Latest Updates
-
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
గ్యాస్, అసిడిటీకి తక్షణమే చెక్ పెట్టే అద్భుతమైన వాము పరాఠా.. ఎలా చేయాలో తెలుసా? -
తొలి ఏకాదశి తేదీ, తిథి, పూజా విధానం, ఉపవాసం ఎలా విరమించాలి.. పూర్తి వివరాలు.! -
టమాటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా? యూరాలజిస్ట్ చెబుతున్న అసలు నిజం ఇదే! -
వృశ్చికంలోకి చంద్రుడు.. రానున్న మూడు రోజులు ఈ రాశుల వారి గోల్డెన్ డేస్.! -
హిమాచల్ ప్రదేశ్ ఫేమస్ కధి పకోడి..వేడి వేడి అన్నంతో తింటే అమృతమే..ఈజీగా చేసుకోండిలా.. -
నాన్‌వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.!
Hyderabad Tasty Dosa Spots: హైదరాబాద్‌లో బెస్ట్ టేస్టీ దోశ తినాలనుందా? అయితే ఇక్కడికి వెళ్లండి
హైదరాబాద్ లో బిర్యానీ, ఇరానీ చాయ్ ఎంత ఫేమస్సో, ఉదయం బ్రేక్ ఫాస్ట్‌కి దొరికే దోశ కూడా అంత ఎక్కువ మంది ఇష్టంగా తింటారు. మీరు దోశ లవర్ అయితే హైదరాబాద్ లోని ఈ ప్రాంతాలకు వెళ్లండి. బెస్ట్ దోశలను మీరు టేస్ట్ చేయొచ్చు.
హైదరాబాద్ అంటే చార్మినార్, బిర్యానీ, హలీమ్, ఇరానీ చాయ్ మాత్రమే కాదు. హైదరాబాద్ ను సిటీ ఆఫ్ ఫుడ్స్ అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ ఎన్నో రకాల ఫుడ్ ఐటెమ్స్ దొరుకుతాయి. ఫుడ్ లవర్స్ హైదరాబాద్ స్వర్గసీమ అనాలి. ఎందుకంటే ఇక్కడ దేశంలోని అన్ని ప్రాంతాల్లో దొరికే ఫుడ్స్ హైదరాబాద్ లో దొరుకుతాయి.

హైదరాబాద్ లో బిర్యానీ, ఇరానీ చాయ్ ఎంత ఫేమస్సో, ఉదయం బ్రేక్ ఫాస్ట్‌కి దొరికే దోశ కూడా అంత ఎక్కువ మంది ఇష్టంగా తింటారు. మీరు దోశ లవర్ అయితే హైదరాబాద్ లోని ఈ ప్రాంతాలకు వెళ్లండి. బెస్ట్ దోశలను మీరు టేస్ట్ చేయొచ్చు.
1. రామ్ కీ బండి
హైదరాబాద్ లో రామ్ కీ బండి చాలా ఫేమస్. నగరంలో చాలా చోట్ల రామ్ కీ బండికి చాలా బ్రాంచులు ఉన్నాయి. ఇక్కడ లభించే పనీర్ బటర్ మసాలా దోశ టాప్ ఆర్డర్ ఐటెమ్. స్విగ్గీ, జొమాటోల ద్వారా కూడా రామ్ కీ బండి దోశలను ఇంటికి తెప్పించుకోవచ్చు. అయితే స్వయంగా అక్కడికి వెళ్లి తింటేనే అసలు మజా ఉంటుంది.
2. దోశ కోడి కూర
దోశ కోడి కూర మాదాపూర్‌లో ఉంటుంది. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో దోశ కోడి కూర ట్రెండింగ్ లో ఉంటుంది. ఇక్కడ దోశలను నాన్ వెజ్ ఐటెమ్స్ తో కలిపి వడ్డిస్తారు. చికెన్ కర్రీ విత్ ఇడ్లీ, మటన్ ఖీమా దోశ వంటి క్రేజీ కాంబినేషన్ ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ మెనూ చూస్తే చాలా వెరైటీగా అనిపిస్తుంది. ఇక్కడ టాప్ ఆర్డర్ దోశ మాత్రం చికెన్ ఖీమా దోశ.
3. పంచకట్టు దోశ
బెస్ట్ సౌతిండియా టేస్ట్ కావాలంటే పంచకట్టు దోశకు వెళ్లాల్సిందే. సౌతిండియాలో లభించే ఫుడ్ ఐటెమ్స్ ఇక్కడ లభిస్తాయి. పంచకట్టు దోశ పేరులో ఉన్నట్లుగా ట్రెడిషనల్ ఫ్లేవర్, టేస్టు ఉండే దోశ ఇక్కడ దొరుకుతుంది.
4. వరలక్ష్మీ టిఫిన్స్
గచ్చిబౌలిలో డీఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్ లో వరలక్ష్మీ టిఫిన్స్ ఉంటుంది. ఎక్కడ చాలా రకాల బ్రేక్ ఫాస్ట్ లు అందుబాటులో ఉంటాయి. నెయ్యి కారం దోశ ఇక్కడ చాలా ఫేమస్. వీరికి హైదరాబాద్ పలు ప్రాంతాల్లో బ్రాంచులు ఉన్నప్పటికీ గచ్చిబౌలి బ్రాంచ్ నే చాలా మంది ఇష్టపడతారు.
5. నాని టిఫిన్స్
ఇక్కడ ఒక్క దోశ తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. జున్ను, వెన్నతో దోశలను అందిస్తారు. ఇక్కడి క్రీమ్ చీజ్ దోశ ను ఎక్కువ మంది ఆర్డర్ చేస్తుంటారు. సికింద్రాబాద్ లోని రాణిగంజ్ లో ఉంటుంది నాని టిఫిన్స్.
6. తాజా కిచెన్
పేరులో ఉన్నట్లుగే ఇక్కడ లభించే దోశలు చాలా తాజాగా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ గ్రేప్ జ్యూస్ దోశ, మసాలా దోశ టాప్ ఆర్డర్లు. మీరు కూడా వాటిని ట్రై చేయండి.
7. 37 స్పైసీ సౌత్
నాన్ వెజ్ ప్రియులకు మరో బెస్ట్ ప్లేస్ ఇది. ఇక్కడ దోశలు చికెన్, మటన్ తో పాటు ప్రాన్స్ లాంటి సీఫుడ్ తో కూడా లభిస్తాయి. ప్రాన్స్ మసాలా దోశ ఇక్కడి ఎక్కువగా ఆర్డర్ చేసే ఐటెం. దీంతో పాటు మటన్ కర్రీ పూరి కూడా బెస్ట్ సెల్లర్. 37 స్పైసీ సౌత్ గచ్చిబౌలిలో ఉంది.
8. ప్రగతి టిఫిన్ సెంటర్
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రగతి టిఫిన్ సెంటర్. ప్రగతి టిఫిన్ సెంటర్ లో దొరికే మసాలా దోశ హైదరాబాద్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. కోటిలోని ప్రగతి కాలేజీ సమీపంలో ఉంటుంది. మంచి మసాలా దోశ కావాలంటే ఇక్కడికి తప్పకుండా వెళ్లండి.



Click it and Unblock the Notifications