For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ambedkar Jayanti 2020 : బాబా సాహెబ్ అంబేద్కర్ గురించి మీకు తెలియని కొన్ని నిజాలు...

|

మన దేశంలో డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ అంటే మొట్టమొదటి న్యాయ శాఖ మంత్రిగా మరియు రాజ్యాంగ నిర్మాతగానే తెలుసు. అయితే మన దేశం నుండి ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళ్లిన మొట్టమొదటి భారతీయుడు కూడా మన భారతీయుడే. అంబేద్కర్ ఒక గొప్ప రచయిత కూడా. అంతే కాదు విప్లకారుడు అని చరిత్ర చెబుతోంది.

అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. తన చిన్నప్పుడు తాను ఎదుర్కొన్న అంటరానితనం మరెవరూ ఎదుర్కోకూడదని దళిత వర్గాలకు అండగా నిలబడ్డాడు. ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన అంబేద్కర్ అంచెలంచెలుగా ఎదుగుతూ అమెరికా వరకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించి వచ్చాడు. ఏప్రిల్ 14వ తేదీన ఆయన జయంతి సందర్భంగా అంబ్కేదర్ గురించి మీకు తెలియని కొన్ని వాస్తవాలను తెలియజేస్తున్నాం... అవేంటో మీరే చూడండి...

అంబేద్కర్ జననం

అంబేద్కర్ జననం

మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891 సంవత్సరంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అంబవాడే అనే గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి రామ్ జీ, తల్లి పేరు భీమా బాయి. వీరు మరాఠీ మూలాలను కలిగి ఉండేవారు. ఈయన తండ్రి బ్రిటీష్ భారతీయ సైన్యంలో సుబేదార్ గా పని చేసేవాడు.

చిన్ననాటి నుండే..

చిన్ననాటి నుండే..

అంబేద్కర్ ను బాబా సాహెబ్ అని కూడా పిలుస్తుంటారు. ఈయన చిన్న నాటి నుండే అంటరానితనాన్ని ఎదుర్కొన్నాడు. మెహర్ కులానికి చెందిన ఈయనను అప్పట్లో పాఠశాల గది బయట కూర్చోపెట్టేవారు. అంతేకాదు తాను ఒకవేళ నీరు తాగాలన్న కూడా, అక్కడ పని చేసే గుమాస్తా కొంత ఎత్తులో ఉండి అతడి చేయి పొత్తిళ్లలోకి నీరు పోసేవాడు. ఆ రోజుల్లో అంటరాని తనం అంత దారుణంగా ఉండేది.

తనలాగా ఎవరూ కష్టపడొద్దని..

తనలాగా ఎవరూ కష్టపడొద్దని..

ఇలాంటి అంటరానితనాన్ని తనలాగా ఎవరూ ఎదుర్కోకూడదని, చిన్నప్పటి నుండే తనను తాను రక్షించుకోవడమే కాకుండా, అంటరానితనాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా అందరూ సమానంగా జీవించడానికి, ఆనందంగా, ఆరోగ్యవంతంగా నివసించే వాతావరణాన్ని ఏర్పరిచారు. అందుకే ఆయనను ఇప్పటికీ భారత రాజ్యాంగ జాతిపితగా కీర్తిస్తూ ఉంటారు.

న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ గా..

న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ గా..

అంబేద్కర్ ఉన్నత విద్య కోసం విదేశాలకు సైతం వెళ్లాడు. కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ తో పాటు ఎన్నో ప్రఖ్యాతి గాంచిన విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించాడు. అనంతరం ముంబైలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పని చేశారు. అంతేకాదు విదేశాలలో ఎకనామిక్స్ లో డాక్టరేట్ పొందిన మొట్టమొదటి భారతీయుడు.

ఆర్టికల్ 370కు వ్యతిరేకంగా..

ఆర్టికల్ 370కు వ్యతిరేకంగా..

అప్పట్లో జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి అంబేద్కర్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని తీవ్రంగా వ్యతిరేకించారు.

రిజర్వేషన్ల రూపకల్పన..

రిజర్వేషన్ల రూపకల్పన..

అంబేద్కర్ అంటరానితనాన్ని రూపుమాపేందుకు మరియు అన్ని రకాల నిషేధించడం వంటి అనేక రకాల పౌర స్వేచ్ఛలకు రాజ్యాంగ హామీలు మరియు రక్షణలను అందించాడు. అలాగే పౌర సేవలు, పాఠశాలలు మరియు కళాశాలల్లో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల వారి కోసం ఉద్యోగాల రిజర్వేషన్ల వ్యవస్థను తీసుకొచ్చి, దాన్ని అసెంబ్లీ ఆమోదించుకోవడంలో కూడా విజయం సాధించాడు.

బిల్లు ఆమోదం కాలేదని రాజీనామా..

బిల్లు ఆమోదం కాలేదని రాజీనామా..

అంబేద్కర్ పార్లమెంట్ సభ్యునిగా ఎంపికైన తర్వాత వారసత్వ మరియు వివాహ చట్టాలలో లింగ సమానత్వాన్ని వివరించడానికి ప్రయత్నించిన హిందూ కోడ్ బిల్లు ముసాయిదాను పార్లమెంటులో నిలిపివేసిన కారణంగా 1951లో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

ఆర్థిక వేత్తగా..

ఆర్థిక వేత్తగా..

అంబేద్కర్ రాజకీయాలలోకి రాక ముందు అంబేద్కర్ ఆర్థిక వేత్తగా ఉండేవారు. ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన విభాగంలో పని చేసేవారు. ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్స్ బ్రిటీష్ ఇండియాలో ఆర్థిక శాస్త్రంపై మూడు పుస్తకాలను కూడా రాశారు. రూపాయి యొక్క సమస్య దాని మూలం మరియు దాని పరిష్కారం గురించి రాశారు.

తన ఆత్మకథలోని..

తన ఆత్మకథలోని..

తన జీవితంలోని కొన్ని ముఖ్యాంశాలను తన ఆత్మకథ వెయిటింగ్ ఫర్ ఏ వీసాలో రాసుకున్నాడు. తను పెరుగుతున్న తన కుటుంబానికి జీవనం సాగించే మార్గాలు వెతికేందుకు ప్రయత్నించాడు. అంతకుముందు తను ఒక ప్రైవేట్ ట్యూటర్ గా, అకౌంటెంట్ గా పని చేశాడు. ఆ తర్వాత తను ఒక ఇన్వెస్ట్ మెంట్ కన్సల్టింగ్ వ్యాపారాన్ని స్థాపించాడు. అయితే అది తక్కువ కులమైన అంబేద్కర్ ది అని తెలిసి చాలా మంది విముఖత చూపడంతో అది విఫలమైనట్లు చెప్పుకొచ్చాడు.

చివరి రోజుల్లో..

చివరి రోజుల్లో..

అలా తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను అంబేద్కర్ చివరి రోజు తీవ్రమైన మధుమేహం వ్యాధితో బాధపడ్డాడు. 1948 నుండి ఈ వ్యాధితో పోరాడి 1954లో డిసెంబర్ 6వ తేదీన ఇంట్లోనే నిద్రిస్తూ మరణించాడు.

English summary

Ambedkar Jayanti 2020 : Interesting facts about Dr B R Ambedkar

Dr. Bhimrao Ramji Ambedkar, also known as Babasaheb Ambedkar, is one of those great men who has contributed the maximum to the society and nation. Read how he emerged as the messiah for the downtrodden, despite having suffered atrocities himself.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more