Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Vizag's Best Samosas: వైజాగ్ ఉల్లిపాయ సమోసా.. ఇవే బెస్ట్ ప్లేసెస్
సమోసాకు ఇలాంటి ఘనమైన చరిత్ర చాలానే ఉంది. వైజాగ్ వాసులకు సమోసా అంటే పిచ్చి. అయితే మీరు వైజాగ్ లో బెస్ట్ ఉల్లిపాయ సమోసా తినాలంటే ఈ ప్రాంతాలకు వెళ్లండి.
సమోసా.. చాలా మందికి ఇది కేవలం చిరుతిండి మాత్రమే కాదు.. అదో ఎమోషన్. వేడి వేడి ఉల్లిపాయ సమోసా అంటే పడిచచ్చే వాళ్లు చాలా మంది ఉంటారు. ఉదయం, మధ్యాహ్నం అని కాకుండా ఎప్పుడైనా తినదగిన అద్భుతమైన చిరుతిండి సమోసా. ఉదయమైనా, పగలైనా, సాయంత్రం చాయ్ తో అయినా సమోసా కాంబినేషన్ అదిరిపోతుంది. సినిమా చూడటం కంటే ఇంటర్వెల్‌లో థియేటర్లలో చిట్టి సమోసాలు తినడాన్ని చాలా ఎంజాయ్ చేస్తామని 90s కిడ్స్ అంగీకరిస్తారు.

సమోసాకు ఇలాంటి ఘనమైన చరిత్ర చాలానే ఉంది. వైజాగ్ వాసులకు సమోసా అంటే పిచ్చి. అయితే మీరు వైజాగ్ లో బెస్ట్ ఉల్లిపాయ సమోసా తినాలంటే ఈ ప్రాంతాలకు వెళ్లండి.

1. సీ పెర్ల్
మంచి రుచికరమైన, అద్భుతమైన సమోసా తినాలనుందా.. అయితే RK బీచ్ రోడ్డులోని సీ పెర్ల్ కు వెళ్లండి. ఓ పాత క్యాంటీన్ లా కనిపిస్తుంది. కానీ అక్కడ దొరికే ఉల్లిపాయ సమోసా అంటే చాలా మంది పడిచస్తారు. ఇక్కడ సాయంత్రం వేళ చాలా మంది సమోసా తింటూ కనిపిస్తుంటారు. అక్కడి పరిసరాలు ఎంజాయ్ చేస్తూ వేడి వేడి పొగలు కక్కే చాయ్ తాగుతూ సమోసా తినండి.
ఇక్కడ సమోసాతో పాటు ఇమ్లీ చట్నీ వడ్డిస్తారు. అందులో ముంచుకుంటూ సమోసా తింటే అద్భుతః అనేస్తారు.

2. మిస్టర్ సమోసా
YMCA ఎదురుగా ఉంటే ఈ చిన్న ట్రక్.. సమోసాకు చాలా ఫేమస్ గా మారింది. ఇక్కడ చికెన్ సమోసా, పనీర్ సమోసా, నూడుల్స్ సమోసా ఇలా చాలా రకాల సమోసా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ దొరికే నాన్ వెజ్ సమోసాలను చాలా మంది ఇష్టంగా తింటారు. మీకు సమోసా వంటి సాంప్రదాయ చిరుతిండికి ఘాటైన రుచిని జోడించాలనుకుంటే నాన్ వెజ్ సమోసా ట్రై చేయండి.

3. స్వీట్ ఇండియా
స్వీట్ ఇండియా బెస్ట్ సమోసా కావాలంటే ఇక్కడికి వెళ్లాల్సిందే. ఢోక్లా నుండి సమోసా వరకు ఇక్కడ చాలా చిరు తిండ్లు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ సాయంత్రం వేళ వేడి వేడి సమోసా దొరుకుతుంది. స్వీట్ ఇండియాకు వైజాగ్ వ్యాప్తంగా చాలానే ఔట్ లెట్స్ ఉన్నాయి.

4. జైపూర్ సమోసా స్టాల్
అల్లీపురంలో ఉంటుంది జైపూర్ సమోసా స్టాల్. అలా రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఈ స్టాల్ ను గుర్తించడం కాస్త కష్టమే. ఇదో చిన్న స్టాల్.. కానీ ఏమాత్రం తీసిపారేయడానికి వీల్లేదు. ఇక్కడ దొరికే సమోసాలు చాలా ఫేమస్. మంచి జైపూరీ సమోసాలు తినాలంటే అల్లీపురంలోని ఈ స్టాల్ కు వెళ్లాల్సిందే. ఇక్కడ సమోసాలతో పాటు వివిధ రకాల చిరు తిండ్లు, స్వీట్లు కూడా ఉంటాయి.

5. న్యూఢిల్లీ స్వీట్స్
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ న్యూ ఢిల్లీ స్వీట్స్. ఇది నోరూరించే సమోసాలకు ఫేమస్ ప్లేస్. ఇక్కడ సమోసాలతో పాటు రెండు రకాలు చట్నీలు ఇస్తారు. ఒక్కో బైట్ ఒక్కో చట్నీతో తినండి. మీరు ఆర్డర్ చేసుకుని కూడా సమోసాలు తినొచ్చు. కానీ ఆ ఫీల్ రావాలంటే మాత్రం స్వయంగా వెళ్లాల్సిందే.



Click it and Unblock the Notifications