For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Dilip Kumar:ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోయే దిగ్గజ నటుడు దిలీప్ కుమార్...

దిలీప్ కుమార్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఈ ప్రపంచంలో ఎంతోమంది హీరోలు ఉండొచ్చు. కానీ దిలీప్ కుమార్ మాత్రం హీరోలందరిలో స్ఫూర్తిని నింపే గొప్ప హీరో. అంతటి ప్రముఖ నటుడు దిలీప్ కుమార్(98) బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.

Interesting Facts About Dilip Kumar in Telugu

గత కొంత కాలం నుండి ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవలే చికిత్స నిమిత్తం ఆయన ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలోనే బుధవారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. దిలీప్ కుమార్ మరణ వార్తతో బాలీవుడ్ లో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు, సినీ తారలు ప్రగాడ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

పాక్ లో జననం..

బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ 1922 సంవత్సరంలో డిసెంబర్ 11వ తేదీన పాకిస్థాన్ లోని పెషావర్ లో జన్మించారు. ఆయన తండ్రి పండ్లు అమ్మేవారు. దీంతో దిలీప్ కుమార్ సినిమాల్లోకి అడుగు పెట్టకముందు తన తండ్రితో కలిసి పండ్లు అమ్మేవారు. అనంతరం నటుడిగా రాణించాలనే ఉద్దేశ్యంతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు.

Interesting Facts About Dilip Kumar in Telugu

ఎన్నో కష్టాలు..
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన దిలీప్ కుమార్ కు తొలి రోజుల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. అయితే ఆయన ఏ మాత్రం అధైర్యపడకుండా అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నారు. భారతదేశం గర్వించే నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వెండితెరపై హీరో ఎలా ఉండాలో చూపించిన మొట్టమొదటి భారతీయ కథానాయకుడు దిలీప్ కుమార్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. హీరోకు ఒక ప్రత్యేకమైన శైలిని స్రుష్టించిన మహానటుడు.. మొట్టమొదటి సినీ నక్షత్రం.. దిలీప్ కుమార్ అంటూ పలువురు తారలు కొనియాడారు.

తొలి చిత్రం..
1944లో విడుదలైన 'జ్వర్ భాతా'(Jwar Bhata) చిత్రంతో వెండితెరపై ప్రస్థానం మొదలు పెట్టారు. అప్పటి నుండి సుమారు 65 సినిమాల్లో నటించారు. ఈ సినిమాల్లోనే ఉత్తమ నటుడిగా ఎన్నో పర్యాయాలు ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. ఈయన సినీ రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 1994లో సినీ ప్రముఖులు ప్రతిష్టాత్మకంగా భావించే 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డుతో గౌరవించింది.

ప్రముఖుల సంతాపం..
సినీ పరిశ్రమలో లెజెండ్ గా దిలీప్ కుమార్ ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతారు. ఆయనలోని నటనా కౌశలం, తేజస్సు, ఎన్నో సంవత్సరాల పాటు ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసింది. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ప్రధాని మోడీతో పాటు పలువురు సినీతారలు సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేశారు.

English summary

Interesting Facts About Dilip Kumar in Telugu

Here we are talking about the interesting facts about the dilip kumar in Telugu. Read on
Story first published:Wednesday, July 7, 2021, 11:15 [IST]
Desktop Bottom Promotion