Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
గిన్నెలు, అంట్లు తోమడానికి స్పాంజ్, స్క్రబ్బర్లు వాడుతున్నారా?.. అయితే మీరు డేంజర్లో ఉన్నట్లే!
వంటలు వండడం ఒక ఎత్తు. అయితే వంటలు వండిన పాత్రలను శుభ్రం చేయడం మరో ఎత్తు. మాడిపోయిన గిన్నెలు, కళాయిలను శుభ్రం చేయాలంటే తల ప్రాణం తోకకొస్తుంది. అందుకే చాలామంది గృహిణీలు గిన్నెలను తోమడానికి స్క్రబ్బర్లు, స్పాంజ్ లు వాడుతూ ఉంటారు. అయితే ఈ స్క్రబ్బర్లు, స్పాంజిలు వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ స్పాంజిల్లో అనేక రకాల బ్యాక్టీరియాలను ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నట్లు పేర్కొంటున్నారు.
ఎలాంటి బ్యాక్తీరియాలు ఉంటాయి:
డ్యూక్ యూనివర్సిటీకి చెందిన బయోమెడికల్ ఇంజనీర్లు అంట్లు తోమేందుకు వినియోగించే స్క్రబ్బర్లు, స్పాంజిల్లో అనేక రకాల బ్యాక్తీరియాలను గుర్థించినట్లు వెల్లడించారు. అంట్లు తోమిన తరువాత వాటిలో ఉండే తేమ.. సూక్ష్మజీవుల పెరుగుదలకు అనువైన వాతావరణాన్ని కలిగిస్తుందని, తద్వారా బ్యాక్తీరియాలు అమితంగా పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ఒక్క క్యూబిక్ సెంటీమీటర్ స్క్రబ్బర్‌లో 54 బిలియన్ బ్యాక్టీరియాలు ఉంటాయని వెల్లడైంది. వీటిలో మెనింజైటిస్, న్యుమోనియా, అధిక జ్వరాలు, బ్లడీ డయేరియా, ప్రాణాంతక బ్లడ్ పాయిజిన్ వంటి వ్యాధులకు కారణమయ బ్యాక్టీరియాలు ఉన్నట్లు తేలింది.

ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి?
స్క్రబ్బర్లు, స్పాంజీలు వాడడం వల్ల ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో పెరిగే ఈ-కొలి అనే బ్యాక్టీరియా కారణంగా కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశముంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో కిడ్నీలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అలాగే స్టెఫిలోకాకస్ అనే బ్యాక్టీరియా కారణంగా.. చర్మ సంబంధిత వ్యాధులు, వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
పరిష్కారం మార్గం ఏమిటి?
ఈ వ్యాధుల నుంచి బయట పడాలంటే స్క్రబ్బర్లు, స్పాంజీల వాడకాన్ని తగ్గించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వాటి స్థానంలో సెల్యులోజ్ ఆధారిత స్క్రబ్బులు, స్క్రబ్ బ్రష్‌లు, సిలికాన్ బ్రష్‌లు, సింగిల్ యూజ్ మెటల్ స్క్రబ్బీలు, డిష్‌వాషర్లు తదితర వాటిని వినియోగించొచ్చని చెబుతున్నారు. అలాగే ప్లాస్టిక్ స్క్రబ్బులు, స్పాంజీలు పర్యావరణానికి హానికరం కాబట్టి, వాటిని వినియోగించకపోవడమే ఉత్తమం.



Click it and Unblock the Notifications