For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

International Yoga Day 2021: యోగాను ప్రపంచానికి పరిచయం చేసిందెవరో తెలుసా...

|

2015 సంవత్సరం జూన్ 21వ తేదీ నుండి ప్రతి ఏటా మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. యోగా వల్ల మానవుల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి..

యోగా ప్రాముఖ్యత ఏంటో అవగాహన కలిపిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 11వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించగా..

భారత ప్రధాని నరేంద్ర మోడీ 2014లో మళ్లీ దీన్ని జూన్ 21వ తేదీకి మార్చమని కోరగా.. 2015 నుండి జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే మార్చారు. ఈ సందర్భంగా 2021లో యోగా డే థీమ్ ఏంటి? యోగా చరిత్ర ఏంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

International Yoga Day 2021 : యోగా ఎప్పుడు, ఎక్కడ పుట్టింది... యోగా వల్ల ఎన్ని లాభాలో తెలుసా...International Yoga Day 2021 : యోగా ఎప్పుడు, ఎక్కడ పుట్టింది... యోగా వల్ల ఎన్ని లాభాలో తెలుసా...

ఇంట్లోనే యోగా..

ఇంట్లోనే యోగా..

ఇంటర్నేషనల్ యోగా డే 2021 థీమ్ ఏంటంటే.. "Yoga at home and Yoga with Family" ఇంట్లోనే యోగా చేయండి.. కుటుంబంతో కలిసి చేయండి.. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారితో ఇబ్బంది పడుతోందని మనందరికీ తెలుసు. చాలా దేశాల్లో లాక్ డౌన్ కూడా విధించారు. ఇలాంటి పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో యోగా నిర్వహించడం కష్టం లేదా అసాధ్యమే.

యోగా నేపథ్యం..

యోగా నేపథ్యం..

యోగా విషయానికొస్తే.. ఇది సుమారు 6 వేల సంవత్సరాల క్రితమే మన దేశంలో ఇది పరిచయం చేయబడింది. పూర్వీకుల మానసిక మరియు ఆధ్యాత్మిక సాధన భారతదేశంలో ఉద్భవించి హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం సహా అనేక మతాలలో యోగా బాగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇది కాలంతో పాటు మారుతూ వచ్చింది. క్రీ.శ.19వ శతాబ్దంలో బాగా ప్రాచుర్యం పొందింది. పాశ్చాత్య వలసవాదులు యోగా ఎక్కువ ఆసక్తి చూపారు. ఐరోపాలోనూ దీన్ని బాగా ప్రోత్సహించారు. స్వామి వివేకానందుడు యూరప్ మరియు అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు యోగా పాఠాలు నేర్పి, అందరి చేత ప్రశంసలు అందుకున్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం..

అంతర్జాతీయ యోగా దినోత్సవం..

ప్రస్తుత భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2014, సెప్టెంబర్ 27వ తేదీన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి హాజరైనప్పుడు, యోగా యొక్క ప్రాముఖ్యతను, భారతీయ నాగరికత యొక్క విలువైన ఆస్తిగా మరియు ఆనందకరమైన అభ్యాసంగా గుర్తించాలని, ప్రపంచానికి దీని గురించి తెలియజేసి, మానవ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని, మానవ మనసులను శాంతితో సుసంపన్నం చేయాలని కోరారు. ఇది వ్యాయామం కాదు.. మనం మన ప్రపంచం ప్రక్రుతితో ఏకత్వం యొక్క భావాన్ని కనుగొనడం, మన జీవనశైలిని మార్చడం ద్వారా, చైతన్యాన్ని మేల్కొలపడం ద్వారా, అది మనకు సహాయపడుతుందని చెప్పారు.

Anushka Sharma Shirshasana : ప్రెగ్నెన్సీలో ఉండే వారికి ‘శీర్షాసనం'వల్ల ఎలాంటి ప్రయోజనాలంటే...Anushka Sharma Shirshasana : ప్రెగ్నెన్సీలో ఉండే వారికి ‘శీర్షాసనం'వల్ల ఎలాంటి ప్రయోజనాలంటే...

ఐరాస తీర్మానం..

ఐరాస తీర్మానం..

ఐక్య రాజ్య సమితిలో భారత దేశ మాజీ దౌత్యవేత్త మరియు రచయిత అసోక్ ముఖర్జీ 2014 డిసెంబర్ 11వ తేదీన యుఎన్ జిఎలో ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఐక్యరాజ్య సమితికి భారత దేశం నుండి శాశ్వత ప్రతినిధిగా ఉన్నారు. ఈ ముసాయిదా తీర్మానం 177 సభ్య దేశాల మద్దతును పొందింది. యోగా యొక్క చరిత్రను గుర్తించింది. అదే రోజు A/Res/69/131 తీర్మానాన్ని ఆమోదించింది. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది.

యోగా వేడుకలు..

యోగా వేడుకలు..

అంతర్జాతీయ యోగా దినోత్సవం అంటే సెలవు రోజు కాదు. ఈరోజున ప్రజలకు యోగా గురించి అవగాహన కల్పించే రోజు. ఈరోజున యోగా శిక్షణలో పాల్గొనడమే కాదు.. అందరికీ అవగాహన కల్పించేందుకు క్రుషి చేస్తారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు మరియు ఎన్జీఓల అవగాహన సమ్మేళనాలను ఏర్పాటు చేస్తాయి. యోగా క్లాసులు ఏర్పాటు చేయడం ద్వారా ఈరోజును ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ప్రత్యేక ఆసక్తి చూపుతుంది.

యోగా ఎప్పుడు చేయాలి..

యోగా ఎప్పుడు చేయాలి..

యోగా అనేది ఒక వ్యాయామం కాదు. అది ఒక జీవనశైలి. కాబట్టి దీన్ని రోజులో కేవలం ఒక సమయంలో చేయాలన్న నిబంధనలేవీ లేవు. అయితే యోగా చేస్తున్నప్పుడు మనసు కాస్త ప్రశాంతంగా ఉండేందుకు మాత్రం ఉదయాన్నే చేయాలని చాలా మంది చెబుతుంటారు. దీన్ని ఒక వ్యాయామంలా భావిస్తే రోజంతా మీరు దానికి దూరంగా ఉంటారు. యోగా అంటే జీవనశైలి. దానిలోనే జీవించాలంటే రోజంతా మీరు దాన్ని మీ దినచర్యలో భాగం చేసుకోవాల్సిందే. అప్పుడు మీరు చురుకుగా, ఆరోగ్యంగా ఉంటారు.

English summary

International Yoga Day 2021 Date, History, Theme and Significance in Telugu

Here we are talking about the international yoga day 2021 date, history, theme and significance in Telugu. Have a look
Story first published: Tuesday, June 15, 2021, 10:21 [IST]