For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

International Men’s Day 2021 : ప్రతి మగాడికి ఓ రోజు వస్తుంది.. అదెప్పుడో తెలుసా...

అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం...

|

ఒక నాన్నగా.. అన్నగా.. తమ్ముడిగా.. కొడుకుగా.. భర్తగా ఇలా ఆడవారి జీవితంలో అనేక రకాల బంధాలో మగమహారాజులందరూ నిత్యం ఒక భాగంగా ఉంటారు. అయితే ఎప్పుడూ తమ బాధ్యతను చక్కగా నెరవేర్చేవారందరి కోసం ఓ రోజు ఉందని తెలుసా.. అదేనండి 'అంతర్జాతీయ పురుషుల దినోత్సవం'.

International Men’s Day 2020: History, Theme And Significance in telugu

మగవారందరూ గర్వంగా చెప్పుకునే రోజు ఏదైనా ఉందంటే నవంబర్ 19వ తేదీ అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజున చాలా మంది మగాళ్లకు ఓ గుర్తింపు వచ్చింది.

International Men’s Day 2020: History, Theme And Significance in telugu

మన సమాజంలో బంధాలను, బాధ్యతలను తమ రెండు భుజాలపై మోస్తూ.. ఎన్నో భారాలను తమ రెక్కలకష్టంపై మోస్తున్న మగాళ్లందరికీ 'అంతర్జాతీయ పురుషుల దినోత్సవం' శుభాకాంక్షలు. ఇంతకీ ఈరోజు పురుషుల కోసం ఎందుకు కేటాయించారు.. దీని వెనుక గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

1999లో తొలిసారిగా..

1999లో తొలిసారిగా..

నవంబర్ 19వ తేదీ వచ్చిందంటే చాలు.. చాలా మంది మగాళ్లు తెగ ఆనందపడతారు. ప్రస్తుతం సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఈరోజున మగాళ్లలో ఎక్కువ మంది తమ స్టేటస్ గా పెట్టుకుని ఆనందపడుతుంటారు. అయితే ఈ దినోత్సవాన్ని తొలిసారిగా ఐక్యరాజ్య సమితి 1999లో అధికారికంగా ప్రకటించింది.

అలా మొదలైన వేడుకలు..

అలా మొదలైన వేడుకలు..

పురుషులకు సంబంధించిన ఆరోగ్యం మరియు ఇతర సమస్యలను హైలెట్ చేయడానికి ఈరోజును సెలబ్రేట్ చేసుకుంటారు. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఐక్యరాజ్యసమితి తొలిసారిగా 1999లో నవంబర్ 19వ తేదీన పురుషుల దినోత్సవానికి ఆమోదం తెలిపింది.

సానుకూల మార్పులు..

సానుకూల మార్పులు..

మన సమాజంలో పురుషుల విజయాలు మరియు సహకారాన్ని పంచుకోవడానికి ఈరోజును జరుపుకుంటారు. మగవారి గురించి మాట్లాడేటప్పుడు కుటుంబం, దేశం, వివాహం, సమాజంలో సానుకూల మార్పులను తీసుకురావడంలో పురుషులు పోషించిన పాత్రను హైలెట్ చేయడం.

చరిత్రను పరిశీలిస్తే..

చరిత్రను పరిశీలిస్తే..

ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ఫిబ్రవరి 7, 1992న థామస్ ఓస్టర్ పాటించారు. అయితే ఈరోజును జరుపుకోవాలనే ఒక సంవత్సరం ముందు ఉనికిలోకి వచ్చింది. అంతకుముందు 1960లో ఫిబ్రవరి 23వ తేదీని అంతర్జాతీయ పురుషుల దినోత్సవంగా జరుపుకోవాలని కొందరు పురుషులు ఆందోళన చేశారంట. దీనికి కారణం మార్చి 8వ తేదీకి సమానమైన రోజు అవసరమని భావించారట. అయితే ఫిబ్రవరి 23న చారిత్రకంగా ప్రాముఖ్యత ఉన్న రోజు కాబట్టి, ఈరోజును నవంబర్ 19వ తేదీకి మార్చారట.

మన దేశంలో..

మన దేశంలో..

ఈ మగవారి వేడుకను మన భారతదేశంలో 2007, నవంబర్ 19 నుండి వేడుకగా జరుపుకోవడం ప్రారంభించారు. అప్పటి నుండి ప్రతి ఏడాది ఈరోజును ఘనంగా జరుపుకుంటారు. ఈరోజును పురుషుల అనారోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించడం. లింగ వివక్ష లేని సమాజాన్ని సాధించడమే లక్ష్యం.

పురుషుల ప్రాముఖ్యత..

పురుషుల ప్రాముఖ్యత..

  • అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా సమాజంలో మగవారు పోషించిన పాత్రను హైలెట్ చేయడం.
  • ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పురుషులందరికీ మాత్రమే అంకితం చేయబడింది.
  • ఈరోజును పాటించడానికి అనేక కార్యక్రమాలు మరియు విధులు నిర్వహించబడతాయి.
  • లింగ సంబంధాలను మెరుగుపరచడానికి మరియు లింగ సమానత్వం సాధించడమే ఈరోజు ఉద్దేశం.
  • ప్రపంచవ్యాప్తంగా లింగ అంతరాన్ని తగ్గించడానికి కూడా ఇది దోహదపడుతుంది.
  • అనేక రకాల ఎన్జీఓలు మరియు ప్రైవేట్ సంస్థలు లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడటానికి ప్రజలు తమ గొంతును పెంచాలని విజ్ణప్తి చేస్తున్నాయి.

English summary

International Men’s Day: History, Theme And Significance in telugu

International Men’s Day is an annual observance celebrated on 19 November every year. The theme for International Men’s Day 2020 is ‘Better Health For Men And Boys’. Today we are here to tell you more about this day. Read on.
Desktop Bottom Promotion