For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

International Tiger Day:పులి మన జాతీయ జంతువు ఎందుకయ్యిందో తెలుసా...

|

ప్రతి సంవత్సరం జులై 29వ తేదీన అంతర్జాతీయ పులుల దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజున పులులు మరియు వాటి సహజ ఆవాసాల పరిరక్షణకు, పులుల సంఖ్యను పెంచేందుకు, విద్యార్థుల్లో, ప్రజలందరిలో పులుల గురించి అవగాహన కల్పిచేందుకు ఈ ఇంటర్నేషనల్ టైగర్ డే జరుపుతున్నారు.

పర్యావరణం బ్యాలెన్స్ గా ఉండాలంటే.. మానవాళితో పాటు జంతువుల ఆవాసానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు వీటికి లెక్కలు వేసి, అవసరమైన చోట ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తుంటాయి.

ఇటీవల గణాంకాలను పరిశీలిస్తే పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కానీ వాటి సంఖ్య చాలా తక్కువేనని చెప్పొచ్చు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ టైగర్ డే చరిత్ర, ప్రాముఖ్యత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం....

నిద్రలో నుండి గతంలోకెళ్లిన వ్యక్తి... ఏకంగా 21 ఏళ్లు వెనక్కి... మళ్లీ మెమొరీ గుర్తొచ్చిందా లేదా..?నిద్రలో నుండి గతంలోకెళ్లిన వ్యక్తి... ఏకంగా 21 ఏళ్లు వెనక్కి... మళ్లీ మెమొరీ గుర్తొచ్చిందా లేదా..?

పులుల చరిత్ర..

పులుల చరిత్ర..

అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని గ్లోబల్ టైగర్ డే అని కూడా పిలుస్తారు. 2010 సంవత్సరంలో రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ టైగర్ సమ్మిట్ లో గంభీరమైన జీవులపై అవగాహన కల్పించడానికి దోహదపడిన రోజు. 2022 సంవత్సరం నాటికి ఆయా దేశాల్లో పులుల సంఖ్య రెట్టింపు చేయాలని నిర్ణయించాయి. అడవి పులుల సంఖ్య విపరీతంగా తగ్గుముఖం పడుతూ ఉండటంతో.. 1970 సంవత్సరం నుండి పులులను సంరక్షించే ప్రయత్నాలు ఉన్నప్పటికీ, పులుల సంఖ్య వేగంగా తగ్గింది. ఈ నేపథ్యంలో 13 వేర్వేరు దేశాల ప్రభుత్వాలు 2022 నాటికి పులుల సంఖ్యను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీనిని టిక్స్-2 లక్ష్యం అని కూడా పిలుస్తారు.

పులుల ప్రాముఖ్యత..

పులుల ప్రాముఖ్యత..

పులుల సంఖ్య తగ్గడానికి వివిధ కారణాలను మనం గమనించొచ్చు. పులులను అక్రమంగా వేటాడటం, వాటి చర్మం, గోర్లతో అక్రమ వ్యాపారం వంటివి చేయడం వల్ల వాటి ఆవాసాలు కోల్పోతున్నాం. వాతావరణ మార్పులు మనిషి-జంతు సంరక్షణ, పర్యాటకం పెరగడం, పులుల పరిరక్షణకు నిధుల కొరత వంటివి పులుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణాలని చెప్పొచ్చు. అందుకే పులుల సంఖ్యను పెంచేందుకు, వాటి స్థిరమైన పరిరక్షణ స్థాపనకు క్షీణతకు కారణమయ్యే పరిస్థితులను పరిశీలించడానికి అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.

వన్యప్రాణుల సంరక్షణ..

వన్యప్రాణుల సంరక్షణ..

వన్యప్రాణుల సంరక్షణ అనేది మనందరిది. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫౌండేషన్(WWF) ప్రకారం 2020 నాటికి ప్రపంచంలో ఉన్నది కేవలం 3,900 పులులే. వాటిలో సుమారు 70 శాతం మన భారతదేశంలోనే ఉన్నాయి. మరో మంచి విషయమేమిటంటే.. ఇండియా, నేపాల్, చైనా, భూటాన్, రష్యాలో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయినా కూడా వాటి సంఖ్య చాలా తక్కువనే చెప్పొచ్చు.

