For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Father's Day 2022 : ఫాదర్స్ డే జరుపుకోడానికి ప్రధాన కారణాలేంటో తెలుసా...

ఫాదర్స్ డే తేదీ, చరిత్ర, ప్రాముఖ్యతతో పాటు, ఈ రోజును తండ్రులకు ఎందుకు అంకితమిచ్చారో తెలుసుకోండి...

|

ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క తండ్రికీ తన పిల్లల పట్ల తల్లి కంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. కానీ పిల్లలు మాత్రం తల్లికే తొలి ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ ఆడపిల్లలు మాత్రం తల్లి కంటే తండ్రిని ఎక్కువగా ప్రేమిస్తుంటారు. తమ జీవితంలో తొలి హీరో తమ తండ్రే గర్వంగా చెబుతుంటారు.

Fathers Day 2020 Date, History and significance

ఈ ప్రపంచంలోని ప్రతి ఆడిపిల్ల అనేక సందర్బాల్లో తమ తండ్రి యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి చెబుతూ ఉంటారు. తండ్రిపై తమకున్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు.

Fathers Day 2020 Date, History and significance

సాధారణంగా తండ్రులందరూ పిల్లల విషయంలో కొంత కఠినంగా ఉన్నా.. వారి క్షేమం కోసం వారికేం చేయాలో తండ్రికి బాగా తెలుసు. అందుకే పిల్లలు ఏవైతే కోరుకుంటారో.. అలాంటి వాటిలో ఉత్తమమైనవాటిని ఇవ్వడానికి తండ్రి ఎల్లప్పుడూ రెడీగా ఉంటాడు.

Fathers Day 2020 Date, History and significance

వీటన్నింటి సంగతి పక్కనబెడితే అసలు ఫాదర్స్ డే ఎప్పుడు వచ్చింది? ఎందుకు వచ్చింది? ఈ ఫాదర్స్ డే ప్రతి ఏటా జూన్ మూడో ఆదివారమే జరుపుకోవాలని ఎందుకు నిర్ణయించారు? దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి? అనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Fathers' Day 2022 : ఫాదర్స్ డే విషెస్, కోట్స్, మెసెజ్ లను షేర్ చేసుకోండి...Fathers' Day 2022 : ఫాదర్స్ డే విషెస్, కోట్స్, మెసెజ్ లను షేర్ చేసుకోండి...

తండ్రి త్యాగాలను స్మరించుకోవడానికి..

తండ్రి త్యాగాలను స్మరించుకోవడానికి..

ఈ లోకంలో తల్లికి ఉన్నంత గుర్తింపు తండ్రికి లేదనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అందుకే తల్లితో పాటు తండ్రికి కూడా కనీస గుర్తింపు రావాలనే ఉద్దేశ్యంతో.. వారి త్యాగాలను, కష్టాలను గుర్తించడానికి ఓ రోజు ఉండాలని నిర్ణయించారు. అదే ఫాదర్స్ డే.

జూన్ 3వ ఆదివారం..

జూన్ 3వ ఆదివారం..

అలా ప్రతి ఏటా జూన్ మూడో ఆదివారం నాడు ఫాదర్స్ డే వేడుకలను ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించారు. ఈ ఆనవాయితీ మొట్టమొదటా అగ్రరాజ్యం అమెరికాలో ప్రారంభమైంది. అది కూడా 1910 సంవత్సరం నుంచే.

స్మార్ట్ డాడ్..

స్మార్ట్ డాడ్..

అమెరికాలోని వాషింగ్టన్ వైఎంసీఏలోని స్పోకెన్ సోనోరా స్మార్ట్ డాడ్ ఫాదర్స్ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే అప్పుడు జూన్ 19వ తేదీన ఫాదర్స్ డే వచ్చింది. అయితే అప్పటికే మదర్స్ డే వేడుకలను జరుపుకుంటున్నారు.

ఫాదర్స్ డే 2022 : నాన్నే మన నేస్తం కావాలంటే ఈ చిట్కాలను పాటించండి...ఫాదర్స్ డే 2022 : నాన్నే మన నేస్తం కావాలంటే ఈ చిట్కాలను పాటించండి...

