Just In
- 3 hrs ago
Oral Health:మీ అందాన్ని పాడుచేసే దంతాలపై టీ మరకలను వదిలించుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు...
- 4 hrs ago
Venus Transit In Aries: మేషరాశిలోకి శుక్రుడి ఎంట్రీతో ఈ 5 రాశులకు లాభమంట...!
- 4 hrs ago
కవల పిల్లలు పుట్టడానికి అవకాశాలు ఏంటో మీకు తెలుసా?
- 5 hrs ago
Ugadi Rasi Phalalu 2021: కొత్త ఏడాదిలో కర్కాటక రాశి వారి జాతకం ఎలా ఉంటుందంటే...!
Don't Miss
- News
షర్మిల ఎప్పటికీ ఆంధ్రావాదే... ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తెలంగాణ జనం సహించరు... టీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్..
- Movies
వకీల్ సాబ్‌కు హైకోర్టులో చుక్కెదురు.. ఏపీ ప్రభుత్వానికి ఊరట.. టిక్కెట్ ధరల పెంపుపై సంచలన ఆదేశాలు
- Finance
జాక్ మా కు చైనా మరో షాక్ .. గుత్తాధిపత్య ఆరోపణలపై అలీబాబాకు 2.78 బిలియన్ డాలర్ల జరిమానా
- Sports
CSK vs DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. స్మిత్‌కు షాక్! క్రిస్ వోక్స్, టామ్ కరన్ ఆగయా!
- Automobiles
బెంట్లీ కార్స్ మాత్రమే కాదు, ఇక బెంట్లీ లగ్జరీ అపార్ట్మెంట్స్ కూడా..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఉమెన్స్ డే 2021 : ఈ భూమి మీద అత్యంత శక్తిమంతురాలు ‘ఆమె‘నే.. ఆమె తర్వాతే ఎవరైనా...
మహిళల్లో ఎంతో శక్తి దాగి ఉంది. వారు ఎంతటి శక్తిమంతులో తెలుసుకోవడానికి చరిత్రను ఓసారి తిరగేసి చూడండి. ఎంతో మంది మహిళలు ధైర్యసాహసాలకు ప్రతిరూపాలుగా కూడా నిలిచారు. రాణి రుద్రమదేవి నుండి కిరణ్ బేడీ వరకు ఎందరో శక్తిమంతమైన మహిళలు మనకు నాటి నుండి నేటి వరకు చాలా మందే కనిపిస్తారు.
అంతవరకు ఎందుకు మహిళల శక్తి గురించి తెలుసుకోవాలంటే చరిత్రనే తిరగేసి చూడాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్న ఆడవాళ్లని చూస్తే చాలు. అటు ఇంటిని.. ఇటు ఆఫీసుని.. పిల్లల బాధ్యతను ఒంటిచేత్తో మ్యానేజ్ చేస్తుంటారు. అసలు ఇన్ని పనులు చేయాలంటే చాలా సామర్థ్యం ఉండాలి. ఎంతో శక్తిమంతులై ఉండాలి. అలాంటి మహిళలందరికీ మనం ఒక్కసారైనా అభినందించాల్సిందే. అందుకోసమే వారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనే ఒక ప్రత్యేక రోజు కూడా ఉంది. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 'ఆమె'కు మనసారా శుభాకాంక్షలు తెలపండి...
ఉమెన్స్ డే స్పెషల్ : ఇండియన్ ఆర్మీలో ఉమెన్స్ జర్నీకి నాంది పలికిందెవరో తెలుసా...

ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని..
మన దేశంలోనూ ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. వారు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తున్నారు. అయితే ఇప్పటికీ మహిళలు ప్రయాణం విషయంలో మాత్రం చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. స్వతంత్య్రంగా వ్యవహరిస్తోన్న మహిళలను చూసి అపహాస్యం చేస్తున్నారు. అవహేళన కూడా చేస్తున్నారు. అలాంటి అవాంతరాలన్నింటినీ ఎదుర్కొని తన గమ్యాన్ని చేరుకుంటోంది మహిళ.

