Latest Updates
-
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్
Hyderabadi Shaadi Ki Daawat: పక్కా హైదరాబాదీ పెళ్లి దావత్ తినాలనుందా? బిర్యానీ నుండి హలీమ్ వరకు ఎన్నో..
హైదరాబాదీ పెళ్లి దావత్ రుచులు చూడాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వారి కోసం ఓ పెళ్లి వేడుక సిద్ధమవుతోంది. ఇందులో పసందైన వంటకాలు ఉంటాయి. అన్నీ పక్కా హైదరాబాదీ స్టైల్ లో తయారు చేస్తారు. ఈ పెళ్లి మీరు, నేను అందరూ ఆహ్వానిత
పెళ్లి వేడుకల్లో వడ్డించే బగారా అన్నం, మటన్ కూర, చికెన్ కర్రీ అద్భుతమైన టేస్ట్ తో ఉంటాయి. చాలా మంది ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో మటన్, చికెన్, బగారా రైస్ తిన్నప్పటికీ పెళ్లి ఫంక్షన్ లో బగారా రైస్ లో మటన్ కూర తినడం కంటే చాలా మంది పడి చస్తారు. మటన్ ఒక్కటే కాదు.. వెజ్ ఫుడ్ ఐటెమ్స్ కూడా పెళ్లి వేడుకల్లో సూపర్ టేస్ట్ తో ఉంటాయి. హైదరాబాద్ గురించి చెప్పుకోవాల్సి వస్తే వేలాది హోటళ్లు, రెస్టారెంట్లు రకరకాల పసందైన వంటకాలను వడ్డిస్తాయి. అయినప్పటికీ పక్కా హైదరాబాదీ స్టైల్ లో జరిగే పెళ్లి వేడుకలో వంటకాలంటే చాలా మంది ఇష్టపడతారు.

హైదరాబాదీ పెళ్లి దావత్ రుచులు చూడాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వారి కోసం ఓ పెళ్లి వేడుక సిద్ధమవుతోంది. ఇందులో పసందైన వంటకాలు ఉంటాయి. అన్నీ పక్కా హైదరాబాదీ స్టైల్ లో తయారు చేస్తారు. ఈ పెళ్లి మీరు, నేను అందరూ ఆహ్వానితులే.

హైదరాబాదీ షాదీ కి దావత్ ఆలోచన ఎలా వచ్చిందంటే:
డాక్టర్ ఫుడీ అతడే డాక్టర్ అహ్మద్ అష్ఫాక్. తను వృత్తిరీత్యా ఆర్థోడాంటిస్ట్. తనకు ఫుడ్ పై ఉన్న ఇష్టమే తనను ఫుడ్ బ్లాగర్ గా మార్చింది. వివిధ హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లి అక్కడి ఫుడ్స్ పై రివ్యూ ఇస్తుంటాడు డాక్టర్ అహ్మద్. పక్కా హైదరాబాదీ స్లాంగ్ లో వివరిస్తూ ఉంటాడు. తనకు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అతడికి ఇన్ స్టాగ్రామ్ లో సుమారు 3 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
ఫుడ్ గురించి నోట్లో నీళ్లూరేలా చెప్పే అహ్మద్ అష్పాక్.. పెళ్లి విషయం వచ్చే సరికి అక్కడ దొరికే వివిధ రకాల వంటకాల గురించి చెబుతూ మైమరిచిపోతాడు. అతడి ఎక్స్‌ప్లైనే చేసే విధానం నచ్చి చాలా మంది హైదరాబాదీ షాదీ కి దావత్ టేస్టు చూడాలని చాలా మంది అడిగేవారంట. అలా వారి అభ్యర్థనల నుండి వచ్చిన ఆలోచనే 'హైదరాబాదీ షాదీ కి దావత్'.

అసలుసిసలైన హైదరాబాదీ పెళ్లి రుచులు తినిపించాలని:
తన ఫాలోవర్స్ నుండి వచ్చిన అభ్యర్థనలతో ఓ పెళ్లి వేడుక నిర్వహించాలని డాక్టర్ అహ్మద్ నిర్ణయించాడు. కానీ ఈ పెళ్లి వేడుక పక్కా హైదరాబాదీ సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది.
అయితే ఈ పెళ్లిలో వధూవరులు ఎవరూ ఉండరు. పెళ్లి తంతు ఏదీ జరగదు. కానీ పెళ్లిలో వడ్డించే వంటకాలు అన్నీ ఉంటాయి. వెల్‌కమ్ డ్రింక్స్, స్టార్టర్స్ నుండి పాన్ వరకు ప్రతి ఒక్కటీ టేస్టు చూడొచ్చు.
హైదరాబాదీ షాదీ కి దావత్ సమయం, స్థలం:
సమయం: రాత్రి 7 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు
స్థలం: కింగ్స్ ప్యాలెస్, గుడి మల్కాపూర్, హైదరాబాద్.
హైదరాబాదీ షాదీ కి దావత్ టికెట్ ధరలు:
వెజిటేరియన్ - రూ.999
నాన్ వెజ్ - రూ.1199
పిల్లలు(వెజ్/నాన్-వెజ్) - రూ.899
ఇక్కడి నుండి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. https://www.townscript.com/e/hyderabadi-shaadi-ki-dawat నుండి టికెట్లు పొందొచ్చు



Click it and Unblock the Notifications