For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రామేశ్వరం నుండి రాష్ట్రపతి వరకు మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలామ్ ప్రస్థానమిలా...

అబ్దుల్ కలామ్ వర్థంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

|

శాస్త్ర సాంకేతిక రంగంలో.. బోధనా రంగంలో డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ చూపిన అసమాన ప్రతిభకు గాను ఆయనకు 'మిస్సైల్ మ్యాన్' అనే బిరుదు కూడా వచ్చింది.

APJ Abdul Kalam 5th death anniversary: Interesting Facts

మన దేశ సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తుల్లో అబ్దుల్ కలామ్ ప్రముఖమైన వ్యక్తి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రామేశ్వరం నుండి ప్రజా రాష్ట్రపతి భవన్ వరకు.. పేపర్ బాయ్ నుండి నేషనల్ ప్రెసిడెంట్ వరకు తన జీవితం ప్రస్తుత యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం.

APJ Abdul Kalam 5th death anniversary: Interesting Facts

'కలల్ని కనడం కాదు.. వాటిని నిజం చేసుకోవాలి.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి' అని చెప్పిన ఆయన నిరాడంబరమైన జీవితనం ఎందరికో మార్గనిర్దేశకం.. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క ఐదో వర్థంతి ఈరోజు(జులై 27). ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

రక్షణ రంగంలో..

రక్షణ రంగంలో..

జులై 1992 నుండి డిసెంబర్ 1999 వరకు ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారుగా కలామ్ పని చేశారు. రక్షణ రంగ సంస్థ ముఖ్య కార్యదర్శిగా తన సేవలను నిజాయితీగా అందించారు. పోఖ్రాన్ అణు పరీక్షల్లో సైతం కలామ్ కీలక పాత్ర పోషించారు.

11వ రాష్ట్రపతిగా..

11వ రాష్ట్రపతిగా..

ఎన్డీయే హాయాంలో 11వ రాష్ట్రపతిగా పని చేసిన అబ్దుల్ కలామ్ ‘ప్రజా రాష్ట్రపతి'గా పేరు తెచ్చుకున్నారు. అత్యున్నత పదవిని అలంకరించిన ఆయన ఆ పదవికే వన్నె తీసుకొచ్చారు.

బోధనా రంగం వైపు..

బోధనా రంగం వైపు..

అయితే రెండోసారి కూడా తనకు అధ్యక్షుడిగా పని చేసే అవకాశం దక్కినా.. అందుకు ఆయన ఆసక్తి చూపలేదు. తనకు ఎంతగానో ఇష్టమైనా బోధనా రంగంవైపు వెళ్లిపోయారు. దేశ, విదేశాల్లోని వందల యూనివర్సిటీల్లో తన ఉపన్యాసాలతో విద్యార్థులకు మార్గనిర్దేశకులయ్యారు.

2015లో చివరి క్షణాలు..

2015లో చివరి క్షణాలు..

అలా ఉపన్యాసం ఇస్తున్న సమయంలోనే, 2015లో జులై 27వ తేదీన మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో ఐఐఎం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అవే చివరి క్షణాలు అవుతాయని, ఎవ్వరూ ఊహించలేదు. ఆ తర్వాత తను ఎవరికీ దొరకనంత దూరం వెళ్లిపోయారు.

‘భారతరత్న’తో పాటు ఎన్నో అవార్డులు..

‘భారతరత్న’తో పాటు ఎన్నో అవార్డులు..

నిరంతరం అతి సాధారణంగా.. నిరాడంబరంగా గడిపిన ప్రజా రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ను ‘భారత రత్న'తో పాటు ఎన్నో నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులు వరించాయి. ఈయన సేవలను గుర్తించిన ఐక్యరాజ్యసమితి(UNO) తన పుట్టినరోజు అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవంగా ప్రకటించి ఆయన్ను గౌరవించింది.

మధ్యతరగతి వ్యక్తిగా మొదలెట్టి..

మధ్యతరగతి వ్యక్తిగా మొదలెట్టి..

మన దేశంలో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించి.. నిరంతర శ్రమతో ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఆయన జీవిత ప్రస్థానం అజరామరం.. అద్వితీయం.. అమోఘం.. అలాంటి వ్యక్తి మన భరత భూమి గడ్డపై పుట్టడం మనందరికీ గర్వకారణం. తను అనంత లోకాలకు వెళ్లినా.. ఈ గొప్ప వ్యక్తి సేవల్ని భారత జాతి ఎప్పటికీ మరువలేదు.

English summary

APJ Abdul Kalam 5th death anniversary: Interesting Facts

Here we talking about APJ Abdul Kalam 5th death anniversary:Interesting Facts. Read on
Desktop Bottom Promotion