Latest Updates
-
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా!
HBDay Power Star : ట్రెండ్ సెట్ చేసే హీరో పవన్ కళ్యాణే..!
తెలుగు సినిమాల్లో ట్రెండ్ సెట్ చేసే హీరో పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...
'వాస్తవానికి హీరో కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. చిన్నతనం నుండే అన్నయ్య చిరంజీవి అంటే అమితమైన ఇష్టం. ఆయనే నాకు స్ఫూర్తి. తెలుగు సినిమా రంగంలో ఆయన ఎదుగుతున్న తీరుని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించేది.

నేను ఆయనకు ఒక అభిమానిగా ఉందామని మాత్రమే అనుకున్నా.. అయితే అనుకోకుండా నేను కూడా వెండితెరపై అడుగు పెట్టాల్సి వచ్చింది. ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చేసిన నాకు ఇప్పటికీ కెమెరా అంటే నాకు సిగ్గు, బిడియం.. హీరోయిన్లతో డ్యాన్సులు వేయాలన్నా.. పాడాలన్న చాలా మోహమటపడుతుంటాను.

అలాంటి నేను సినిమాల్లో నటిస్తున్నానా? అనిపిస్తుంది నా సినిమాలను అప్పుడప్పుడే చూస్తుంటే' అంటారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ స్టార్ కు 'కొంచెం తిక్క ఉంది.. కానీ దానికో లెక్కుంది'. ఈ పవర్ స్టార్ ప్రస్తుతం జనసేనానికి జనానికి చేరువయ్యాడు. అలాంటి జనసైనికుడి పుట్టినరోజు సెప్టెంబర్ 2వ తేదీ. ఈరోజున ఆయన 50వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు.

ఈరోజున మెగా అభిమానులందరికీ పండుగ రోజు. పైగా ఈ పుట్టినరోజు నాడు పవన్ కళ్యాణ్ కు సంబంధించి ముచ్చటగా మూడు అప్ డేట్లు వస్తున్నాయట. ఈ వివరాల కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలను తెలుసుకుందాం...

పవన్ జననం..
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకటరావు, అంజనా దేవి దంపతులకు 1971 సంవత్సరంలో సెప్టెంబర్ 2వ తేదీన పుట్టిన మూడో కుమారుడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చిరంజీవి, నాగబాబులకు తమ్ముడిగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ సుపరిచితుడే.

పవన్ అసలు పేరిదే..!
పవన్ కళ్యాణ్ అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు. కానీ పవన్ కళ్యాణ్ తెర మీద కనిపించిన పేరు. పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ లో కరాటేలో మంచి ప్రావీణ్యత సంపాదించాడు. తనకు బ్లాక్ బెల్ట్ కూడా ఉంది.

అప్పట్లో సంచలనం..
1996 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం వెనక్కి తిరిగి నిలబడ్డ ఓ వ్యక్తి ఫొటో పోస్టర్లో ప్రముఖంగా కనిపించింది. అప్పటివరకు అతనంటే ఎవరని అందరిలోనూ ఒకటే ఉత్కంఠగా ఉండేది. అలా పవన్ కళ్యాణ్ తొలి సినిమా ప్రకటనే అప్పట్లో ఒక సంచలనంగా మారింది. ఆ చిత్రమే ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. ఈ సినిమాతో కళ్యాణ్ బాబు తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచమయ్యాడు.

టాప్-5 హీరోల్లో ఒకడిగా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా రంగంలో టాప్-5 హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. 2014లో స్టార్ ఇండియా వారు చేసిన సర్వేలో భారతదేశపు 5 అగ్ర హీరోల జాబితాలో పవన్ కళ్యాణ్ కు కూడా చోటు దక్కడం విశేషం.

బ్రాండ్ అంబాసిడర్ గా..
ఒకప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కూల్ డ్రింక్ పెప్సీ. ఈ కంపెనీ డ్రింక్స్ కు దక్షిణ భారతదేశం నుండి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన తొలి హీరో పవన్ కళ్యాణే. అలాగే 2017 నుండి రెండు తెలుగు రాష్ట్రాల చేనేత కార్మికుల బ్రాండ్ వ్యవహరించడానికి కూడా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు.

మూడు పెళ్లిళ్లు..
ఇక పవన్ వ్యక్తిగత విషయానికొస్తే తను మొత్తం మూడు పెళ్లిళ్లను చేసుకున్నాడు. అయితే ఇదంతా చట్టబద్ధంగానే జరిగింది. ముందుగా ఇద్దరు భార్యలకు విడాకులిచ్చి.. మూడోసారి విదేశీ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ గుర్తుగా ఓ పండంటి బిడ్డ కూడా పుట్టింది. అయితే ఇది చాలా వివాస్పదంగా మారిన విషయం అందరికీ తెలిసిందే.

ఎన్నికలకు ముందు..
2009లో అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన నాటి నుండి రాజకీయాల్లో చురుకుగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత బలమైన నిర్ణయం తీసుకున్నాడు. చిరంజీవికి ఎన్నికల్లో ఘోర పరాభావం తర్వాత, ఆయన ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెప్పాడు. మళ్లీ సరిగ్గా 2014 ఎన్నికల ముందు జనసేన పార్టీని స్థాపించాడు. అయితే ఆ సమయంలో పోటీ చేయలేదు. కానీ అప్పుడు బిజెపి, టిడిపికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపాడు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం తనకు మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. తను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు.

రచయితగా..
పవన్ కళ్యాణ్ ‘ఇజం' అనే పుస్తకాన్ని మరో రచయితతో కలిసి రాశాడు. అది జనసేన పార్టీ యొక్క భావజాలం గురించి తెలియజేసే పుస్తకం. అప్పటినుండే తాను ఫుల్ టైం రాజకీయాలలో ఉండాలన్న తన ఉద్దేశ్యాన్ని కూడా తెలిపాడు.

ఎన్నో అవార్డులు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సినిమాలో ఎన్నో అవార్డులు వచ్చాయి. తెలుగులో బెస్ట్ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డు, హైదరాబాద్ టైమ్స్ ఫిల్మ్ అవార్డు, ‘మా' అవార్డు, సైమా అవార్డులతో పాటు ఉత్తమ నటుడిగా సంతోషం ఫిల్మ్ అవార్డును, మార్గదర్శి బిగ్ ఎంటర్టైన్మెంట్ అవార్డును కూడా అందుకున్నాడు.



Click it and Unblock the Notifications