For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Padma Awards 2022: ఈ ఏడాది దేశ అత్యున్నత పౌర పురస్కారాలు వీరికే..ఈ జాబితాలో ఎంతమంది తెలుగువారున్నారో తెలుసా...

2022 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా పద్మా అవార్డులు సొంతం చేసుకున్న ప్రముఖల పూర్తి వివరాలను చూసెయ్యండి.

|

Padma Awards 2022: 2022 సంవత్సరంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 128 మంది ప్రముఖులు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇందులో కొందరికి పద్మ శ్రీ అవార్డులు, మరికొందరికి పద్మ భూషణ్.. ఇంకా కొందరికి పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి. ఈ జాబితాలో నలుగురికి పద్మభూషణ్, 17 మందికి పద్మ భూషణ్ మరియు 107 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. వీరిలో 13 మందికి మరణానంతరం అవార్డులు దక్కడం విశేషం.

Highest Civilian Awards

కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా సామాజిక సేవ, కళలు, విద్య, సాహిత్యం, సైన్స్, నటన మరియు ప్రజా రంగాలలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డును అందజేస్తుంది. 2022 సంవత్సరంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో ఏడుగురు తెలుగు వారు ఉండటం విశేషం. వారిలో నలుగురు వ్యక్తులు తెలంగాణ నుంచి ఉన్నారు.. మరో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ నుండి ఉన్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. క్రిష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల - భారత బయోటెక్(ఉమ్మడిగా), తెలంగాణ నుంచి దర్శనం మొగిలయ్య-కళలు, రామచంద్రయ్య - కళలు, పద్మజా రెడ్డి - కళలు, ఆంధ్రప్రదేశ్ నుండి గరికపాటి నరసింహరావు - సాహిత్యం/విద్య, గోసవీడు షైక్ హుస్సేన్ - సాహిత్యం/విద్య, డాక్టర్ సుంకర వెంకట ఆది నారాయణ రావు - మెడిసిన్

Republic Day Parade:రిపబ్లిక్ డే వేడుకల్లో శకటాలను ఎలా ఎంపిక చేస్తారంటే...!Republic Day Parade:రిపబ్లిక్ డే వేడుకల్లో శకటాలను ఎలా ఎంపిక చేస్తారంటే...!

మరణానంతరం..

మరణానంతరం..

గత నెలలో ఒక భయంకరమైన చాపర్ ప్రమాదంలో మరణించిన భారతదేశపు తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్, మరణానంతరం దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ తో సత్కరించారు.

వ్యాక్సిన్ తయారీదారులకు..

వ్యాక్సిన్ తయారీదారులకు..

ప్రపంచ వ్యాప్తంగా పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు వ్యాక్సిన్ తయారుచేస్తున్న సీరమ్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన సైరస్ పునావాలా మరియు భారత్ బయోటెక్ కు చెందిన క్రిష్ణ ఎల్లా మరియు సుచిత్రా ఎల్లాను పద్మభూషణ్ తో సత్కరించారు.

టెక్ దిగ్గజాలకు..

టెక్ దిగ్గజాలకు..

మన దేశ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా పెరిగేలా చేసిన మైక్రోసాఫ్ట్, గూగుల్ సిఇఓలైన సత్యనాదెళ్ల, సుందర్ పిచాయ్ లకు పద్మభూషణ్ అవార్డులు దక్కాయి.

నీరజ్ చోప్రా..

నీరజ్ చోప్రా..

సింగర్ సోనూ నిగమ్ మరియు ఒలింపిక్ విభాగంలో బంగారు పతక విజేత నీరజ్ చోప్రాకు సైతం పద్మ శ్రీ అవార్డు దక్కింది.

తెలంగాణ నుండి..

తెలంగాణ నుండి..

తెలంగాణ నుండి ముగ్గురు వ్యక్తులకు పద్మ అవార్డులు దక్కాయి.. క్రిష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల - భారత బయోటెక్(ఉమ్మడిగా), తెలంగాణ నుంచి దర్శనం మొగిలయ్య-కళలు, రామచంద్రయ్య - కళలు, పద్మజా రెడ్డి - కళల రంగంలో పద్మ అవార్డులను సాధించారు.

ఆంధ్రా నుండి..

ఆంధ్రా నుండి..

ఆంధ్రప్రదేశ్ నుండి గరికపాటి నరసింహరావు - సాహిత్యం/విద్య, గోసవీడు షైక్ హుస్సేన్ - సాహిత్యం/విద్య, డాక్టర్ సుంకర వెంకట ఆది నారాయణ రావు - వైద్యరంగంలో పద్మ అవార్డులు దక్కాయి.

మొత్తం 128 మందికి..

మొత్తం 128 మందికి..

2022 సంవత్సరంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 128 మంది ప్రముఖులు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇందులో కొందరికి పద్మ శ్రీ అవార్డులు, మరికొందరికి పద్మ భూషణ్.. ఇంకా కొందరికి పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి.ఈ జాబితాలో నలుగురికి పద్మభూషణ్, 17 మందికి పద్మ భూషణ్ మరియు 107 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. వీరిలో 13 మందికి మరణానంతరం అవార్డులు దక్కడం విశేషం.

FAQ's
  • 2022 సంవత్సరంలో పద్మ అవార్డులు సాధించిన తెలుగు బిడ్డలెవరు?

    2022 సంవత్సరంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో ఏడుగురు తెలుగు వారు ఉండటం విశేషం. వారిలో నలుగురు వ్యక్తులు తెలంగాణ నుంచి ఉన్నారు.. మరో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ నుండి ఉన్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. క్రిష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల - భారత బయోటెక్(ఉమ్మడిగా), తెలంగాణ నుంచి దర్శనం మొగిలయ్య-కళలు, రామచంద్రయ్య - కళలు, పద్మజా రెడ్డి - కళలు, ఆంధ్రప్రదేశ్ నుండి గరికపాటి నరసింహరావు - సాహిత్యం/విద్య, గోసవీడు షైక్ హుస్సేన్ - సాహిత్యం/విద్య, డాక్టర్ సుంకర వెంకట ఆది నారాయణ రావు - వైద్య రంగం

  • 2022 సంవత్సరంలో పద్మ అవార్డులు ఎంతమందికొచ్చాయి?

    2022 సంవత్సరంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 128 మంది ప్రముఖులు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇందులో కొందరికి పద్మ శ్రీ అవార్డులు, మరికొందరికి పద్మ భూషణ్.. ఇంకా కొందరికి పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి.ఇందులో కొందరికి పద్మ శ్రీ అవార్డులు, మరికొందరికి పద్మ భూషణ్.. ఇంకా కొందరికి పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి. ఈ జాబితాలో నలుగురికి పద్మభూషణ్, 17 మందికి పద్మ భూషణ్ మరియు 107 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. వీరిలో 13 మందికి మరణానంతరం అవార్డులు దక్కడం విశేషం.

English summary

Padma Awards 2022: Full list of Padma Vibhushan, Padma Bhushan, Padma Shri recipients in Telugu

Highest Civilian Awards In The Country Padma Award 2022 Complete List in Telugu. Read on
Desktop Bottom Promotion