Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
బేబీ బాయ్ పుట్టిన వారితో షేర్ చేసుకునే కోట్స్, మెసెజ్, విషెస్
బిడ్డ పుట్టినప్పుడు ఎదుటివారిని ఆకట్టుకునేందుకు చెప్పే మెసెజ్ లు, కోట్స్ పై ఓ లుక్కేయండి.
ఎవ్వరి ఇంట్లో కొడుకు(Baby Boy) పుట్టారంటే చాలు. అంతే ఆ ఇంట్లో చిన్న యువరాజు అంటే చిన్ని రాకుమారుడే అడుగు పెట్టినంతా ఆనందంగా ఫీలవుతారు.

అదే విధంగా అమ్మాయి పుడితే లక్ష్మీదేవిలా భావిస్తారు. మీ జీవితంలో కూడా ఓ బేబీ బాయ్ వరంలా వస్తే.. మీరు అలాంటి క్షణాలను ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎవరి కుటుంబంలో పిల్లల రాక అనేది కచ్చితంగా ఆనందాన్ని మరియు అనుకూలతను, ఉత్సాహాన్ని తీసుకొస్తుంది.

ఇదిలా ఉండగా.. మీ బంధువులు, స్నేహితులు, సహోద్యోగి లేదా పొరుగువారైనా సరే, మీరు కచ్చితంగా కొత్త తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు.

ఈ నేపథ్యంలో వారికి మీరు హృదయపూర్వక అభినందనలు, మెసెజ్ లు తెలపాలనుకుంటే.. అలాంటి కోట్స్, విషెస్ సందేశాలు ఇక్కడున్నాయి. వాటిలో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి.. మీకు నచ్చిన వారితో వీటిని షేర్ చేసుకోండి.. వారిని ఆశ్చర్యపరచండి...

నీవు తల్లి అయ్యావని..
‘‘నీవు తల్లి అయ్యావని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నీవు పసిబిడ్డకు జన్మనిచ్చినందుకు నా ప్రియమైన నెచ్చెలికి అభినందనలు''

దేవుడు మిమ్మల్ని నిత్యం ఆనందంగా
‘‘మీకు బేబీ బాయ్ పుట్టినందుకు నా శుభాకాంక్షలు. నేను నా ఆశీర్వాదాన్ని పంపుతున్నాను. దేవుడు మిమ్మల్ని నిత్యం ఆనందంగా ఆశీర్వదించాలని కోరుతున్నాను''

మీ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని..
‘‘మీ కొడుకు పుట్టుక మీ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని.. సంతోషాన్ని తెస్తుంది.. ఈ సందర్భంలో మీకు అభినందనలు మరియు శుభాకాంక్షలు.

మంచి భవిష్యత్తు మరియు ఆరోగ్యకరమైన జీవితం
‘‘మీ పసికందు పుట్టుక మీ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇస్తుందని నేను నమ్ముతున్నాను. తన మంచి భవిష్యత్తు మరియు ఆరోగ్యకరమైన జీవితం కోసం నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను''

నీ బిడ్డను తెలివితేటలు
‘‘ప్రియమైన సోదరి, నీకు పసికందు పుట్టినందుకు అభినందనలు. దేవుడు నీ బిడ్డను తెలివితేటలు, ఆరోగ్యం, శ్రేయస్సు లభించేలా ఆశీర్వదిస్తాడు''

మీరిద్దరూ ఒక అందమైన బిడ్డకు
‘‘మొత్తానికి మీరిద్దరూ ఒక అందమైన బిడ్డకు జన్మనిచ్చారు. మీరు కూడా తల్లిదండ్రుల బాధ్యత తీసుకున్నారు. కాబట్టి మీరు ఎల్లప్పుడూ కలిసే ఉండాలి. మీ బిడ్డ తెలివైన మరియు మంచి బుద్ధిమంతుడిగా ఎదగొచ్చు.

పిల్లలు ఒక అద్భుతం..
‘‘పిల్లలు ఒక అద్భుతం, పిల్లలు సరదాగా ఉంటారు. మీకు చిన్న బుల్లబ్బాయ్ పుట్టినందుకు అభినందనలు''

ఉత్సాహమే కదా..
‘‘మీ కుటుంబంలో పొడిగింపు ఉండటం ఆశీర్వాదం మరియు ఉత్సాహమే కదా.. మీరు బిడ్డకు జన్మనిచ్చినందుకు శుభాకాంక్షలు''

నవజాత శిశువుతో
‘‘కొత్త తల్లి కావడం ఒక సాహసం కంటే తక్కువ కాదు. మీ నవజాత శిశువుతో ఈ సాహసోపేత ప్రయాణాన్ని మీరు ఆనందిస్తారని మేము ఆశిస్తున్నాం''

ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వడం
‘‘ప్రియమైన తల్లి మీరు ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వడం అంటే ఆశీర్వాదం కంటే తక్కువ కాదు. నేను మీ కోసం ఎల్లప్పుడూ ఉంటాను. దేవుడు మిమ్మల్ని మరియు మీ బిడ్డను మంచి ఆరోగ్యం మరియు ఆనందంతో ఆశీర్వదిస్తాడు''

బిడ్డను ఎంతలా ప్రేమించగలరో..
‘‘ఒక తల్లి లేదా తండ్రి తన బిడ్డను ఎంతలా ప్రేమించగలరో తెలియాలంటే.. నువ్వు ఓ తల్లివి కావాల్సిందే. లవ్ యూ సో మచ్''

యువరాజు చేరడంతో
‘‘ఇప్పుడు మా కుటుంబంలో కూడా ఓ యువరాజు చేరడంతో మాకు ఈరోజు ఎంతో అద్భుతమైన రోజు. దేవుడు మా చిన్నరాకుమారుడిని ఆశీర్వదిస్తాడు''

రత్నం కంటే..
‘‘మా ప్రియమైన కుమారుడు మా కుటుంబానికి రత్నం కంటే ఏ మాత్రం కాదు. ఈ సమయంలో తాతగా మారడానికి మేము సిద్ధంగా మరియు సంతోషంగా ఉన్నాం''

ప్రేమతో మరియు ఆనందంతో
‘‘ఓ బిడ్డకు తల్లిదండ్రులుగా మారినందకు మీకు అభినందనలు, దేవుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ప్రేమతో మరియు ఆనందంతో ఉండేలా ఆశీర్వదిస్తాడు''

ఈరోజు నా జీవితంలో
‘‘ఈరోజు నా జీవితంలో మంచి రోజు. ఎందుకంటే నా సోదరి ఒక చిన్న పిల్లవాడితో ఆశీర్వదించబడింది''



Click it and Unblock the Notifications