ఏదైనా సాధించగలరు...
మహిళలు తలచుకుంటే ఏ పని అయినా అవలీలగా సాధించగలరు. ఎందుకంటే వారికి ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎంతటి క్లిష్టమైన పరిస్థితి ఎదురైనా వారి గుండె చాలా నిబ్బరంతో ఉంటారు. అయితే వారు సున్నితమైన మనసు కలవారు అని కూడా మనం గుర్తించాలి. ఎందుకంటే ఆమె లేనిదే ఈ జీవితమే లేదు.

మహిళ శక్తిని తెలుసుకోవాలంటే..
మహిళల శక్తిని తెలుసుకోవాలంటే మనం ఎక్కడెక్కడో పరిశోధన చేయాల్సిన అవసరం లేదు. పుస్తకాలు చదవాల్సిన అవసరం అసలే రాదు. మీరు మీ ఇంట్లో అమ్మను గమనిస్తే చాలు. ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇంటిని ఎలా చక్కబెట్టుకోవాలో ఆమెకు బాగా తెలుస్తుంది.
'దేన్నైనా పుట్టించే శక్తి ఆడవారికే ఉంది'... మరి అలాంటోల్లే లేకపోతే...?

ఇంటిల్లిపాదికి అవసరమైనవన్నీ...
ఆమె ఏ సమయానికి ఏ పని చేయాలో అదే చేస్తుంది. ఎవరికి ఏమి అందించాలో అదే అందిస్తుంది. ఇంటిల్లిపాదికీ అవసరమైనవన్నీ తనే దగ్గరుండి చూసుకుంటుంది. ఇంట్లో ఏమున్నాయో.. ఏమి లేవో ఆమెకు తెలిసినంతలా ఇంకెవరికీ తెలియదంటే ఎలాంటి అతిశయోక్తి కాదు. అయినా కూడా చాలా మంది ఆమెను ఇప్పటికీ కొంతమంది చులకనగా చూస్తారు. ఆమె శ్రమను తక్కువ చేసి మాట్లాడతారు.

నేటి తరం మహిళలు..
ఇక నేటి తరం మహిళలైతే ఇటు ఇంటిని.. అటు ఆఫీసు బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఎందుకంటే వారు ప్రతి పనినీ చాలా బాధ్యతాయుతంగా పూర్తి చేస్తారు. ప్రతి పనిని ప్రేమగా చేస్తారు. వీరు ఆర్థిక పరంగా కూడా ముందుచూపుతో ఉంటారు.

ఇప్పటికి చిన్నచూపే..!
21వ శతాబ్దంలోనూ కొన్నిచోట్ల ప్రతి విషయంలోనూ మహిళలను చిన్నచూపు చూస్తున్నారు. మహిళలకు సరైన ప్రోత్సాహం లేక వారి శక్తి సామర్థ్యాలు నిరుపయోగంగా మారిపోతున్నాయి. ఇప్పటికైనా వారి ప్రతిభను గుర్తించి వారికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తే.. మరింత ప్రగతిని సాధిస్తారు. సాధికారత దిశగా వడివడిగా అడుగులేస్తారు.

ఉప్పెనలా దూసుకెళ్తూ..
నేటి సమాజంలో అంతా ఆధునికమని చెబుతున్నప్పటికీ, ఒక మహిళ తన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏటికీ ఎదురీదాల్సిందే. ఆమె ప్రయాణంలో శారీరకంగా, మానసికంగా, లైంగికంగా ఎదురయ్యే వేధింపులు మానసికంగా మహిళలను కుంగిపోయేలా చేస్తాయి. అయితే వాటన్నింటినీ ఎదుర్కోవడానికి ఎప్పటికప్పుడు ధైర్యాన్ని, శక్తిని కూడదీసుకొని ముందుకు దూసుకెళ్తూ ఉంటారు.

తన రక్తమాంసాలతోనే..
ఆమె రక్తమాంసాలతోనే ఈ ప్రపంచం అంతా నడుస్తోంది. ఇక ముందు కూడా నడుస్తుంది. అలాంటి ఆడవారిని అవమానించడం అంటే మిమ్మల్ని మీరు అవమానించుకోవడమే. మీకు జన్మనిచ్చిన తల్లిని కూడా అవమానించేనట్లే అని గ్రహించాలి.