Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
కూలర్ నుంచి భరించలేని వాసనా వస్తుందా.. ఈ ఒక్క పని చేస్తే మల్లెపువ్వులా పరిమళించిపోతుంది!
బయట ఉష్ణోగ్రతలు దంచి కొడుతున్నాయి. భారీ ఎండలకు ఇంట్లో కూర్చోవాలంటే కచ్చితంగా ఏసీ లేదా కూలర్ ఉండాల్సిందే. అయితే చాలా మంది ఇంట్లో ఎక్కువగా కూలర్లు కనిపిస్తుంటాయి. వాటిని వినియోగించడం వలన అవి అప్పుడప్పుడు దుర్వాసనను వెదజల్లుతూ ఉంటాయి. కూలర్ ద్వారా వచ్చే నీరు కావచ్చు, అందులో ఉపయోగించే గడ్డి కావచ్చు, లేదా ఇతర ఏదైనా కారణవల్ల ఎక్కువగా దుర్వాసన వస్తుంటుంది. దీని కారణంగా చల్లగా అనిపించినా మనం ఎక్కువ సేపు కూలర్ వద్ద నిలబడలేకపోతాము. కొందరైతే ఆ కూలర్ అమ్మేసి కొత్తది తెచ్చుకుంటారు. అందుకే ఈ స్టోరీలో కూలర్ ఎలా వినియోగించాలి, కూలర్ స్మెల్ ఎందుకు వస్తుంది? ఆ వాసనను ఎలా నివారించాలి అనేది తెలుసుకుందాం.
కూలర్ నుంచి దుర్వాసన వచ్చే ప్రధాన కారణాలు:
పాత నీరు కూలర్‌లో నిల్వ ఉండటం: కూలర్‌లో పోసి నీరు మళ్లీ మళ్లీ మార్చకుండా వదిలేయడం వల్ల బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కూలర్ స్మెల్ వస్తుంటుంది.

కూలింగ్ ప్యాడ్స్‌పై మురికి పేరుకుపోవడం
కూలర్‌లో వినియోగించే గడ్డి ప్యాడ్స్ గాలి చల్లగా రావడానికి ఉపయోగపడతాయి. ఇవి తడి వాతావరణంలో ఉంటూ నూనె, ధూళి, ఫంగస్‌ను ఆకర్షిస్తాయి. దాని కారణంగా కూలర్ స్మెల్ వస్తుంటుంది.
ట్యాంక్ శుభ్రంగా లేకపోవడం
నీరు నిల్వ ఉండే చోట మురికి పేరుకుంటే, దానివల్ల పూర్తిగా కూలర్ వాసన చెడిపోతుంది.
దుర్వాసన నివారణకు చిట్కాలు:
1. కూలర్‌ను బేసిక్‌గా శుభ్రం చేయండి
మొదటిగా, ట్యాంక్‌లో ఉన్న పాత నీటిని పూర్తిగా వెలికితీయాలి. ఆ తరువాత శుభ్రమైన గుడ్డతో లేదా బ్రష్‌తో ట్యాంక్‌ను తుడిచి మరకలు తొలగించండి. అనంతరం కూలింగ్ ప్యాడ్స్‌ను తీసి వాటిని బాగా కడగండి లేదా అవసరమైతే కొత్తవి వేయండి.
నిమ్మకాయ
కూలర్ నీటిలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి. ఇది సహజమైన యాంటీ బాక్టీరియల్ & యాంటీ ఫంగల్ గుణాలతో నిండి ఉంటుంది. దీనివల్ల అందులో పెరిగే బ్యాక్టీరియా నాశమైపోతుంది. తాజా సిట్రస్ వాసన గదిలో ఉత్తేజకర వాతావరణాన్ని కల్పిస్తుంది.
3. వెనిగర్ & బేకింగ్ సోడా ఉపయోగించండి
వారానికి ఒకసారి 1 కప్పు వెనిగర్ లేదా 2 స్పూన్లు బేకింగ్ సోడా కూలర్ నీటిలో కలపండి. ఇవి బ్యాక్టీరియా, ఫంగస్‌ను తొలగించి చల్లని గాలికి శుభ్రమైన వాసనను ఇస్తాయి.
4. డిజింఫెక్టెంట్ ఉపయోగించండి
కూలర్ నీటిలో కొద్దిగా డేటోల్ లేదా సవనల్ వంటి డిజింఫెక్టెంట్ కలిపితే, సూక్ష్మజీవుల పెరుగుదల తగ్గుతుంది. ఇది ఆరోగ్యానికి సురక్షితమైన పరిష్కారం.
5. మార్కెట్‌లో లభించే కూలర్ ఫ్రెష్‌నర్స్
ప్రస్తుతం మార్కెట్లో స్పెషల్‌గా కూలర్ల కోసం తయారైన ఫ్రెష్‌నర్ సొల్యూషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి వాసనను తక్షణమే దూరం చేస్తాయి మరియు గాలిని తాజాగా ఉంచుతాయి.
తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం
ఈ చిట్కాలు పాటించడం వల్ల కూలర్ నుంచి వచ్చే చెడు వాసనను చాలా తక్కువ సమయంలో తగ్గించవచ్చు. అంతేకాకుండా, తరచూ శుభ్రపరిచే అలవాటు చేసుకుంటే.. కూలర్ పని సామర్థ్యం కూడా పెరుగుతుంది.



Click it and Unblock the Notifications