Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
HBD Dhoni : ధోనీ భారత క్రికెట్ కు దొరికిన ఒక గని... అరుదైన ఆణిముత్యం మహేంద్రుడు...
ధోనీ పుట్టినరోజు సందర్భంగా తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...
ధోనీ కెప్టెన్ గా టి20 కప్ తో బోణీ.. భారత క్రికెట్ అభిమానులకు 28 ఏళ్లుగా ఉన్న వరల్డ్ కప్ కలని.. విజయవంతమైన కెప్టెన్ గా పేరు తెచ్చుకుని తను అడుగుపెట్టిన వెంటనే ట్రోఫీలను సాధించి.. భారత క్రికెట్ అభిమానుల కోరికను తీర్చాడు. అక్కడితో ఆగకుండా ఐసీసీ ఛాంపియన్స్.. టెస్టుల్లో బెస్ట్ టీమ్ గా.. బెస్ట్ కెప్టెన్ గా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కూల్ కెప్టెన్ ఈరోజు (జులై 7న) 40వ పడిలోకి అడుగుపెట్టాడు.

క్రికెట్లో ఉన్నప్పుడు ఎంతో బిజీ బిజీగా గడిపిన ధోనీ ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా తన సొంతూరిలో సేంద్రీయ వ్యవసాయం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ధోనీ పుట్టినరోజు సందర్భంగా తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

చిన్నతనంలో చురుకుగా..
జార్ఖండ్ రాష్ట్రంలో 1981, జులై 7వ పుట్టిన మహేంద్ర సింగ్ ధోనీ చిన్నతనం నుండే చాలా క్రీడల్లో చురుకుగా పాల్గొనేవాడు. అయితే క్రికెట్ కంటే ముందు ఫుట్ బాల్ గోల్ కీపర్ గా ఉండేవాడు. తర్వాత క్రికెట్లోకి అడుగుపెట్టాడు.

టిటిఇగా..
ధోనీ క్రికెట్ ఆడే సమయంలో భారత రైల్వేలో టిటిఇగా పని చేశాడు. ఓవైపు ఉద్యోగం.. మరోవైపు క్రికెట్ ను రెండింటిని బ్యాలెన్స్ చేసేవాడు. ధోనీ బయోగ్రఫీ సినిమాలో ఈ సీన్లు చాలా హైలెట్ అయ్యాయి.

కుర్రాళ్లతో టి20 వరల్డ్ కప్...
2007లో ఐసీసీ వరల్డ్ కప్ లో భారత క్రికెట్ జట్టు ఘోర పరాభవం తర్వాత, టి20 జట్టుకు సారథిగా ఎంపికైన మహేంద్రుడు కుర్రాళ్లతో కలిసి టీమిండియాను ఫైనల్ చేర్చడం ఒక ఎత్తయితే.. అందులోనూ పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ అందరికీ ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. చివరి ఓవర్లో అందరికి నరాలు తెగే ఉత్కంఠ ఉంటే.. తాను మాత్రం కూల్ గా జోగిందర్ శర్మ బాల్ ఇచ్చి కూల్ గా టైటిల్ సాధించేశాడు.

2011 ఐసీసీ వరల్డ్ కప్ లో..
ఇక 2011 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ లో కీలక సమయంలో భారత్ రెండు వికెట్లు కోల్పోగా, నాలుగో నెంబర్ బ్యాట్స్ మెన్ గా క్రీజులోకి అడుగుపెట్టిన ధోనీ గంభీర్ తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. అంతేకాదు చివరివరకు అజేయంగా నిలిచి టీమిండియా టైటిల్ సాధించడంలో తనదైనా మార్క్ చూపించాడు ఈ జార్ఖండ్ డైనమెట్.

బెస్ట్ వికెట్ కీపర్ గా..
తాను క్రికెట్లో అడుగుపెట్టిన కొద్దికాలంలోనే ప్రపంచంలోనే బెస్ట్ వికెట్ కీపర్ గా పేరు తెచ్చుకున్నాడు. వికెట్ల వెనుక ధోనీ ఉన్నాడంటే బ్యాట్స్ మెన్ హిట్టింగ్ చేసేందుకు క్రీజు వదిలి వెళ్లేందుకు చాలా ఆలోచించేవారు. అంతలా వికెట్ల వెనుక చురుకుగా ఉండేవాడు.

ఐపీఎల్ లోనూ తన మార్క్..
ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా మూడు టైటిల్స్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు మిగిలిన సందర్భాల్లోనూ ఫైనల్, సెమీస్ వరకూ తీసుకెళ్లాడు.

DRS (Dhoni Review System)
క్రికెట్లో వికెట్ల ఉన్నంత సేపు మెరుపు వేగంతో స్పందించేవాడు. ధోనీ వికెట్ కీపర్ గా ఉన్నాడంటే.. బ్యాట్స్ మెన్ క్రీజు దాటి ముందుకు రావడానికి భయపడేంతలా తన కీపింగ్ ఉండేది. రకరకాల టెక్నిక్స్ తో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపేవాడు. అందుకే సోషల్ మీడియాలో DRS (Dhoni Review System) బాగా ఫేమస్ అయ్యింది.

2సార్లు ఐసీసీ ప్లేయర్ అవార్డు..
భారత క్రికెట్ జట్టు తరపున మహేంద్ర సింగ్ ధోనీ మాత్రమే ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' అవార్డును రెండుసార్లు దక్కించుకున్నాడు.

బైక్స్ అంటే బాగా ఇష్టం...
మహేంద్రుడిని బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. అది ఎంతలా అంటే భారత మార్కెట్లో ఏ కొత్త మోడల్ వచ్చినా ధోనీ ఇంటికి అది చేరిపోవాలి. అలా కొన్న బైకులన్నీ తన షెడ్డులో ఉంచుకునేవాడు. అంతేకాదు తన బైక్ ఏదైనా రిపేరీ అయితే, తనే సొంతంగా సరిచేసుకుంటాడంట.

ధోనీ కొత్త అవతారం..
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా తన సొంత రాష్ట్రమైన జార్ఖండ్ లోని ఫామ్ హౌస్ లో ఉంటూ ధోనీ ఇటీవలే ఓ కొత్త ట్రాక్టర్ ను కొన్నాడు. అంతేకాదు తానే స్వయంగా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాడు. తన 39 పుట్టినరోజు వేడుకలను సాదాసీదాగా జరుపుకున్నాడు.



Click it and Unblock the Notifications