి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాకపోతే వారు కావాలని మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారని మీరు గమనించాలి. సమస్యను పరిష్కరించేందుకు మీరు ప్రయత్నించినా కూడా సమస్య అలాగే మిగిలిపోతే మీరు చేసేదేమీ లేదు. ఆ పరిస్థితి నుంచి దూరంగా వెళ్లడమే మీకు మార్గం.

సింహరాశి: జులై 23 - ఆగస్టు 23
ఈ రాశికి చెందిన వారు స్వాభిమానానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. తమ ఆహార్యంలో దర్పాన్ని ప్రదర్శించడానికి ఇష్టపడతారు. మీరు వారి అంతస్తుకు తగరని వారు మీతో అంటే అది ఎమోషనల్ అబ్యూస్ కిందకు వస్తుంది. మరోవైపు, అభద్రతా భావానికి గురైన వ్యక్తులు వీరిచే సులభంగా మ్యానిప్యులేషన్ కు గురవుతారు. వారితో ఈ వ్యక్తులు ఎమోషనల్ గేమ్ ను ఆడతారు.

మిథునరాశి: మే 21 - జూన్ 20
మిథునరాశికి చెందిన వారు భావవ్యక్తీకరణలో దిట్టలు. అయితే, వారు తరచూ మీకు మిశ్రమ స్పందనలు అందిస్తున్నారంటే వారు మీ మనసుతో ఆడుకుంటున్నారని అర్థం. మిమ్మల్ని తప్పుదోవపట్టిస్తున్నారని గమనించాలి. ఒక క్షణం వారు మీతో ఆప్యాయంగా ఉంటూ మరుక్షణమే వారు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నట్టు మిమ్మల్ని దూరం పెడుతూ ఉంటే మీరు వారితో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం. ఈ వ్యక్తులు తమను నిరంతరం ప్రేమించే వారిని కోరుకుంటారు.

మేషరాశి: మార్చ్ 21 - ఏప్రిల్ 19
మేషరాశి వారితో డీల్ చేసే వారికి వీరి మనస్తత్వం అర్థమైపోయే ఉంటుంది. ఈ వ్యక్తులకు చెందిన వారు ప్రేమ కంటే నియంత్రణా ధోరణికే పెద్దపీట వేస్తారు. తమతో అనుబంధం పెంచుకున్న వారిని అన్ని విధాలా నియంత్రించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. వీరికి ప్రేమలో గొప్పదనం తెలియదు. నియంతృత్వ ధోరణిని ఆస్వాదిస్తారు. వీరికి అనుగుణంగా వీరి ప్రియమైన వారు నడచుకోకపోతే వారితో బంధాలను తెంచుకునేందుకు కూడా వెనకాడరు. ఆ విధంగా, వీరు ఒక వక్తిని తమ కంట్రోల్ లోకి తెచ్చుకునేందుకు ఎక్కడి వరకైనా వెళతారు. వీరు అనుసరించే మార్గం వలన వీరితో అనుబంధం పెంచుకున్న వారు మానసికంగా తీవ్రంగా బాధపడుతున్నారని తెలిసినా వీరి ధోరణి మార్చుకోరు.
గమనిక: వ్యక్తిగత జాతకఫలితాల కోసం మీకు అందుబాటులోనున్న జ్యోతిష్య నిపుణులను సంప్రదించండి.



Click it and Unblock the Notifications











