For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Kabirdas Jayanti 2022:కబీర్ దాస్ జయంతి ఎప్పుడు? తన జీవిత చరిత్ర గురించి ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి...

కబీర్ దాస్ జయంతి 2022 తేదీ, చరిత్ర, ప్రాముఖ్యత మరియు జీవిత చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ పంచాంగం ప్రకారం, కబీర్ దాస్ జయంతిని ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. 2022లో జూన్ 14వ తేదీన అంటే మంగళవారం నాడు కబీర్ దాస్ జయంతి వచ్చింది. చరిత్రను పరిశీలిస్తే క్రీస్తు పూర్వం 1398లో కబీర్ దాస్ జన్మించినట్లు తెలుస్తోంది.

Kabirdas Jayanti 2022: Date, History, Significance and Life History of Sant Kabirdas

కబీర్ దాస్ పుట్టుకతో అనేక రకాల నమ్మకాలు ఏర్పడ్డాయి. ఈయన కాలంలో భక్తి విస్తరించిందని చాలా మందది నమ్ముతారు.ఈయన తన జీవితాంతం ప్రజల ఆరాధనను, మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తూ వచ్చాడు. అయితే తన సందేశాలు, సూక్తులతో ప్రజలలో చైతన్యం నింపేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా కబీర్ దాస్ యొక్క విలువైన మాటలను తెలుసుకుని.. అజ్ణానం అనే చీకటిని తొలగించుకుందాం రండి... ప్రస్తుత కలియుగంలో ప్రేమకు, అవసరానికి, స్వార్థానికి, వ్యామోహానికి తేడానే తెలియకుండా పోయింది.

Kabirdas Jayanti 2022: Date, History, Significance and Life History of Sant Kabirdas

మనకు అవసరానికి ఉపయోగపడేవారిని మన స్నేహితులని, మిగిలిన వారు కాదనుకుంటున్నాం. మనకు అనుకూలంగా ఉండేవారిని మిత్రులని.. మిగిలిన వారిని శత్రువులుగా భావిస్తున్నాం.వ్యామోహాన్నే ప్రేమ అనుకుంటున్నాం. ప్రస్తుత సమాజంలో చాలా వరకు ప్రేమలో ఇచ్చి పుచ్చుకోవడాలు కూడా లేవు. నేను ప్రేమిస్తున్నా కాబట్టి నువ్వు కూడా నన్ను ప్రేమించు, లేదంటే నీది అసలైన ప్రేమ కాదనుకుంటాం.మనం ఇతరులను బాధ పెట్టి ప్రేమ అనుకుంటే ఎంతో పొరపాటు. ప్రేమ ఉన్న చోట బాధకు తావు లేదు. ప్రేమ అంటే త్యాగమని కూడా కాదు. వ్యామోహం కానప్పుడు త్యాగం కూడా కాదు. ప్రేమ ఎవరి మీద ఉంటుందో వారి ఆనందాన్ని కోరుకోవడమే ప్రేమ, వారి తనకి ఆనందాన్ని ఇవ్వాలనుకోవడం వ్యామోహం. తను ఇష్టపడ్డవారిని సంతోషపెట్టాలనుకునేది ప్రేమ. తన ఇష్టానికి తగ్గట్టుగా ఇతరులు ప్రవర్తించాలనుకునేది వ్యామోహం. కాబట్టి ఈ రెండూ ఒకే దగ్గర ఉండేందుకు అవకాశం లేదని కబీర్ దాస్ చెప్పాడు.

