Latest Updates
-
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్
International Women's Day 2023:మార్చి 8నే మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2023 సందర్భంగా, మార్చి 8నే ఉమెన్స్ డే ఎందుకని జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
జీవితంలో అన్ని రంగాల్లో మహిళలు సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, సామాజిక పరంగా ఇంకా అనేక రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు, వారి హక్కుల గురించి అవగాహన కల్పించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు.

అయితే ఇప్పటికీ అంతర్జాతీయంగా మహిళలు ఇప్పటికీ కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా మహిళ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు. 2023లో ఉమెన్స్ డే థీమ్ ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

2023లో ఉమెన్స్ డే థీమ్..
It will emphasize psychosocial well-being and aims at improving the mental health of women in India. On 3rd March 2023, the theme for the celebration is "Women of Tomorrow",
ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా మార్చి 8వ తేదీన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుకుంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల మానసిక, సామాజిక, ఆరోగ్య శ్రేయస్సును లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో 2023 మార్చిలో ఉమెన్స్ డే థీమ్ ‘‘రేపటి మహిళలు''. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా మహిళల విజయాలను గౌరవించడానికి అంకితం చేసిన రోజే ఉమెన్స్ డే.

మహిళా దినోత్సవ చరిత్ర..
అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి వందేళ్లు దాటినా గొప్ప చరిత్ర ఉంది. 1908 సంవత్సరంలో మహిళలకు తక్కువ పని గంటలు, మెరుగైన ప్యాకేజీ, ఓటు హక్కు కోసం న్యూయార్క్ నగరంలో 15 వేల మంది మహిళలు భారీ ప్రదర్శన చేశారు. మహిళల ఈ డిమాండ్లను అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. 1910 సంవత్సరంలో సోషలిస్ట్ ఇంటర్నేషనల్ యొక్క కోపెన్ హాగన్ సమావేశంలో మహిళా దినోత్సవానికి అంతర్జాతీయ హోదా ఇచ్చారు. ఆ సమయంలో మహిళలందరికీ ఓటు హక్కు కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం.

తొలిసారిగా మహిళా దినోత్సవం..
నిజానికి, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మొట్టమొదటి సారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో నిర్వహించారు. 1913లో రష్యాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజును అధికారిక సెలవు రోజుగా ప్రకటించారు. మరోవైపు 1917 యుద్ధం వేళ రష్యాలోని మహిళలు ఆహారం-శాంతి కోసం డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. నాలుగు రోజుల తర్వాత అప్పటి రష్యా రాజు నికోలస్ జార్ సింహాసనాన్ని వీడారు. అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది.

మార్చి 8న..
మహిళలు సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం, ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం. కానీ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అది మార్చి 8వ తేదీన వచ్చింది. అందుకే ప్రతి ఏటా మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే 1975వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అధికారికంగా గుర్తించింది.

అడ్డంకులను అధిగమించడం..
స్త్రీ, పురుషులకు సమాన హక్కుల కోసం పోరాడే వారికి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం చక్కని వేదిక అని చెప్పొచ్చు. ఈరోజున మహిళలు తమ హక్కుల కోసం ఎంతలా పోరాటం చేశారో.. వారికి ఇంకా అవసరమైన వాటి కోసం గళమెత్తడం, అడ్డంకులను అధిగమించడం, ఒక శతాబ్దానికి పైగా చరిత్రలో వీరికి పెరుగుతున్న బలాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..
ఈ లోకంలో స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. మరి.. మనల్ని కంటిపాపలా కాపాడే 'స్త్రీమూర్తి'ని స్మరించుకోవడం మన అందరి బాధ్యత. తల్లిగా లాలిస్తూ.. చెల్లిగా తోడుంటూ.. భార్యగా బాగోగులు చూస్తూ.. సేవకురాలిలా పనిచేస్తూ.. కుటుంబ భారాన్ని మోస్తూ... సర్వం త్యాగం చేస్తుంది మహిళ. అంతటి గొప్ప మహిళకు మనసారా ధన్యవాదాలు చెప్పుకునే సమయం ఇదే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 'ఆమె'కు చక్కని బహుమతి అందించడమే కాకుండా.. మనసారా శుభాకాంక్షలు తెలియజేయండి.



Click it and Unblock the Notifications