International Friendship Day 2021: నిజమైన స్నేహితులు తోడుంటే.. ప్రపంచాన్నే జయించొచ్చు...!International Friendship Day 2021: నిజమైన స్నేహితులు తోడుంటే.. ప్రపంచాన్నే జయించొచ్చు...!

జాతీయ జంతువు పులి..

జాతీయ జంతువు పులి..

మన దేశ జాతీయ జంతువు పులి.. రాచఠీవికి పెట్టింది పేరు. పులి అనేది ఎప్పుడూ శత్రువు ముందు తల వంచదు. దాని అడుగులు ఎల్లప్పుడూ ముందుకు పడతాయే తప్ప.. వెనక్కి వెళ్లవు. అది ప్రాణాలను లెక్క చేయదు. అందుకే అడవుల్లో పులి స్థానం సుస్థిరం. పులులు పుట్టాక.. అవి ఎక్కువ కాలం తమ తల్లిదండ్రులపై ఆధారపడవు. తమ కాళ్లపై తాము నిలబడటానికి ఇష్టపడతాయి. రెండేళ్లు కాగానే అవి విడిగా వెళ్లిపోతాయి. మగ పులులకు సెక్సువల్ మెచ్యూరిటీ వస్తుంది. ఆడపులులకు నాలుగేళ్ల తర్వాత అది వస్తుంది. బాగా పెరిగిన పులి ఒక్కొక్కటి 140 నుండి 300 కిలోల బరువు ఉంటుంది. ఆడపులి ఒకేసారి 35 కిలోల ఆహారాన్ని తినగలదు.

20 ఏళ్ల వరకు..

20 ఏళ్ల వరకు..

పులులు పుట్టినప్పటి నుండి 15 నుండి 20 సంవత్సరాలు జీవిస్తాయి. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. పులులు పుట్టిన సమయంలో వాటికి కళ్లు కనబడవట. తమ తల్లి నుండి వచ్చే వాసనను బట్టి తల్లిని ఫాలో అవుతాయి. పులి పిల్లల్లో సగం ఆకలితో చనిపోతాయట. లేదా చలికి తట్టుకోలేక చనిపోతాయి. పుట్టిన రెండేళ్లలో ఇలా చాలా పిల్లలు చనిపోతాయి. WWF లెక్కల ప్రకారం.. చాలా పులులు పిల్లలుగా ఉన్నప్పుడే చనిపోతున్నాయి. పులులు గంటకు 65 కిలోమీటర్లు వేగంతో పరుగెత్తుతాయి. అంతేకాదు రాత్రి వేళ మనుషుల కంటే పులులు ఆరు రెట్లు బాగా చూడగలవు. అవి పగటి వేళ కంటే రాత్రి వేళ బాగా వేటాడగలవు. అలాగని పగటి పూట వేటను మిస్ చేసుకోవు.

ఒకేరకమైన చారలుండవు..

ఒకేరకమైన చారలుండవు..

ప్రతి ఒక్క పులికి చారలు అనేవి వేర్వేరుగా ఉంటాయి. మనషుల్లో ఏ రకంగా ఇద్దరికీ వేలి ముద్రలు అనేవి వేర్వురుగా ఉండవో.. అలాగే ఏ రెండు పులులకు కూడా ఒకేరకమైన చారలు ఉండవట. టైగర్లు అందరి కంటే వేగంగా ఈత కొట్టగలవు. ఆహారం కోసం ఎంత దూరమైనా ఈదుకుంటూ వెళ్తాయట. బెంగాల్ సుందర్ బన్స్ అడవుల్లో చాలా పులులు.. ఈదుతూ వెళ్లడాన్ని పర్యాటకులు చూసి ఆనందిస్తుంటారు. అంతేకాదు పులులకు నీటిలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టమట. పులి ఉమ్ములో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయట. అందుకే పులులకు గాయాలైనప్పుడు అవి తమ నాలుకతో గాయాన్ని రుద్దుకుంటాయి. దానివల్లే ఆ గాయం మానిపోతుందట.

English summary

International Tiger Day: Theme 2021, History, Quotes & Slogans in Telugu

International Tiger Day is observed on 29 July, every year. The day is celebrated to raise awareness of the conservation and protection of tigers and their natural habitats
Story first published: Thursday, July 29, 2021, 9:46 [IST]