For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Engineer's Day 2023:ఇంజినీర్స్ డే ఎందుకు జరుపుకుంటారంటే...

|

Engineer's Day 2023:మన దేశంలో సెప్టెంబర్ మాసాన్ని ఇంజినీర్ల మాసంగా పరిగణిస్తారు. ఎందుకంటే ప్రపంచమంతా ఆయన పుట్టినరోజును స్మరించుకుంటుంది. ఆయనను ఇంజినర్ల పితామహుడు అని కూడా కీర్తిస్తారు.

Engineers Day 2021 Date, History and Why it is celebrated

ఇంజినీర్ శ్రమ వల్లే మనం నివసించే భవనాలు, మనం ఉపయోగించే కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లతో పాటు ఇంకా ఎన్నో ఆవిష్కరణల వెనుక ఒక ఇంజినీర్ పాత్ర కచ్చితంగా ఉంటుంది. అందుకే గూగుల్ కూడా ఆ ఇంజినీర్ చేసిన క్రుషిని గుర్తిస్తూ ప్రత్యేకంగా డూడుల్ సైతం రూపొందించి తన సేవల్ని మనకు గుర్తు చేస్తుంది.

Engineers Day 2021 Date, History and Why it is celebrated

ఇంతకీ ఆయనవెరు? ఎందుకని ఆయన జన్మదినాన్ని ఇంజినీర్ల దినోత్సవంగా జరుపుకుంటారు. ఇంజినీర్లకు ఆయన అంటే ఎందుకంత గౌరవం అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆయన సేవలకు గుర్తుగా..

ఆయన సేవలకు గుర్తుగా..

కర్నాటక రాష్ట్రానికి చెందిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ఇంజినీర్స్ డేను ఘనంగా జరుపుకుంటారు. ఈరోజున ఆయన చేసిన సేవలను దేశవ్యాప్తంగా స్మరించుకుంటారు. ఆయన 1861వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన కర్నాటకలోని చిక్ బళ్లాపూర్ లోని ముద్దెనహళ్లి అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఇంజినీరింగ్ విభాగంలో ఆయన సేవలు చిరస్మరణీయం. ఇంజినీరింగుతో పాటు ఆయన చేసిన క్రుషికి గుర్తుగా ఆయన్ను ‘వి.ఎమ్.సర్' అని కూడా పిలుస్తారు.

విద్యాభ్యాసం..

విద్యాభ్యాసం..

మోక్షగుండం విశ్వేశ్వరయ్య తల్లిదండ్రులిద్దరూ సంస్క్రుతంలో పండితులు. ఆయన తండ్రి తన 12వ ఏటలోనే మరణించారు. ఆయన గ్రామంలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత, ఉన్నత చదువుల కోసం బెంగళూరు నగరానికి వెళ్లారు. అక్కడ డిగ్రీలో ఆర్ట్స్ గ్రూపులో చేరారు. తర్వాత పూణే కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి సివిల్ ఇంజినీరింగులో డిగ్రీ పట్టా పొందారు.

మంచి నైపుణ్యం..

మంచి నైపుణ్యం..

ఆయనకు నీటి పారుదల, వరద విపత్తు నిర్వహణ రంగాల్లో మంచి నైపుణ్యం ఉండేది. ఆధునిక నీటి పారుదల పద్ధతులు, వరద విపత్తు నిర్వహణ రంగాల్లో ఆయన చేసిన క్రుషికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. అప్పుడే తన మేధస్సు గురించి మన దేశంలో అందరికీ తెలిసింది.

ఎలాంటి డ్యామేజీ లేకుండా..

ఎలాంటి డ్యామేజీ లేకుండా..

1903లో మహారాష్ట్రలోని పూనే సమీపంలో ఖదక్ వాస్తా రిజర్వాయర్ కు ఆటోమేటిక్ వెయిర్ వాటర్ ఫ్లడ్ గేట్లను ఏర్పాటు చేశారు. ఇదంతా ఆయన సొంతంగా డిజైన్ చేసినది. దీనికి గాను ఆయనకు పేటెంట్ రైట్ కూడా దక్కింది. ఈయన నిర్మించిన డ్యామ్ కు ఎలాంటి డ్యామేజీ లేకుండా వరద నీటిని నిల్వ చేసుకునేందుకు అవకాశం దొరికింది.

తెలుగు ప్రజలకు..

తెలుగు ప్రజలకు..

మన తెలుగు ప్రజలకు తరతరాలకు గుర్తుండిపోయేలా ఆయన చూపిన ప్రతిభను ప్రస్తుతం ప్రపంచంలోని ప్రఖ్యాత ఇంజనీర్ల కళాశాలల్లో పాఠాలుగా బోధిస్తున్నారు. దీంతో ఆయన గురించి తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో సాగరం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఆ సమయంలో సాగర తీరం నుండి రక్షించే వ్యవస్థను రూపొందించి ఆయన చిరస్మరణీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు. అంతేకాదు కోట్లాది మంది భక్తులు ప్రయానించే తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది కూడా ఆయనే.

భారతరత్న పురస్కారం..

భారతరత్న పురస్కారం..

ఈయన మైసూరు దివాన్ గా ఏడు సంవత్సరాల పాటు పని చేశారు. 1927 నుండి 1955వ సంవత్సరం వరకు స్టీల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా సేవలందించారు. ఈయన ఇంజినీరింగ్ విభాగంలో చేసిన సేవలను గుర్తిస్తూ 1955 సంవత్సరంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు భారతరత్న పురస్కారం లభించింది. మొత్తం వంద సంవత్సరాలు జీవించిన ఆయన 1962 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన తుది శ్వాస విడిచారు. అందుకే ఈ తరంలో ఉండే ఇంజినీర్లు ఆయన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటారు.

FAQ's
  • ఎవరి పుట్టినరోజున ఇంజినీర్ల దినోత్సవం జరుపుకుంటారు.

    మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం సందర్భంగా మన దేశవ్యాప్తంగా ఇంజినీర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన ఆయన చేసిన సేవలను స్మరించుకుంటారు. సివిల్, మెకానికల్ విభాగాల్లో ఈయన కీలకమైన పాత్ర పోషించారు.

English summary

Engineer's Day 2023 Date, History and Why it is celebrated

Here we are talking about the Engineer's day 2021 date, history and why it is celebrated. Read on
Desktop Bottom Promotion