Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Women's day 2023: స్త్రీల దైనందిన జీవితాలను తెలిపే యానిమేటెడ్ గూగుల్ డూడుల్ ను మీరూ చూడండి...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2023 సందర్భంగా గూగుల్ సరికొత్త డూడుల్ ను క్రియేట్ చేసింది. అదేంటో మీరూ చూడండి.
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2023 సందర్భంగా ప్రత్యేకమైన యానిమేటెడ్ గూగుల్ డూడుల్ ను రూపొందించి. ఇది మహిళల దైనందిన జీవితాలకు సంగ్రహావలోకనం ఇచ్చేదిగా ఉంది.

ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి.. ఇంటి పనితో ప్రారంభించే స్త్రీ మిషన్ కుట్టడం, ఫ్యాషన్ ప్రపంచంలో పోటీ పడటం, సాఫ్ట్ వేర్ రంగంలో ల్యాప్ టాపులో మునిగిపోవడం, మరోవైపు తన బిడ్డ క్షేమం చూసుకోవడం.. భర్తను భరించడంతో పాటు మోటార్ సైకిల్ మెకానిక్ వరకు తన నైపుణ్యాలను పెంచుకుంటూ పోతోంది.

ఇలా ఆమె తర్వాతి తరానికి ఆదర్శంగా నిలుస్తోందని గూగుల్ డూడుల్ యానిమేటెడ్ చిత్రాల ద్వారా స్పష్టమవుతోంది.
నేటి గూగుల్ డూడుల్ లో ఉండే ప్రతి చిత్రం, మహిళలు తమ కోసం, వారి కుటుంబాలు మరియు వారి కమ్యూనిటీల కోసం ఎలా కనిపిస్తారు అనే సాధారణ థ్రెడ్ తో అనుసంధానించబడి ఉందని గూగుల్ వివరించింది...

ఎవరు రూపొందించారంటే?
మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ మహిళలకు సంబంధించిన ప్రత్యేకమైన యానిమేటెడ్ గూగుల్ డూడుల్ తో శుభాకాంక్షలు తెలిపింది. ఈ ప్రత్యేక డూడుల్ ను ఆర్ట్ డైరెక్టర్ థోకా మేర్ రూపొందించారు.

గౌరవ నివాళులు..
ఉమెన్స్ డే సందర్భంగా ప్రత్యేకంగా ఓ యానిమేషన్ డూడుల్ ను రూపొందించి.. ప్రపంచ వ్యాప్తంగా మహిళలంతా ఏయే రంగాల్లో రాణిస్తున్నారో.. వాటి చరిత్ర గురించి తెలియజేస్తూ, సినిమా, విద్యా, వైద్యం, సంగీతం, డైరెక్షన్, సైన్స్, క్రీడా, ట్రెక్కింగ్, శాస్త్రవేత్తలు, రచయితలు, మెకానిక్, టైలరింగ్, నర్సరీ, కళా రంగాలతో పాటు అనేక చిత్రాలను జోడించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రస్తుత తరం మహిళలకు మార్గం సుగమం చేయడం ద్వారా గౌరవ నివాళులర్పించింది.

శక్తివంతమైన మహిళల కోసం..
నేటి గూగుల్ డూడుల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ, వారు కోరుకునే శాశ్వత వారసత్వాన్ని క్రియేట్ చేయడానికి, వారికి ఎదురయ్యే సమస్యలను అధిగమించి, సఫ్రాజిస్టులు, విద్యావేత్తలు, గోల్డ్ మెడల్ విన్నర్స్, డాక్టర్లు, నర్సులు, వ్యాపారవేత్తలు, మెకానిక్స్, ఇతర వ్యవస్థాపకులు ఎందరో ఈ డూడుల్ లో ఉన్నారు. ఈ యానిమేటెడ్ డూడుల్ మహిళల పోరాట చరిత్రకు న్యాయం చేయలేదు. కానీ ఇది చాలా శక్తివంతమైనదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

21వ శతాబ్దంలో..
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాలుగా జరుపుకుంటారు. చాలా దేశాల్లో మహిళా దినోత్సవం రోజున సెలవు దినంగా పరిగణిస్తారు. 2023 అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క థీమ్ ‘‘స్థిరమైన రేపటి కోసం ఈరోజు లింగ సమానత్వం''. ‘‘వాతావరణ మార్పు మరియు పర్యావరణ మరియు విపత్తు ప్రమాదాల తగ్గింపు నేపథ్యంలో 2023వ సంవత్సరం లింగ సమానత్వాన్ని సాధించడానికి కీలకమైనది, 21వ శతాబ్దంలో అతి పెద్ద ప్రపంచ సవాళ్లలో కొన్ని.

స్థిరమైన భవిష్యత్తు కోసం..
ఈ కాలంలో లింగ సమానత్వం లేకుండా, స్థిరమైన భవిష్యత్తు మరియు సమానమైన భవిష్యత్తు మన పరిధికి మించినది. ఈ ఏడాది IWD ఆచారం అనేది వాతావరణ మార్పుల అనుసరణ మరియు ప్రతిస్పందనపై నాయకత్వం వహిస్తున్న మహిళలు మరియు బాలికలను గుర్తించడం, వారి స్థిరమైన భవిష్యత్తు కోసం వారి నాయకత్వం మరియు సహకారాన్ని గౌరవించడం '' అని UN ఉమెన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. నిత్యం మనందరి శ్రేయస్సు కోరుకునే వారిలో మహిళలే ముందుంటారు. మనిషి మనుగడకు మూలాధారమైన మహిళను గౌరవంగా స్మరించుకునే రోజే మహిళా దినోత్సవ రోజు.



Click it and Unblock the Notifications