Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Happy Birthday Chiru66 : ‘ఆచార్య’అనుసరించే సిద్ధాంతమేంటో తెలుసా...
మెగాస్టార్ చిరంజీవి గురించి మనం నమ్మలేని నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ సినిమా రంగంలో మెగాస్టార్ అంటే ఓ సంచలనం... తన సినిమా విడుదలైతే ఓ ప్రభంజనం.. ఎలాంటి స్టెప్పులైనా అవలీలగా వేయడం ఆయన నైజం.. డైలాగులు, యాక్షన్ సీన్లలో జీవించడమే ఆయన హీరోయిజం.. అభిమానుల్ని అనునిత్యం అలరించడమే ఆయన కర్తవ్యం.. ఇలాంటి లక్షణాలే చిరంజీవికి మెగాస్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి.

భారత సినీ చరిత్రలో చిరంజీవిగా పేరు, ప్రతిష్టలు సంపాదించి.. వైవివధ్యమైన నటనతో ప్రేక్షకులను అలరించి.. ప్రేక్షకులు ఎలా కోరుకుంటే అలా తనను తాను మార్చుకుంటూ విభిన్న పాత్రలు చేస్తూ దూసుకుపోతున్న కొణిదెల శివశంకరవరప్రసాద్ ఈ ఆగస్టు 22వ తేదీన 66వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు.

చిత్రసీమలో తనకంటూ సుస్థిర స్థానం ఏర్పరచుకుని.. ఉత్తమ నటుడిగా ఎదగాలనే ఆశయంతో.. ఆకాంక్షతో, అంకితభావంతో తన లక్ష్యాన్ని చేరుకోవాలనే తపనతో.. నిబద్ధత, క్రమశిక్షణతో కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే ఆర్టిస్ట్ మెగాస్టార్ గా ఎదిగారు. అయితే అలా ఎదిగిన కొద్దీ కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఒదిగుండే తత్వాన్ని అలవరచుకున్నారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

చిరంజీవి జననం..
చిరంజీవిగా టాలీవుడ్ లో కీర్తి, ప్రతిష్టలు పొందిన కొణిదెల శివశంకర వర ప్రసాద్ 1955 ఆగస్టు 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి ఒక సామాన్య కానిస్టేబుల్. చిరంజీవి బాల్యమంతా నానమ్మ, తాత గారి వద్దే గడిచింది. నిడదవోలు నుండి మంగళగిరి, మొగల్తూరు ప్రాంతాల్లో పాఠశాల విద్యను, ఒంగోలు సీఎస్ఆర్ శర్మ కాలేజీ ఇంటర్, నర్సాపూర్ శ్రీవై.ఎం. కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. 1970లో ఎన్ సిసి కేడెట్ గా దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకల పరేడ్ లో కూడా పాల్గొన్నారు.

హనుమ భక్తుడు..
మెగాస్టార్ చిరంజీవి.. అతని కుటుంబం హనుమంతుడిని ఎక్కువగా ఆరాధిస్తారు. అందుకే తన అసలు పేరు శివశంకర వరప్రసాద్ అయినప్పటికీ, అతని పేరు ‘చిరంజీవి'గా మార్చుకున్నారు. చిరంజీవి అంటే ‘ఎప్పటికీ జీవించు' అంటే హనుమంతుడు అమరుడు అనే నమ్మకాన్ని సూచిస్తుంది.

మద్రాసుకు మకాం..
చిరంజీవికి చిన్ననాటి నుండే నటన అంటే ఎంతగానో ఇష్టముండేది. అందుకే మద్రాసు పట్టణానికి మకాం మార్చి, 1976లో అక్కడ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో చేరి యాక్టింగులో ట్రైనింగ్ తీసుకుని.. అక్కడే సినిమా అవకాశాలను ప్రయత్నించారు.

1978లో..
తెలుగు సినిమా రంగంలో అత్యంత ప్రముఖమైన హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన చిరంజీవి 1978లో ‘ప్రాణం ఖరీదు' చిత్రంతో తెరంగేట్రం చేశాడు. అయితే అప్పటికే ‘పునాది రాళ్లు' సినిమాలు నటించాడు. అయితే విడుదలయ్యేందుకు కొంత ఆలస్యమయ్యింది. ఆ సినిమా 1979లో విడుదలైంది.

1980లో వివాహం..
అలా సినిమాల్లో పాపులర్ అవుతున్న సమయంలోనే ప్రఖ్యాత హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో చిరంజీవి పెళ్లి జరిగింది. చిరంజీవికి ఇద్దరు కూతుళ్లు సుస్మిత, శ్రీజ, ఒక కుమారుడు రామ్ చరణ్ తేజ్ ఉన్నారు.

అలా స్టార్ డమ్..
చిరంజీవి సినిమాల్లో ‘ఖైదీ' సినిమా తర్వాత ఎంతో స్టార్ డమ్ వచ్చింది. ఆ తరువాత తను వరుసగా యాక్షన్ మూవీస్ లో యాక్టింగ్ చేస్తూ చాలా బిజీగా మారిపోయారు.

ఎన్నో అవార్డులు..
ఇలా ఎన్నో అత్యద్భుతమైన సినిమాలలో నటించిన చిరంజీవికి భారత ప్రభుత్వం 2006లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఇక ఫిలిం ఫేర్ అవార్డులు ఎన్నో వచ్చాయి. వీటితో రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డులు, రఘుపతి వెంకయ్య అవార్డు కూడా ఆయనను వరించింది. ఇక అదే సంవత్సరంలో ఆంధ్ర యూనివర్సిటీ చిరంజీవిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది.

ప్రజారాజ్యం పార్టీ..
అలా సినిమాలు చేస్తున్న చిరంజీవి ఒక్కసారిగా రాజకీయాల వైపు అడుగులు వేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి.. ఆ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేశారు. అయితే సొంత నియోజకవర్గంలో మాత్రం గెలవలేకపోయారు. కానీ తిరుపతిలో మాత్రం విజయం సాధించగలిగారు. ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

ఫిట్ నెస్ పై అధిక శ్రద్ధ..
మెగాస్టార్ చిరంజీవి ఫిట్ నెస్ విషయంలో అత్యంత శ్రద్ధ కనబరుస్తారు. చిరంజీవి అభిప్రాయం బాడీ ఫిట్ నెస్ అనేది రెండు రకాలు. మానసిక ఫిట్ నెస్ మరియు శారీరక ఫిట్ నెస్. డైట్ అనేది ఎంత ముఖ్యమో.. ఎక్సర్ సైజు కూడా అంతే ముఖ్యమని చిరంజీవి చాలా సందర్భాల్లో చెప్పారు.

చిరు అనుసరించే సిద్ధాంతం..
‘నీ పని నీవు చేయి.. ఫలితం దైవానికి వదిలేయి' అనే సిద్ధాంతాన్ని చిరంజీవి అనుసరిస్తారు. భగవద్గీతలో శ్రీక్రిష్ణుడు చెప్పిన ఈ సిద్ధాంతాన్ని అనుసరించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తుందని చెబుతుంటారు. మన పనిని మనం అంకితభావంతో పూర్తి చేశాక ఫలితం గురించి ఆలోచిస్తూ మనసును ఒత్తిడికి గురి చేయకూడదని చిరంజీవి చెబుతుంటారు. అలాగే పిల్లలతో గడిపితే ఒత్తిడి ఇట్టే మాయమవుతుందని చిరంజీవి గట్టిగా నమ్ముతారట.



Click it and Unblock the Notifications