Latest Updates
-
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్
SidKiara: అప్పుడు నాలో యాహూ.. ఫీలింగ్, ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటే ఆ ఆనందమే వేరు
సిద్ధార్థ్ ను పెళ్లి చేసుకున్న సమయంలో తనలో యాహూ.. ఫీలింగ్ కలిగిందని, ఎంతో ఆనందం వేసిందని కియారా అద్వానీ పేర్కొంది.
ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకుని బాలీవుడ్ క్యూట్ కపూల్ అంటూ పేరు తెచ్చుకున్నారు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా. కొన్నేళ్ల తమ ప్రేమ బంధాన్ని మూడు ముళ్ల బంధంగా మార్చుకున్నారు. పెళ్లి వేడుక అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో జరగ్గా.. రిసెప్షన్ పార్టీని మాత్రం అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. బాలీవుడ్, క్రీడా ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. పెళ్లైన తర్వాత ఈ జంట కలిసి తొలిసారిగా ఓ వేడుకలో పాల్గొన్నారు. పెళ్లి సమయంలో వాళ్లు పొందిన ఆనందం, అనుభూతి గురించి అక్కడ పంచుకున్నారు.

సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఓ అవార్డు వేడుకకు హాజరయ్యారు. అక్కడ ఉన్న యాంకర్ నూతన జంటను స్టేజిపైకి ఆహ్వానించి తమ ప్రేమ, పెళ్లి గురించి పలు ప్రశ్నలు అడిగారు. సిద్దార్థ్ ని పెళ్లి చేసుకునే సమయంలో మీరెలా ఫీలయ్యారు అంటూ కియారాను ఆ యాంకర్ ప్రశ్నించారు.

'పెళ్లి సమయంలో చాలా భావోద్వేగానికి గురయ్యాను. మనసులో చాలా ఆనందం. పెళ్లి మండపానికి అలా నడిచి వస్తున్నప్పుడు మనసు నిండా సంతోషం. నేను నడిచి వస్తున్నప్పుడు.. సిద్ధార్థ్ పెళ్లి పీటలపై కూర్చుని నా వైపే చూస్తున్నాడు. అప్పుడు నా మనసులో యాహూ.. నాకు పెళ్లవుతోంది.. నేను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నానని అనుకున్నాను. ఈ ఫీలింగ్ కేవలం నాకే కాదు.. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఎవరికైనా ఇలాంటి ఆనందమే కలుగుతుంద'ని పేర్కొంది.

అక్కడే ఉన్న సిద్ధార్థ్ మల్హోత్రా మాట్లాడుతూ.. 'ఈ అవార్డుల వేడుకకు నేను నా కో-స్టార్, నేను తనని పెళ్లి చేసుకునేలా అద్భుతంగా ఒప్పించగలిగిన నా భార్యతో వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంద'ని అన్నాడు.

ఈ అవార్డుల వేడుకలో కొత్త జంట సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ వేడుకకు వచ్చిన వాళ్లంతా సిద్ధార్థ్ - కియారాలను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ అవార్డు ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



Click it and Unblock the Notifications