Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
International Day of Happiness 2022: సంతోషమే సగం బలం.. ఆందోళనలను అధిగమిద్దాం..
ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే తేదీ, థీమ్, మెసెజ్ మరియు ఎందుకని హ్యాపీ దినోత్సవాన్ని జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
International Day of Happiness 2022:ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే సంతోషమే సగం బలం. హ్యాపీనెస్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కీలకం.

ఎవరికి ఎన్ని సమస్యలు ఉన్నా.. ఎంత ఒత్తిడి ఉన్నా.. వాటినన్నంటనీ మరచిపోయి ఆనందంగా జీవించాలని అంటూ ఉంటారు పెద్దలు. ఎందుకంటే ఆనందంగా ఉంటే.. ఎలాంటి రోగం మన దరి చేరదట. హ్యాపీగా ఉంటే ఎలాంటి రోగాల నుండైనా సులభంగా బయటపడొచ్చట. అందుకే ఎలాంటి సమస్య వచ్చినా.. వాటిని అధిగమించి.. హాయిగా, ఆనందంగా గడిపేందుకు ప్రయత్నించండి.

అప్పుడే మీరు చాలా చురుగ్గా ఉంటారు. మీరు చేయాల్సిన పనులపైనా ఎక్కువ ఫోకస్ పెడతారు. అలాగే నవ్వుతూ ఉండండి. ఎందుకంటే మీరు మనస్ఫూర్తిగా నవ్వితే.. మీకు కచ్చితంగా ధైర్యం వస్తుంది. ప్రస్తుత బిజీ లైఫ్ లో చాలా మంది హ్యాపీగా గడపలేకపోతున్నారు. ఉద్యోగం, విద్య, ఆర్థిక, కుటుంబ సమస్యల కారణంగా చాలా మంది ఆనందంగా గడపలేకపోతున్నారు. వేగంగా పరుగెత్తే కాలంతో తాము కూడా పరుగులు తీస్తున్నారు. అందుకే మనిషి మరిచిపోతున్న సంతోషాన్ని.. దాని వల్ల ఉండే ప్రయోజనాలను కలిగే ప్రయోజనాలను తెలిపేందుకు ప్రతి ఏటా 'హ్యాపీనెస్ డే' జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే ఎప్పుడొచ్చింది? దీని ప్రాముఖ్యత ఏంటనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సంతోషం ప్రాముఖ్యత..
సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కో విషయంలో ఆనందాన్ని వెతుక్కుంటారు. అందరూ ఆనందంగా గడపాలని ఐక్యరాజ్య సమితి(UNO) భావించింది. సంతోషం ప్రాముఖ్యతను యావత్ ప్రపంచానికి తెలియజేస్తూ.. ప్రతి ఏటా మార్చి 20వ తేదీన ‘అంతర్జాతీయ సంతోష దినోత్సవం'గా జరుపుకోవాలని నిర్ణయించింది.

సంతోష దినోత్సవం..
యావత్ ప్రపంచంలో ఉన్న అతి పెద్ద సమస్యలు ఆకలి, చదువు లేకపోవడం, అవగాహన లేకపోవడం, మానవ హక్కుల ఉల్లంఘన వంటివి అంతం చేయడానికి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ఎప్పటి నుంచి..
ఈ సంతోష దినోత్సవ తీర్మానానికి 2012 జులై 21వ తేదీన ఆమోదం లభించింది. ఈ తీర్మానాన్ని తొలిసారిగా భూటాన్ ప్రతిపాదించడం విశేషం. అనంతరం 2013వ సంవత్సరం నుండి ఐక్యరాజ్య సమితి ఆనందం ప్రాముఖ్యతను తెలియజేశారు. జాతీయ ఆదాయం కంటే జాతీయ ఆనందం ముఖ్యమని భూటాన్ ప్రతిపాదించడం విశేషం. దీంతో సంతోషం యొక్క ప్రాధాన్యత ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.

2022 హ్యాపీనెస్ థీమ్..
హ్యాపీనెస్ డే 2022 యొక్క థీమ్ ‘ప్రశాంతంగా ఉండండి.. తెలివిగా జీవించండి.. మరియు దయతో ఉండండి'. ‘అంతర్జాతీయ సంతోష దినోత్సవం' సందర్భంగా.. సద్గురు చెప్పిన కొన్ని సూక్తులను పాటించండి.
* మీరు హ్యాపీగా ఉంటే, సంత్రుప్తి కోసం వెతకరు.
* మీకు ఈ ప్రపంచం పట్ల ఏ మాత్రం బాధ్యత ఉన్నా.. మీరు చేయాల్సిన మొట్టమొదటి పని మిమ్మల్ని మీరు హ్యాపీగా గడిపేలా చేసుకోవడం.
* మనలో చాలా మంది హ్యాపీగా ఉండకపోవడానికి ప్రధాన కారణం, దానికి కావాల్సిన పరిజ్ణానం వారి వద్ద లేకపోవడమే.
* పరిజ్ఞానం పొందాలి, సంతోషంగా ఉండాలి. అది నేర్చుకోవాలి.



Click it and Unblock the Notifications