For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Armed Forces Flag Day 2021:సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా...

సాయుధ దళాల పతాక దినోత్సవ తేదీ, చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

భారతదేశంలోని ప్రతి ఒక్కరూ రాత్రి వేళ ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే అందుకు ప్రధాన కారణం మన భారత సైనికులే. మంచు కొండల్లో.. గడ్డ కట్టే చలిలో.. విపరీతమైన ఎండ ఉండే ఎడారులు, జడివాన వంటి వాటిని ఏ మాత్రం లెక్కచేయకుండా బార్డర్లో మన దేశ రక్షణ కోసం.. మన కోసం నిరంతరం నిద్రాహారాలు మాని అప్రమత్తంగా ఉంటున్నారు.

Armed Forces Flag Day 2021: Date, History and Significance in Telugu

అంతేకాదు వారి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అయితే భారత సైన్యం గురించి, వారి ధైర్య సాహాసాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. ప్రతి సంవత్సరం మన దేశంలో సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని డిసెంబర్ ఏడో తేదీన జరుపుకుంటారు. భారతదేశ రక్షణ కోసం సాయుధ దళాలు నిరంతరం చేస్తున్న కృషి, శత్రువుల నుండి మన దేశాన్ని రక్షిస్తూ వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి కుటుంబాలకు అండగా ఉన్నామని తెలియజేయడమే ఈ దినోత్సవ ప్రత్యేకత.

Armed Forces Flag Day 2021: Date, History and Significance in Telugu

వీరు కేవలం దేశ రక్షణ కోసమే కాదు.. దేశంలో అంతర్గతంగా జరిగే అనేక విపత్కర పరిస్థితులను చక్కదిద్దడంలోనూ, ప్రజలను కాపాడటంలో సాయుద ధళాలు ముందువరుసలోనే ఉంటాయి. ఆయా రాష్ట్రాల్లో అకస్మాత్తుగా సంభవించే వరదలు, భూకంపాలు, ఇతర ప్రక్రుతి విపత్తుల సమయంలోనూ వేలాది మంది సాయుధ దళాలు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మనల్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చుతుంటారు. కొన్నిసార్లు ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టి ప్రజలను రక్షిస్తూ వీరమరణం పొందిన విషయం కూడా మనందరికీ తెలిసిందే.

సాయుధ దళాల పతాక దినోత్సవ చరిత్ర..
1949 సంవత్సరంలో ఆగస్టు 28వ తేదీన అప్పటి భారత రక్షణ మంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ ఏడో తేదీన సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. ఈ ప్రత్యేకమైన రోజున ప్రజలకు జెండాలు పంపిణీ చేయడం వారి నుండి నిధులు సేకరించడం వంటివి చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే త్రివిధ దళాలకు ప్రాతినిధ్యం వహించే రెడ్, డార్క్ బ్లూ, లైట్ బ్లూ కలర్ జెండాలను కేంద్రీయ సైనిక్ బోర్డు, రాజ్యసభ, జిల్లా సైనిక్ బోర్డు ద్వారా ప్రజలకు పంపిణీ చేసి విరాళాలను సేకరిస్తారు. దేశం కోసం పోరాడే సైనికుల కుటుంబాలు, వారిపై ఆధారపడి జీవించే వారి పరిరక్షణ గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత సాధారణ ప్రజలకు ఉందనే ఉద్దేశ్యంతో విరాళాలు సేకరించడం ద్వారా పతాక దినోత్సవానికి అధిక ప్రాధాన్యత లభించింది.

సాయుధ దళాల ప్రాముఖ్యత..
భారతదేశంలోని అనుభవ సైనిక సిబ్బందికి ప్రజలు తమ ధన్యవాదాలు మరియు ప్రశంసలను తెలియజేస్తారు. అలాగే ఈరోజున దేశం కోసం వీరమరణం పొందిన వారిని గుర్తిస్తారు.
ఈ పతాక దినోత్సవాన్ని పాటించడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రధానంగా యుద్ధంలో మరణించిన సైనికుల కుటుంబాలకు పునరావాసం, సేవలో ఉన్న సిబ్బంది, వారి సంక్షేమం కోసం క్రుషి చేయడం.
ఈరోజున భారత సాయుధ దళాల్లో భారత సైన్యం, భారత వైమానిక దళం, నౌకా దళం జాతీయ భద్రతను నిర్ధారించడానికి వారి సిబ్బంది ప్రయత్నాలను సాధారణ ప్రజలకు ప్రదర్శించడానికి వివిధ ప్రదర్శనలు, కార్నివాల్ లు, డ్రామాలు మరియు ఇతర వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాయి.

ఈ మూడు రక్షణ దళాలతో పాటు తీర రక్షక దళం, పారామిలిటరీ దళాలు కూడా వీటిలో అంతర్భాగాలే. భారత సాయుధ దళాలు అనేక సైనిక చర్యల్లో 1947, 1965, 1971 సంవత్సరాల్లో పాల్గొన్నాయి. వీటిలో 1963వ సంవత్సరం చైనా, పోర్చుగీసు యుద్ధంలో, 1987లో చైనా ఘర్షణ, కార్గిల్ యుద్ధం, సియాచిన్ ఘర్షణలోనూ పాలు పంచుకున్నాయి.

FAQ's
  • సాయుధ దళాల పతాక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

    ప్రతి సంవత్సరం మన దేశంలో సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని డిసెంబర్ ఏడో తేదీన జరుపుకుంటారు. భారతదేశ రక్షణ కోసం సాయుధ దళాలు నిరంతరం చేస్తున్న కృషి, శత్రువుల నుండి మన దేశాన్ని రక్షిస్తూ వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి కుటుంబాలకు అండగా ఉన్నామని తెలియజేయడమే ఈ దినోత్సవ ప్రత్యేకత.

English summary

Armed Forces Flag Day 2021: Date, History and Significance in Telugu

Here we are talking about the armed forces flag day 2021: Date, history and significance in Telugu
Story first published:Tuesday, December 7, 2021, 12:51 [IST]
Desktop Bottom Promotion