Kabirdas Jayanti 2022: Date, History, Significance and Life History of Sant Kabirdas

కబీర్ దాస్ కేవలం సాధువు మాత్రమే కాదు.. తను గొప్ప మేధావి మరియు సంఘ సంస్కర్త కూడా. ఈయన చెప్పిన మాటలను ఇప్పటికీ చాలా మంది ఫాలో అవుతున్నారు. ఈ నేపథ్యంలో కబీర్ దాస్ జయంతి సందర్భంగా తన జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

కబీర్ దాస్ పుట్టుకకు సంబంధించి అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు తను రామానంద్ గురువు ఆశీర్వాదంతో వితంతువు బ్రహ్మిణి గర్భం నుండి జన్మించాడని చెబుతారు. ఇది తెలిస్తే అందరూ అవమానిస్తారని, కాశీ సమీపంలోని చెరువు దగ్గర కబీర్ దాస్ ను విడిచిపెట్టాడని చెబుతుంటారు. ఆ సమయంలో ఆ దారిలో వెళ్తున్న లీ మరియు లోయిమా అనే నేత వారిని పెంచి పెద్ద చేసినట్లు మరి కొందరి అభిప్రాయం.

కబీర్ దాస్ పుట్టుకతో ముస్లిం అని మరియు తను గురు రామానంద్ నుండి రామనామం యొక్క జ్ణానాన్ని పొందాడని అభిప్రాయపడ్డారు.

కబీర్ దాస్ తన రచనలతో ప్రజల మనసులో ఉన్న అపొహలను తొలగించారు. సమాజం మెరుగుదలకు ఎన్నో ద్విపదలు చెప్పారు. అందుకే ఆయనను సంఘ సంస్కర్త అని చెప్పేవారు.

అప్పట్లో సమాజంలో అనేక రకాల మూఢ నమ్మకాలు ఉండేవి. కాశీలో మరణించిన వ్యక్తి స్వర్గాన్ని పొందుతాడని, మగహర్ లో నరకం అనుభవించాల్సి ఉంటుందని కూడా ఒక మూఢ నమ్మకం ఉండేది. అయితే కబీర్ దాస్ ప్రజలలో వ్యాపించిన ఈ మూఢ నమ్మకాన్ని తొలగించడానికి, కబీర్ జీ తన జీవితమంతా కాశీలో నివసించాడు. చివరికి తన మగహర్ కు బయలుదేరి మగహర్ లోనే మరణించాడు.

కబీర్ దాస్ ను విశ్వసించే వారు ప్రతి మతానికి చెందిదన వారని, అందుకే తను మరణించినప్పడు తన అంత్యక్రియల విషయంలో హిందువులు మరియు ముస్లింల మధ్య వివాదం ఏర్పడిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తన శరీరం నుండి పూలు కూడా వచ్చాయని, ఈ పువ్వులను అందరూ పంచుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం వారి మత ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.

FAQ's
  • కబీర్ దాస్ ఎప్పుడు జన్మించారు? 2022లో కబీర్ దాస్ జయంతి ఎప్పుడు?

    హిందూ పంచాంగం ప్రకారం, కబీర్ దాస్ జయంతిని ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. 2022లో జూన్ 14వ తేదీన అంటే మంగళవారం నాడు కబీర్ దాస్ జయంతి వచ్చింది. చరిత్రను పరిశీలిస్తే క్రీస్తు పూర్వం 1398లో కబీర్ దాస్ జన్మించినట్లు తెలుస్తోంది. కబీర్ దాస్ పుట్టుకతో అనేక రకాల నమ్మకాలు ఏర్పడ్డాయి. ఈయన కాలంలో భక్తి విస్తరించిందని చాలా మందది నమ్ముతారు.ఈయన తన జీవితాంతం ప్రజల ఆరాధనను, మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తూ వచ్చాడు. అయితే తన సందేశాలు, సూక్తులతో ప్రజలలో చైతన్యం నింపేందుకు ప్రయత్నించారు.

English summary

Kabirdas Jayanti 2022: Date, History, Significance and Life History of Sant Kabirdas

Here we are talking about the Kabirdas Jayanti 2022: Date, History, Significance and Life History of Sant Kabirdas. Read on
Story first published:Monday, June 13, 2022, 12:36 [IST]
Desktop Bottom Promotion