తండ్రులకు కూడా ఓ రోజు..

తండ్రులకు కూడా ఓ రోజు..

అయితే ఈ విషయం తెలుసుకున్న సోనోరా ప్రతి ఒక్క తండ్రికి కూడా ఒకరోజు అనేది ఉండాలని నిర్ణయించారు. సోనోరా తండ్రి పేరు విల్లియం జాక్సన్ స్మార్ట్. ఆయనకు ఆరుగురు పిల్లలు. ఈయన కష్టపడి ఆరుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేశారు.

తండ్రి కష్టాలను గుర్తించి..

తండ్రి కష్టాలను గుర్తించి..

తన తండ్రి కష్టాలను, బాధ్యతల్ని, త్యాగాలను దగ్గర నుండి చూసిన సోనోరా ఫాదర్స్ కు కూడా ఓ రోజు ఉండాలని భావించారు. ఆ విషయాన్ని చర్చ్ పాస్టర్ తో చర్చించారు. తన తండ్రి పుట్టిన రోజుఅయిన జూన్ 5న ఫాదర్స్ డే వేడుకలను నిర్వహించుకున్నారు.

అమెరికాలో ప్రారంభం..

అమెరికాలో ప్రారంభం..

అయితే అప్పుడు కాలం కలిసిరాక అది కాస్త జూన్ మూడో ఆదివారానికి వాయిదా పడింది. అలా ప్రతి సంవత్సరం జూన్ 3వ తేదీన ఫాదర్స్ డే జరుపుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. ఆ తర్వాత ఇతర దేశాల్లోనూ ఈ రోజున ఫాదర్స్ డేను సెలబ్రేట్ చేసుకోవడం ప్రారంభించారు. మన దేశంలో కూడా కొన్ని సంవత్సరాలు ఈ వేడుకలను జరుపుకుంటున్నారు.

Father's day 2022 : నాన్నే నా హీరో అని కూతుళ్లెందుకుంటారో తెలుసా...Father's day 2022 : నాన్నే నా హీరో అని కూతుళ్లెందుకుంటారో తెలుసా...

మన దేశంలో ప్రముఖులు..

మన దేశంలో ప్రముఖులు..

ఆ తర్వాత మన దేశంలో కూడా కొంతమంది ప్రముఖులు కూడా ఫాదర్స్ డేను సెలబ్రెట్ చేసుకోవడం ప్రారంభించారు. ఇటీవలే కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందాన కూడా తండ్రితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఫొటోలను, మెమోరీస్ ను షేర్ చేసుకుంది.

అంబానికీ ఐకాన్ నాన్న..

అంబానికీ ఐకాన్ నాన్న..

ప్రపంచంలోని కుభేరులలో ఒకరైన ముఖేష్ అంబానీ కూడా ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి గురించి కొన్ని విషయాలను గుర్తు చేసుకున్నారు. తన జీవితంలో రోల్ మోడల్, తన ఐకాన్ తన తండ్రి అని చెప్పుకున్నారు.

సుందర్ పిచాయ్ ఏమన్నారంటే..

సుందర్ పిచాయ్ ఏమన్నారంటే..

ఇక గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ అయితే తన తండ్రి గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. తాను మొట్టమొదటిసారి అమెరికా వెళ్లేందుకు విమాన టికెట్ కొనేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో, తన తండ్రి తన జీతం డబ్బులు మొత్తాన్ని ఇచ్చేసినట్లు తెలిపారు.

ఇలా చాలా మంది ప్రముఖులు తమ తండ్రులతో తమకు ఉన్న ప్రత్యేక బంధాలను గుర్తు చేసుకుంటూ ఫాదర్స్ డేను సెలబ్రేట్ చేసుకోవడం ప్రారంభించారు.

English summary

Father's Day Date, History and significance

Here we talking about father's day 2020 date, history and significance. Read on
Desktop Bottom Promotion